29
April, 2026

A News 365Times Venture

29
Wednesday
April, 2026

A News 365Times Venture

Dacoit: ఓటీటీలోకి అడివి శేష్ ‘డెకాయిట్’.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!

Date:

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ ‘డెకాయిట్’ ఇప్పుడు ఓటీటీ బాట పట్టింది. థియేటర్లలో రిలీజైనప్పటి నుంచి సాలిడ్ వసూళ్లతో దూసుకుపోయిన ఈ సినిమా, మూడు వారాల తర్వాత కూడా వీకెండ్స్‌లో మంచి బుకింగ్స్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా అడివి శేష్ నటన, మృణాల్ గ్లామర్, భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ స్క్రీన్స్‌పై అలరించడానికి సిద్ధమైపోయింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం వచ్చే మే 8 నుంచి అన్ని పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమ్ కాబోతోంది. దీనిపై అధికారికంగా అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉన్నప్పటికీ, నెట్‌ఫ్లిక్స్‌లో ‘డెకాయిట్’ సందడి చేయడం పక్కా అని తెలుస్తోంది. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్. సుప్రియ యార్లగడ్డ నిర్మాణంలో వచ్చిన ఈ విజువల్ వండర్ ఓటీటీలో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

20,000ത്തോളം പേര്‍ക്ക് വോട്ട് ചെയ്യാനാവാത്തത് നിര്‍ഭാഗ്യകരം; പോസ്റ്റല്‍ വോട്ട് നിഷേധത്തില്‍ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷനെതിരെ ഹൈക്കോടതി

കൊച്ചി: തെരഞ്ഞെടുപ്പ് ഡ്യൂട്ടിലുണ്ടായിരുന്ന ഉദ്യോഗസ്ഥര്‍ക്ക് പോസ്റ്റല്‍ വോട്ട് നിഷേധിച്ചതില്‍ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷനെതിരെ...

“சோசலிச புரட்சிபோல, தமிழ்நாட்டில் 'விசில் புரட்சி' ஏற்படப் போகிறது!"- செங்கோட்டையன்

திண்டுக்கல் மாவட்டம் பழனிக்கு வருகை தந்த தமிழக வெற்றிக் கழகத்தின் தலைமை...

ಸಿದ್ದರಾಮಯ್ಯ ಇನ್ನು 15 ದಿನ ಮಾತ್ರ ಸರದಾರ- ಸಂಸದ ಗೋವಿಂದ ಕಾರಜೋಳ

ಬಾಗಲಕೋಟೆ,ಏಪ್ರಿಲ್,28,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಸಿಎಂ ಬದಲಾವಣೆ ವಿಚಾರ  ಚರ್ಚೆಯಾಗುತ್ತಿದ್ದು ಇದೀಗ...

ആര്‍.എസ്.എസ് നൂറാം വാര്‍ഷികാഘോഷ പരിപാടിക്കെതിരെ ജാമിയ മില്ലിയയില്‍ വിദ്യാര്‍ത്ഥി രോഷം; സംഘര്‍ഷം, നിരവധി പേര്‍ക്ക് പരിക്ക്

ന്യൂദല്‍ഹി: ജാമിയ മിലിയ ഇസ്‌ലാമിയ സര്‍വകലാശാലയില്‍ ആര്‍.എസ്.എസ് രൂപീകരണത്തിന്റെ നൂറാം വാര്‍ഷികത്തോടനുബന്ധിച്ച്...