28
April, 2026

A News 365Times Venture

28
Tuesday
April, 2026

A News 365Times Venture

RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

Date:

RCB vs DC: ఢిల్లీ వేదికగా జరిగిన ఐపీఎల్మ్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ పై భారీ విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో సునాయాసంగా గెలిచింది.

ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు RCB బౌలర్లు ధాటికి పూర్తిగా విఫలమైంది. 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు సహిల్ పరఖ్, కేఎల్ రాహుల్ త్వరగా ఔట్ కావడంతో జట్టు కష్టాల్లో పడింది. ఆ తరువాత నితీష్ రాణా, సమీర్ రిజ్వి, ట్రిస్టన్ స్టబ్స్, కెప్టెన్ అక్షర్ పటేల్ కూడా విఫలమయ్యారు. అభిషేక్ పోరెల్ (30) కొంత పోరాడగా, డేవిడ్ మిల్లర్ 19 పరుగులు చేశాడు. కానీ మిగతా బ్యాటర్లు నిలబడలేకపోవడంతో చేతులెత్తేశారు. బెంగళూరు బౌలర్లలో జోష్ హాజల్ వుడ్ 4 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు తీసి ఢిల్లీని కుదేలు చేశారు. సుయాష్ శర్మ, కృణాల్ పాండ్య, రసిఖ్ సలామ్ తలో వికెట్ తీసి వారికి మద్దతు ఇచ్చారు.

తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరు జట్టు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా గెలుపును అందుకుంది. జేకబ్ బెథెల్ 20 పరుగులు చేసి ఔట్ అయినప్పటికీ, ఛేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీ 23 నాటౌట్, దేవదత్ పడిక్కల్ (34 నాటౌట్ తో జట్టును విజయ తీరాలకు చేర్చారు. బౌలింగ్‌లో స్పీడ్, తరువాత బ్యాటింగ్‌లో దూకుడు ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చూపించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో RCB రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

75 സീറ്റുകളുമായി അധികാരത്തിലേറും; എല്‍.ഡി.എഫിന് ഭരണത്തുടര്‍ച്ചയെന്ന് എന്‍.എസ്. മാധവന്‍

കോഴിക്കോട്: 2026 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ ഇടതുപക്ഷത്തിന് ഭരണത്തുടര്‍ച്ചയെന്ന് എഴുത്തുകാരന്‍ എന്‍.എസ്. മാധവന്‍....

இணைந்த 7 எம்.பி-கள்: `மாநிலங்களவையில் பலம் கூடிய பாஜக' – ஏற்றுக்கொண்ட சபாநாயகர்

மாநிலங்களவையில் ஆம் ஆத்மி கட்சிக்கு மொத்தம் 10 நாடாளுமன்ற உறுப்பினர்கள் (MP)...

ಹಠಾತ್ ಕುಸಿದು ಬಿದ್ದು ಕೋಮಾಗೆ ಜಾರಿದ್ದ ಸಾಫ್ಟ್‌ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ ಸಾವು

ಹಾಸನ, ಏಪ್ರಿಲ್,27,2026 (www.justkannada.in): ಹಠಾತ್ ಕುಸಿದು ಬಿದ್ದು ಮೆದುಳಿನಲ್ಲಿ ತೀವ್ರ...

ബംഗാളിലെ ജാദവ്പൂര്‍ സര്‍വകലാശാലയില്‍ എസ്.എഫ്.ഐക്ക് വന്‍വിജയം; ചിത്രത്തില്‍ പോലുമില്ലാതെ ടി.എം.സി.പിയും എ.ബി.വി.പിയും

കൊല്‍ക്കത്ത: നിയസഭാ തെരഞ്ഞെടുപ്പിന്റെ ആവേശം കൊടുമ്പിരി കൊള്ളുന്ന ബംഗാളില്‍ ഇടതിന് ആത്മവിശ്വാസം...