25
April, 2026

A News 365Times Venture

25
Saturday
April, 2026

A News 365Times Venture

Roti Pizza Recipe: మిగిలిపోయిన రోటీలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ పిజ్జా.. మార్కెట్‌లో దొరికే పిజ్జాని మర్చిపోతారంతే..!

Date:

Roti Pizza Recipe: ఇంట్లో రాత్రి భోజనం తర్వాత రోటీలు మిగిలిపోవడం చాలా సాధారణం. చాలామంది వాటిని మళ్లీ వేడి చేసి తింటారు లేదా వృథా చేస్తారు. కానీ, ఇప్పుడు మిగిలిపోయిన రోటీలతోనే ఇంట్లో సులభంగా రెస్టారెంట్ స్టైల్ పిజ్జా తయారు చేసుకోవచ్చు. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన స్నాక్‌గా కూడా ఉపయోగపడుతుంది. ఈ రోటీ పిజ్జా ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ప్రత్యేకంగా పిజ్జా బేస్, ఓవెన్ లేదా ఖరీదైన పిజ్జా మేకర్ అవసరం లేదు. ఇంట్లో ఉన్న సాధారణ పాన్‌తోనే క్షణాల్లో సిద్ధం చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చే ఈ రుచికరమైన రెసిపీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
* పాత రోటీలు – 2
* టొమాటో సాస్ లేదా పిజ్జా సాస్ – 2 టేబుల్ స్పూన్లు
* ఉల్లిపాయ – సగం (సన్నగా తరిగినది)
* క్యాప్సికమ్ – 1 (సన్నగా తరిగినది)
* టమోటా – 1 (గింజలు తీసి సన్నగా తరిగినది)
* తురిమిన చీజ్ – అర కప్పు
* మొజారెల్లా చీజ్ – 1 కప్పు
* చిల్లీ ఫ్లేక్స్ – తగినంత
* ఒరేగానో – తగినంత
* నూనె – కొద్దిగా

తయారీ విధానం
ముందుగా ఒక రోటీ తీసుకుని దానిపై టొమాటో సాస్ లేదా పిజ్జా సాస్‌ను సమంగా పూయాలి. ఆపై కొద్దిగా తురిమిన చీజ్ చల్లాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, క్యాప్సికమ్, టమోటా ముక్కలను రోటీపై సమంగా పేర్చాలి. ఇప్పుడు పైన మొజారెల్లా చీజ్ వేసి కూరగాయలన్నీ బాగా కప్పబడేలా చూడాలి. రుచికి తగినంత చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో చల్లాలి. ఇప్పుడు స్టౌపై బాణలి పెట్టి మధ్యస్థ మంటపై వేడి చేయాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి, రోటీ పిజ్జాను జాగ్రత్తగా పెట్టాలి. మూతపెట్టి తక్కువ మంటపై 2 నుంచి 3 నిమిషాలు ఉడికించాలి. చీజ్ పూర్తిగా కరిగి రోటీ కరకరలాడేలా అయిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. ప్లేట్‌లోకి తీసి మళ్లీ కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో చల్లి వేడిగా సర్వ్ చేయాలి.

ఎందుకు ట్రై చేయాలి?
ఈ రోటీ పిజ్జా తక్కువ సమయంలో సిద్ధమవుతుంది. మిగిలిన రోటీలను వృథా కాకుండా వినియోగించుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే పిజ్జాతో పోలిస్తే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. సాయంత్రం టీ టైమ్ స్నాక్‌గా లేదా పిల్లల టిఫిన్‌గా ఇది బెస్ట్ ఆప్షన్‌గా కూడా చెప్పుకోవచ్చు..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

രാജ്യസഭാ അംഗങ്ങളുടെ കൂറുമാറ്റം; എം.പിമാരെ അയോഗ്യരാക്കണമെന്ന് ആം ആദ്മി

ന്യൂദൽഹി: രാഘവ് ഛദ്ദ ഉൾപ്പെടെ ആം ആദ്മി പാർട്ടിയുടെ ഏഴ് രാജ്യസഭാ...

"ராஜிவ் கொலையில் திமுகவுக்குச் சம்பந்தம் என்பதால்தான்…" – ராகுல் குறித்து சி.டி.ஆர் நிர்மல் குமார்

தவெகவின் இணைப் பொதுச்செயலாளரும் திருப்பரங்குன்றம் தொகுதி வேட்பாளருமான சி.டி.ஆர்.நிர்மல் குமார் சென்னை...

AAP Crisis: ‘‘పంజాబ్ ద్రోహి’’ అంటూ హర్భజన్ సింగ్ ఇంటిపై ఆప్ దాడి…

AAP Crisis: రాఘవ్ చద్దాతో సహా ఏడుగురు రాజ్యసభ ఎంపీలు బీజేపీ...

ಕಿಮ್ಸ್ ಆಸ್ಪತ್ರೆಗೆ ಭೇಟಿ: ಸಚಿವ ಡಿ.ಸುಧಾಕರ್ ಆರೋಗ್ಯ ವಿಚಾರಿಸಿದ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,25,2026 (www.justkannada.in):  ಸಚಿವ ಡಿ. ಸುಧಾಕರ್ ಅವರ ಆರೋಗ್ಯ ಸ್ಥಿತಿ...