4
May, 2026

A News 365Times Venture

4
Monday
May, 2026

A News 365Times Venture

Zohran Mamdani-King Charles: కోహినూర్‌ వజ్రం భారత్‌కు ఇచ్చేయండి.. కింగ్ చార్లెస్‌‌కు మమ్దానీ విజ్ఞప్తి!

Date:

బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ దంపతులు ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. కింగ్ చార్లెస్ పర్యటన ఆసక్తికరంగా మారింది. అయితే న్యూయార్క్‌లోని 9/11 స్మారక చిహ్నం దగ్గర జరిగిన పుష్పగుచ్ఛ సమర్పణ కార్యక్రమంలో న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దానీ మాట్లాడుతూ.. తనకు కింగ్ చార్లెస్‌ను కలిసే అవకాశం వస్తే.. కోహినూర్ వజ్రం భారత్‌కు తిరిగి ఇచ్చేయాలని కోరతానని పేర్కొన్నారు. ఈ విషయం అధికారిక చర్చల్లో లేకపోయినా.. రాజుతో వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చారు.

K

ఇక స్మారక కార్యక్రమంలో కింగ్ చార్లెస్‌ను మమ్దానీ పలకరించారు. ఆ సమయంలో కోహినూర్ వజ్రం అంశం ప్రస్తావనకు వచ్చిందో.. రాలేదో మాత్రం స్పష్టత రాలేదు. ఈ విషయంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ కూడా ఇంకా స్పందించలేదు.

కోహినూర్ వజ్రం భారత్‌కు చెందిన అమూల్యమైన వజ్రం. ఇది బ్రిటిస్ పాలనలో వారి చేతికి చిక్కింది. ప్రస్తుతం బ్రిటిష్ క్రౌన్ జువెల్స్‌లో ఉంది. అయితే ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని భారత్ ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తోంది. కానీ బ్రిటన్ మాత్రం ఇచ్చేందుకు నిరాకరించింది. తాజాగా న్యూయార్క్ మేయర్ ఈ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుతం హాట్‌ టాఫిక్‌గా మారింది.

చరిత్ర ఇదే.
105.6 క్యారెట్ల కోహినూర్ వజ్రం భారతదేశంలో పుట్టింది. ఇది మొఘల్ చక్రవర్తులు, పర్షియన్ రాజులు, ఆఫ్ఘన్ పాలకుల చేతుల్లోకి మారుతూ వచ్చింది. చివరగా 1849లో లాహోర్ ఒప్పందం ద్వారా మహారాజా దులీప్ సింగ్ నుంచి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకుంది. ప్రస్తుతం ఇది లండన్‌లోని క్రౌన్ జువెల్స్‌ ప్రదర్శనలో ఉంది.

భారత్ వాదన
వజ్రాన్ని బ్రిటన్ బలవంతంగా తీసుకుందని భారత్ ఆరోపించింది. ఇది దేశ చరిత్రకు చెందిన అమూల్య వారసత్వమని.. తిరిగి ఇవ్వాలని భారత్ నిరంతరం కోరుతోంది. అయితే బ్రిటన్ మాత్రం అప్పటి ఒప్పందం ఆధారంగా తమకు చట్టబద్ధ హక్కు ఉందని చెబుతోంది. అయితే ప్రస్తుతం రెండు దేశాల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు.

 


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇടതിനെ കൈവിട്ട് കാസര്‍ഗോഡ് ജില്ലയും; വിജയിച്ചുകയറാനായത് ഒരേയൊരു മണ്ഡലത്തില്‍ 

കാസര്‍കോട്: 2026 ലെ കേരള നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിന്റെ വോട്ടെണ്ണല്‍ ഫലങ്ങള്‍ പുറത്തുവരുമ്പോള്‍,...

கொளத்தூர்: முதல்வர் தொகுதியிலும் பறந்த `விசில்' – ஸ்டாலினை வீழ்த்திய வி.எஸ்.பாபு – எப்படி?

தமிழக அரசியல் வரலாற்றில் 2026 சட்டமன்றத் தேர்தல் முடிவுகள் எவரும் எதிர்பாராத...

Kavitha: పాత రాజకీయాలకు విసిగిపోయారు.. తెలంగాణలో కూడా మార్పు తథ్యం: కవిత

తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసిన వేళ,...

ಕೆ.ಸಿ ರೆಡ್ಡಿ ಅವರು ಒಬ್ಬ ಸಮರ್ಥ, ಪ್ರಾಮಾಣಿಕ  ಆಡಳಿತಗಾರರಾಗಿದ್ದರು:ಸಿಎಂ  ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು, ಮೇ,04,2026 (www.justkannada.in):  ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ದಿವಂಗತ ಕೆ.ಸಿ ರೆಡ್ಡಿಯವರು...