26
June, 2026

A News 365Times Venture

26
Friday
June, 2026

A News 365Times Venture

PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

Date:

ప్రధాని మోడీ ఆదివారం దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు వస్తున్నారు. కర్ణాటక, తెలంగాణలో మోడీ పర్యటించనున్నారు. రెండు రాష్ట్రాల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు బీజేపీ సభలో ప్రసంగించనున్నారు.

ఉదయం 11 గంటలకు కర్ణాటకలో నిర్వహించనున్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. సమాజ సేవ లక్ష్యంగా వివిధ రంగాల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని మోడీ పేర్కొన్నారు. పర్యటనలో భాగంగా సుమారు రూ.9500 కోట్ల విలువైన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. రహదారులు, లాజిస్టిక్స్, వస్త్ర పరిశ్రమ, రైల్వేలు, ఇంధన రంగం తదితర విభాగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. అలాగే సింధు ఆస్పత్రిని జాతికి అంకితం చేసే కార్యక్రమంలో కూడా ప్రధాని పాల్గొననున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు.

హైదరాబాద్ టూర్ నేపథ్యంలో మోడీ కీలక ట్వీట్ చేశారు. ‘‘గతంలో బీఆర్ఎస్ దుష్పరిపాలన.. ఇప్పుడు కాంగ్రెస్ దుష్పరిపాలనతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. మాకు పెరుగుతున్న మద్దతును బట్టి చూస్తే.. తెలంగాణ ప్రజల మొదటి ఎంపిక మా పార్టీయే.’’ అని మోడీ పేర్కొన్నారు.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

രാമക്ഷേത്ര തട്ടിപ്പ്: ആറ് പേര്‍ കൂടി അറസ്റ്റില്‍; ചമ്പത്ത് റായും അനില്‍ മിശ്രയും രാജിവച്ചു

ലഖ്‌നൗ: അയോധ്യ രാമക്ഷേത്ര സംഭാവന തട്ടിപ്പില്‍ ആരോപണ വിധേയനായ ക്ഷേത്ര ട്രസ്റ്റ്...

ஆதார், பான், பாஸ்போர்ட்டெல்லாம் அல்ல… இவைதான் குடியுரிமைக்கான ஆதாரம்! – மத்திய அரசு சொல்வதென்ன?

'பாஸ்போர்ட் வெறும் போக்குவரத்து ஆவணம் தான்... குடியுரிமைக்கான ஆதாரம் அல்ல' -...

ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್ ಬಗ್ಗೆ ವರಿಷ್ಠರು ಪರಿಹಾರ ನೀಡ್ತಾರೆ- ಸಚಿವ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿ

ಬೆಳಗಾವಿ,ಜೂನ್,26,2026 (www.justkannada.in): ಬಿಡದಿ ಟೌನ್ ಶಿಪ್ ಬಗ್ಗೆ ಗೊಂದಲ ಇರುವುದು...