30
April, 2026

A News 365Times Venture

30
Thursday
April, 2026

A News 365Times Venture

Freezer Ice Smell Solution: ఫ్రీజర్‌లోని ఐస్‌ నుంచి దుర్వాసన వస్తుందా..? 2 నిమిషాల్లో తొలగించే సులభమైన చిట్కాలు..!

Date:

Freezer Ice Smell Solution: వేసవి కాలంలో చల్లని పానీయాలు తాగేటప్పుడు ఐస్ తప్పనిసరి. అయితే, కొన్నిసార్లు ఫ్రీజర్‌లో తయారయ్యే ఐస్‌కు వింత వాసన రావడం వల్ల పానీయాల రుచి కూడా చెడిపోతుంది. ఈ సమస్య చాలా మందికి ఎదురవుతుంటుంది. ఐస్‌కు వచ్చే ఈ దుర్వాసనకు ప్రధాన కారణం ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన ఆహార పదార్థాల వాసనలు కూడా కారణం అవుతుంటాయి.. ఫ్రీజర్‌లో గాలి ప్రసరణ సరిగా లేకపోవడం, అలాగే తెరిచి ఉంచిన ఆహారం నుంచి వచ్చే వాసనలు ఐస్‌లోకి చేరడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. ముఖ్యంగా చేపలు, ఉల్లిపాయలు వంటి ఘాటైన వాసన కలిగిన పదార్థాలను సరిగ్గా కవర్ చేయకుండా ఉంచితే, వాటి వాసన ఐస్ క్యూబ్స్‌లోకి చేరిపోతుంది.

దుర్వాసను తరిమివేసే చిట్కాలు..
* ఈ సమస్యను నివారించాలంటే ముందుగా ఫ్రీజర్‌లో ఉన్న ఆహారాన్ని సరిగా ప్యాక్ చేయడం చాలా అవసరం. ఎల్లప్పుడూ గాలి చొరబడని డబ్బాలు లేదా కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయాలి. అలాగే ఐస్ ట్రేలను కూడా మూత ఉన్న డబ్బాల్లో లేదా సీల్డ్ బ్యాగ్‌లలో ఉంచడం వల్ల బయటి వాసనలు ఐస్‌పై పడకుండా ఉంటుంది.

* ఫ్రీజర్‌లో దుర్వాసనలను తొలగించడానికి బేకింగ్ సోడా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రీజర్‌లో ఒక మూలలో మూతలేని పాత్రలో బేకింగ్ సోడా ఉంచితే, అది గాలిలోని చెడు వాసనలను పీల్చుకుని ఫ్రీజర్‌ను తాజాగా ఉంచుతుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి బేకింగ్ సోడాను మార్చడం మంచిది.

* ఇంకా ఒక ముఖ్యమైన చిట్కా ఏమిటంటే ఐస్‌ను క్రమం తప్పకుండా మార్చడం. చాలా రోజుల పాటు నిల్వ ఉంచిన ఐస్ తేమను, వాసనలను పీల్చుకుని రుచి కోల్పోతుంది. అందుకే ప్రతి రెండు వారాలకు ఒకసారి ఐస్ ట్రేను ఖాళీ చేసి, గోరువెచ్చని నీరు, సబ్బుతో శుభ్రం చేసి మళ్లీ కొత్త ఐస్ తయారు చేయడం మంచిది.

* ఈ చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే, ఫ్రీజర్‌లోని ఐస్ ఎప్పుడూ స్వచ్ఛంగా, వాసన లేకుండా ఉంటుంది. దీంతో మీ చల్లని పానీయాలు మరింత రుచిగా మారుతాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ 2026 సెషన్‌కు సంబంధించిన యూజీసీ...

ಬೌರಿಂಗ್ ಆಸ್ಪತ್ರೆ ಕಾಂಪೌಂಡ್ ದುರಂತ: ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲಿಸಿದ ಲೋಕಾಯುಕ್ತ ನ್ಯಾ.ಬಿ.ಎಸ್. ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,30,2026 (www.justkannada.in):  ಭಾರೀ ಮಳೆಯಿಂದಾಗಿ ಬೌರಿಂಗ್ ಆಸ್ಪತ್ರೆಯ ತಡೆಗೋಡೆ ಕುಸಿದು...

മുഖ്യമന്ത്രി സ്ഥാനത്തേക്ക് വി.ഡി സതീശന്‍ എന്നതാണ് ജനവികാരം; പിന്തുണയുമായി മുസ്‌ലിം ലീഗ്

മലപ്പുറം: പ്രതിപക്ഷ നേതാവ് വി.ഡി സതീശന് പരസ്യ പിന്തുണയുമായി മുസ്‌ലിം ലീഗ്....

`திமுக வரக்கூடாது' – கலக்கத்தில் தவாக டு எதிர்ப்பு காட்டிய நிர்வாகி; அச்சத்தில் அமைச்சர்! | கழுகார்

கலக்கத்தில் த.வா.க"தி.மு.க ஆட்சிக்கு வரக்கூடாது!"தி.மு.க ஆட்சிக்கு வந்துவிடக்கூடாது என, அ.தி.மு.க-வினரைவிட அதிகமாக...