12
May, 2026

A News 365Times Venture

12
Tuesday
May, 2026

A News 365Times Venture

PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..

Date:

PM Modi: తొలిసారిగా పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బెంగాల్‌లో ఎలాంటి ఉత్సాహాన్ని చూశామో, తెలంగాణలో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటూ తెలుగులో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని ఆయన అన్నారు. మమత నియంతృత్వం నుంచి బెంగాల్ విముక్తమైందని అన్నారు.

Read Also: Warren Buffett: ‘అమ్మా.. నీ కోపమే నన్ను ప్రపంచ విజేతను చేసింది’.. వారెన్ బఫెట్

కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అవినీతి రాజ్యమేలుతుందని ప్రధాని మోడీ విమర్శలు చేశారు. ఆబ్ కీ బార్ బీజేపీ సర్కార్ తెలంగాణలో కూడా వినిపిస్తోందని చెప్పారు. తెలంగాణ యువత ప్రేమను నా కళ్లతో చూస్తున్నాని అన్నారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విస్తరిస్తోందని అన్నారు. పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారని, ఇప్పుడు 200కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారని అన్నారు. ఒకప్పుడు బీజేపీ కార్యకర్తలు కూడా లేని బెంగాల్‌లో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిందని అన్నారు. ఒకప్పుడు బీజేపీకి ఇద్దరు ఎంపీలు ఉండేవారని, ఒకరు తెలంగాణ వారే అని ఆయన గుర్తు చేశారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పాలనతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆయన అన్నారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని బీజేపీ నమ్ముతుందని, దేశ అభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. తెలంగాణకు వేల కోట్ల నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ను అన్ని రకాలుగా కేంద్రం అభివృద్ధి చేస్తుందని వివరించారు. వచ్చ ఎన్నికల్లో తెలంగాణలో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"அந்த கட்டட தொழிலதிபராலத்தான் இத்தனை குழப்பம்.!" – பொங்கும் அ.தி.மு.க கிளர்ச்சியாளர்கள்

அ.தி.மு.க-வுக்குள் உச்சக்கட்ட குழப்பம் வெடித்திருக்கிறது. அக்கட்சியின் பொதுச் செயலாளரான எடப்பாடி பழனிசாமியின்...

Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక

పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఇప్పటికే దేశ ప్రజలు పొదుపు మంత్రం పాటించాలని...

ಬೀರೇಶ್ವರ ದೇವಾಲಯದ ಬಸವ ವಿಧಿವಶ: ಭಕ್ತರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಅಂತ್ಯಸಂಸ್ಕಾರ

ಮೈಸೂರು,ಮೇ.12,2026 (www.justkannada.in):  ವಯೋಸಹಜ ಸಮಸ್ಯೆಯಿಂದ ಮೃತಪಟ್ಟ ಮೈಸೂರು ತಾಲೂಕಿನ ವರಕೋಡು...