14
May, 2026

A News 365Times Venture

14
Thursday
May, 2026

A News 365Times Venture

Angkor Wat: ప్రపంచంలో అతి పెద్ద గుడి ఏది.? ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే.!

Date:

Angkor Wat: మనలో చాలామంది ఆలయాలకు వెళ్లే అలవాటు ఉండనే ఉంటుంది. అప్పుడు పుణ్యక్షేత్రాలు కూడా దర్శిస్తుంటాము. అయితే ఎప్పుడైనా ప్రపపంచంలో అతి పెద్ద ఆలయం ఎక్కడ ఉంది? అని ఆలోచించారా.? లేదు కదా.. అయితే ఇపుడు ఆ విశేషాలేంటో ఇక్కడ చూసేద్దాం.. కంబోడియా దేశంలోని సియమ్ రీప్ ప్రాంతంలో విరాజిల్లుతున్న అంగ్కోర్ వాట్ ప్రపంచ చరిత్రలో అత్యంత అద్భుతమైన దేవాలయ నిర్మాణాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. వేల ఏళ్ల చరిత్రను మోస్తూ తన శిల్పకళ, వైభవం, ఆధ్యాత్మికతతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. హిందూ సంప్రదాయం, ఖ్మేర్ సంస్కృతి, బౌద్ధ ప్రభావం కలిసిన ఈ మహా కట్టడం కేవలం ఆలయం మాత్రమే కాదు.. ఒక నాగరికతకు ప్రతీక.

‘అంగ్కోర్ వాట్’ అంటే ఏమిటి?
‘అంగ్కోర్’ అంటే “నగరం”, ‘వాట్’ అంటే “దేవాలయం”. అంటే “దేవాలయాల నగరం” అనే అర్థం వస్తుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన నిర్మాణ సముదాయం. మొదట ఇది హిందూ దేవాలయంగా నిర్మించబడింది. అనంతరం బౌద్ధ ఆలయంగా మారింది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో ఖ్మేర్ సామ్రాజ్యానికి చెందిన రాజు సూర్యవర్మన్ II (Suryavarman II) నిర్మించాడు. ఆయన విష్ణుమూర్తికి అంకితంగా ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

Image (5)

అంగ్కోర్ వాట్ నిర్మాణం చూసినవారెవరైనా ఆశ్చర్యపోతారు. ఈ ఆలయం ఖ్మేర్ ఆర్కిటెక్చర్‌కు పరాకాష్టగా చెప్పవచ్చు. ఈ ఆలయ ప్రధాన విశేషాలను చూస్తే.. ఇది సుమారు 400 ఎకరాల విస్తీర్ణం, చుట్టూ భారీ కందకం, ఐదు ప్రధాన గోపురాలు, మధ్య గోపురం మెరు పర్వతాన్ని సూచించేలా నిర్మాణం, వేలాది శిల్పాలు, బాస్ రిలీఫ్ కళాచిత్రాలు, ఖచ్చితమైన ఖగోళ, గణిత ప్రమాణాలతో నిర్మాణం జరిగిఉంది. ఈ ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన రాళ్లను చాలా దూర ప్రాంతాల నుంచి తీసుకువచ్చినట్లు పురాణాలూ చెబుతున్నాయి. అంగ్కోర్ వాట్‌లోని గోడలపై భారతీయ ఇతిహాసాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ప్రధాన శిల్పాలలో సముద్ర మథనం, రామాయణ యుద్ధ ఘట్టాలు, మహాభారత యుద్ధ దృశ్యాలు, దేవతలు, అసురుల ప్రతిరూపాలు, విష్ణుమూర్తి అవతారాలు ప్రసిద్ధి గాంచాయి. ప్రతి గోడ ఒక కథ చెబుతున్నట్టుగా ఉంటుంది.

ఎందుకు పశ్చిమ దిశగా నిర్మించారు?
హిందూ దేవాలయాలు సాధారణంగా తూర్పు దిశగా ఉంటాయి. కానీ అంగ్కోర్ వాట్ మాత్రం పశ్చిమాభిముఖంగా నిర్మించబడింది. దీనిపై చరిత్రకారుల్లో ఇంకా చర్చ కొనసాగుతోంది. అయితే ఇందుకు కొంతమంది ఇది విష్ణుమూర్తికి సంబంధించిన దిశ కావచ్చని, అలాగే రాజు సమాధి ఆలయంగా భావించి నిర్మించి ఉండవచ్చని అనుకుంటున్నారు. ప్రారంభంలో విష్ణుమూర్తికి అంకితమైన ఈ ఆలయం, తర్వాత బౌద్ధ ప్రభావంతో బౌద్ధ ప్రార్థనా కేంద్రంగా మారింది. ప్రస్తుతం అక్కడ బౌద్ధ సన్యాసులు కూడా కనిపిస్తారు. ఈ మార్పు జరిగినప్పటికీ హిందూ శిల్ప సంపద మాత్రం అలాగే సంరక్షించబడింది.

