21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?

Date:

Off The Record: 2024 అసెంబ్లీ ఎన్నికల షాక్ నుంచి వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోలుకుంది. ప్రభుత్వ విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తోంది. కానీ… ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీలో మాత్రం ఒకప్పటి ఉత్సాహం, నాటి పెత్తనాలు కనిపించడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. మరీ ముఖ్యంగా… పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఇప్పుడు పూర్తిగా మౌనం పాటించడం హాట్ టాపిక్‌గా మారింది. మొన్నటి ఎన్నికల్లో జిల్లా వైసీపీ నేతలంతా ఓడిపోయినా… పెద్దిరెడ్డి కుటుంబం మాత్రం గెలిచింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఫ్యామిలీ మీద గట్టిగా కన్నేయడంతో సీన్ రివర్స్ అయింది. వరుస కేసులు, దర్యాప్తు సంస్థల నిఘాతో పూర్తిగా డిఫెన్స్‌లో పడ్డారన్న మాట వినిపిస్తోంది. 2019-24 మధ్య కాలంలో జరిగిన అనేక వ్యవహారాలకు సంబంధించి వివాదాల్లో ఇరుక్కున్నారు మాజీ మంత్రి. భూ ఆక్రమణలు, మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్‌ రూమ్‌లో మంటలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యమైన ఫైళ్ళు తగలబడటం వెనక కుట్ర కోణం ఉందని పోలీసులు నిర్ధారించడంతో…. అన్ని వేళ్ళు పెద్దిరెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, ముఖ్య అనుచరులపైనే చూపించాయి. దీంతో కేసు నమోదు తర్వాత మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి తుకారం సహా చాలామంది అరెస్టు అయ్యారు‌‌‌‌.

ఆ కేసు బుక్‌ అయి ఏడాదిన్నార దాటినా ఏమీ జరగలేదని స్థానిక కూటమి క్యాడర్ నిట్టూరుస్తున్నా…, ప్రభుత్వ పరంగా చాపకింద నీరులా జరగాల్సింది జరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇక పెద్దిరెడ్డి భార్య స్వర్ణలతతో పాటు బినామీల పేరు మీద జరిగిన డీకే భూముల అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆ మధ్య ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే… తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసం ఉంటున్న ప్రాంతం బుగ్గమఠం భూములపై విచారణ తుదిదశకు చేరింది. ఇలా అన్నివైపుల నుంచి పెరిగిన వత్తిళ్ళతో పెద్దిరెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని, అందుకే ఎక్కడా రియాక్ట్‌ అవడం లేదన్నది ఇంటర్నల్‌ టాక్‌. ఒకప్పుడు జిల్లాలో తాము గీసిందే గీత అన్నట్టుగా సాగిన వ్యవహారాలన్నీ ఇప్పుడు రివర్స్ కొడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ​దీనికి తోడు అక్రమ ఇసుక, మైనింగ్ కేసులు కూడా పెద్దిరెడ్డి కుటుంబాన్ని గట్టిగా వెంటాడుతున్నాయి. తాజాగా ఇసుక వ్యవహారాలపై ఈడీ రైడ్స్ జరగడం చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కాక రేపింది. ఇక పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని పులిచర్ల మండలంలో అటవీ భూములను ఆక్రమించి ఫాంహౌస్ నిర్మించారంటూ అటవీ అధికారులు యాక్షన్ తీసుకున్నారు. రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి.., సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, ఆయన భార్య ఇందిరపై అటవీ శాఖ కేసులు నమోదు చేయడమేగాక ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంది. అలా…అన్ని వైపుల నుంచి లీగల్‌గా, ఇతరత్రా ప్రెజర్ పెరుగుతుండటంతోనే పెద్దాయన బయటకు రావడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో. తాజాగా సొంత సంస్థ… పీఎల్ఆర్ ఇన్ ఫ్రా పనులపై విజిలెన్స్ దర్యాప్తు మొదలైంది.

