7
May, 2026

A News 365Times Venture

7
Thursday
May, 2026

A News 365Times Venture

Suvendu Adhikari: మమతా బెనర్జీని ఓడించినందుకే నా పీఏను హత్య చేశారు..

Date:

Suvendu Adhikari: బెంగాల్‌లో ఎన్నికల తర్వాత హత్యా రాజకీయాలు ఆగడం లేదు. బీజేపీ నేత, ముఖ్యమంత్రి రేసులో ముందున్న సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రథ్‌ను కొందరు దుండగులు దారుణంగా హత్య చేశారు. పక్కా పథకం ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు. గురువారం రథ్ పోస్టుమార్టం అనంతరం బరసత్ స్టేట్ జనరల్ హాస్పిటల్ వెలుపల సువేందు మాట్లాడుతూ.. చంద్రనాథ్ రథ్ తనకు పీఏగా పనిచేయకపోయినా, తాను మమతా బెనర్జీని ఓడించకపోయినా, ఆ మాజీ భారత వైమానిక దళ అధికారి హత్యకు గురయ్యేవాడు కాదని ఆయన అన్నారు.

Read Also: Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?

రథ్ తన సహాయకుడు కావడం వల్లే, మమతా బెనర్జీని తాను భవానీపూర్‌లో ఓడించడం వల్లే హత్యకు గురయ్యారని సువేందు అధికారి అన్నారు. తాను రథ్ కుటుంబానికి అండగా నిలుస్తానని, హత్య చేసిన వారిని పట్టుకుని శిక్ష పడేలా చూస్తానని, అతడిపై 4 బుల్లెట్లు కాల్చినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని, ఈ హత్య ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందని ఆయన అన్నారు. రథ్‌కు వ్యక్తిగత లేదా రాజకీయ వైరం లేదని సువేందు చెప్పారు.

కోల్‌కతా సమీపంలోని మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో బుధవారం రాత్రి రథ్ కారును వెండించి, తుపాకీతో కాల్చి చంపారు. ఈ ఘటనలో ఆయన మరణించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామం చండీపూర్‌కు తీసుకెళ్లారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య సహా సీనియర్ బీజేపీ నాయకులు నివాళులర్పించారు. ఈ ఘటనలో హత్యకు ఉపయోగించిన బైక్‌ను ఘటనాస్థలికి నాలుగు కిలోమీటర్ల దూరంలో పోలీసులు గుర్తించారు. కొందరు అనుమానితుల్ని ప్రశ్నిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നിന്റെ കുഴലൂത്ത് ലീഗിനെതിരെ വേണ്ട; മാത്യു കുഴൽനാടനെതിരെ യൂത്ത് ലീഗിന്റെ പോസ്റ്റർ

കണ്ണൂർ: മാത്യു കുഴൽനാടനെതിരെ പോസ്റ്റർ പതിപ്പിച്ച് യൂത്ത് ലീഗ്. നിൻ്റെ കുഴലൂത്ത്...

விசிலடிக்காத 8 மாவட்டங்கள் `டு' 10 ஆண்டுகளுக்கு பின் சட்டசபை செல்லும் கட்சி – 2026 தேர்தல் ஹைலைட்ஸ்

முதல்வர் வேட்பாளர்கள்... ஷாக், சர்ப்ரைஸ்!2026 சட்டசபைத் தேர்தலில் முதலமைச்சர் வேட்பாளர்களாக நான்கு...

ರೈತರ ಹಣಕಾಸಿನ ನಿರ್ವಹಣೆ ಬಗ್ಗೆ ಬ್ಯಾಂಕ್ ಹಣಕಾಸು ಸಂಸ್ಥೆಗಳಲ್ಲಿರುವ ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಸಿ- ಕುರುಬೂರು ಶಾಂತಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಮೇ,7,2026 (www.justkannada.in): ರೈತರ ಹಣಕಾಸಿನ ನಿರ್ವಹಣೆ ಬಗ್ಗೆ ಬ್ಯಾಂಕುಗಳಲ್ಲಿ ಹಣಕಾಸು...

‘വോട്ടുണ്ടായിരുന്നെങ്കില്‍ ജയിപ്പിക്കുമായിരുന്നു’; പ്രിയപ്പെട്ട ‘മന്ത്രിയപ്പൂപ്പന്റെ’ പടിയിറക്കത്തില്‍ കണ്ണീരണിഞ്ഞ് വിദ്യാര്‍ത്ഥികള്‍

തിരുവനന്തപുരം: നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിലെ അപ്രതീക്ഷിത ഫലങ്ങളില്‍ കേരളം ഏറ്റവും കൂടുതല്‍ ചര്‍ച്ച...