Image (6)

కొన్ని శతాబ్దాల పాటు అంగ్కోర్ ప్రాంతం అడవులతో కప్పబడి ప్రపంచానికి దాదాపు తెలియకుండా పోయింది. తర్వాత పాశ్చాత్య పరిశోధకులు దీన్ని గుర్తించారు. ఆ తర్వాత ప్రపంచ దృష్టి ఈ దేవాలయంపై పడింది. UNESCO 1992లో అంగ్కోర్ వాట్‌ను ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది. అప్పటి నుంచి సంరక్షణ పనులు మరింత వేగంగా సాగుతున్నాయి. ఈ ‘అంగ్కోర్ వాట్’ కేవలం ఒక దేవాలయం కాదు.. కంబోడియా దేశ గర్వకారణం. దేశ జాతీయ జెండాపై అంగ్కోర్ వాట్ చిత్రం ఉంటుంది. దేశ పర్యాటక రంగానికి ఈ ఆలయం ప్రధాన ఆకర్షణ. ప్రతి ఏడాది లక్షలాది మంది సందర్శకులు వస్తుంటారు.

ప్రపంచవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు అంగ్కోర్ వాట్ సన్‌రైజ్ కోసం ప్రత్యేకంగా వెళ్తారు. ఉదయం సూర్య కిరణాలు ఆలయ గోపురాల వెనుక నుంచి వెలువడే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. నీటిలో కనిపించే ఆలయ ప్రతిబింబం మరింత అందాన్ని ఇస్తుంది. ఈ పెద్ద ఆలయం కేవలం ఒక పురాతన దేవాలయం మాత్రమే కాదు.. అది ఒక మహా నాగరికతకు జీవంత సాక్ష్యం. భారతీయ సంస్కృతి ప్రభావం ఆసియా ఖండంలో ఎంత లోతుగా విస్తరించిందో చెప్పే గొప్ప ఉదాహరణ. శిల్పకళ, ఆధ్యాత్మికత, చరిత్ర, విజ్ఞానం అన్నీ కలిసిన ఈ అద్భుత నిర్మాణం ప్రపంచ అద్భుతాల్లో ఒకటిగా ఎప్పటికీ నిలిచిపోతుంది.

Image (7)

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നിങ്ങള്‍ ബി.ജെ.പിയെ പിന്തുണച്ചതൊന്നും ജനം മറന്നിട്ടില്ല; കണക്കുകള്‍ നിരത്തി ഡി.എം.കെയെ കടന്നാക്രമിച്ച് വിജയ്‌യുടെ തുറന്ന കത്ത്

ചെന്നൈ: തമിഴ്നാട് നിയമസഭയില്‍ നടന്ന വിശ്വാസ വോട്ടെടുപ്പില്‍ വന്‍ ഭൂരിപക്ഷത്തോടെ വിജയിച്ച്...

விஜயபாஸ்கர் கோட்டையில் வேலுமணியின் `ஆள்' – எடப்பாடியால் என்ட்ரி ஆகும் வி.பழனிவேல் பின்னணி என்ன?

அதிமுகவில் நிலவிவரும் உட்கட்சிப் பூசலால் எடப்பாடி பழனிசாமி அதிரடியாக பல அஸ்திரங்களை...

ವಚನಾನಂದ ಸ್ವಾಮೀಜಿ ವಿರುದ್ದ ಪೋಕ್ಸೋ ಕೇಸ್ ನಲ್ಲಿ FIR ದಾಖಲು..!

ಗದಗ,ಮೇ,14,2026 (www.justkannada.in): ಗದಗ ಜಿಲ್ಲೆ ಹರಿಹರದ ಪಂಚಮಸಾಲಿ ಪೀಠದ ವಚನಾನಂದ...

കേരളം കാത്തിരുന്നത് പത്ത് ദിവസം; ഒടുവില്‍ മുഖ്യമന്ത്രിയെ ഇന്ന് പ്രഖ്യാപിക്കാനൊരുങ്ങി കോണ്‍ഗ്രസ്

തിരുവനന്തപുരം: ദിവസങ്ങള്‍ നീണ്ട അനിശ്ചിതത്വങ്ങള്‍ക്കൊടുവില്‍ കേരളത്തിന്റെ പുതിയ മുഖ്യമന്ത്രി ആരെന്ന് ഇന്ന്...