ఏపీఆర్ఆర్పీ కింద దాదాపు 490 కోట్ల రూపాయల రహదారి పనులకు సంబంధించి దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు, అసలు పనులు చేయకుండానే బిల్లులు తీసుకున్నారన్న ఆరోపణల మీద ఫోకస్‌ చేశారు. ఇందులో భాగంగా పూర్తయిన 350 పనులపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోందట. మరోవైపు లిక్కర్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌ అధికారులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో 70 రోజులకు పైగా రాజమండ్రి జైలులో ఉన్నారాయన. బెయిల్ పై బయటకు వచ్చాక… మళ్లీ పాత రోజుల్లోలా యాక్టివ్‌గా లేకపోవడంపై కేడర్‌లో ఆందోళన వ్యక్తం అవుతోందట. అదంతా ఒక ఎత్తయితే…. ఎంత కేసులుంటే మాత్రం అంత పెద్ద నాయకులు భయపడతారా…? వాళ్ళ మౌనానికి అదే కారణమా? లేక అంతకు మించిన రీజన్స్‌ వేరే కూడా ఉన్నాయా అన్న సందేహాలు సైతం ఓ వర్గంలో ఉన్నాయట. రేపు స్థానిక సంస్థల ఎన్నికల నాటికి వీరు మౌనం వీడకుంటే… పార్టీ పరిస్థితి తేడాగా ఉంటుందని, జిల్లాలో ఇక నోరెత్తలేమంటూ కొంతమంది వైసీపీ సీనియర్స్‌ బహిరంగంగానే కామెంట్‌ చేస్తున్నారు. లోకల్‌ బాడీస్‌లో ఏకగ్రీవాలు ఉండకూడదు, సత్తా చాటాలని పార్టీ అధినేత జగన్‌ ఇప్పటికే
చేసిన ప్రకటన ఇక్కడి లీడర్స్‌ని మరింత టెన్షన్‌ పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. తండ్రీ కొడుకులు తిరిగి యాక్టివ్‌ అవుతారా లేదా అని ఆసక్తిగా గమనిస్తున్నారు జిల్లా వైసీపీ నేతలు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹിന്ദു സംസ്‌കാരത്തെ അപമാനിക്കുന്നതും പാരമ്പര്യത്തെ തകര്‍ക്കുന്നതും; ഹിന്ദു വര്‍ഗീയതയ്‌ക്കെതിരായ ഹാമിദ് അന്‍സാരിയുടെ പരാമര്‍ശത്തിനെതിരെ യോഗി

ന്യൂഡല്‍ഹി: മുന്‍ ഉപരാഷ്ട്രപതി ഹമീദ് അന്‍സാരിയുടെ ‘ഹിന്ദു വര്‍ഗീയത’യുമായി ബന്ധപ്പെട്ട പരാമര്‍ശങ്ങള്‍ക്കെതിരെ...

`இன்னும் பழைய அரசாங்கத்தையே குறைச் சொல்லிக்கொண்டிருப்பதில் நியாயமில்லை' – விஜய்யை சாடிய எல்.முருகன்

மத்திய இணை அமைச்சர் எல்.முருகன், வேலூரில் செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது அவர்...

Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఒక్కరోజే సంచలనంగా మారిన యువ...

ಗಣೇಶೋತ್ಸವವನ್ನು ರಾಜಕೀಯ ಸಂಘರ್ಷದ ವೇದಿಕೆಯನ್ನಾಗಿಸಬಾರದು: ಎಚ್.ಎ. ವೆಂಕಟೇಶ್

  ಮೈಸೂರು, SEP.20,2026: ರಾಜ್ಯದಲ್ಲಿ ಗಣೇಶೋತ್ಸವ ಹಾಗೂ ವಿಸರ್ಜನಾ ಮೆರವಣಿಗೆಗಳ ಸಂದರ್ಭದಲ್ಲಿ...