25
April, 2026

A News 365Times Venture

25
Saturday
April, 2026

A News 365Times Venture

Governor Abdul Nazeer: ఏపీ గవర్నర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

Date:

Governor Abdul Nazeer: ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ సయ్యద్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపులో తీవ్ర నొప్పి రావడంతో ఆయనను విజయవాడలోని మణిపాల్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. సమాచారం ప్రకారం, గవర్నర్ అబ్దుల్ నజీర్.. బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉండగా, ఆయన ప్రయాణిస్తున్న విమానం ఆలస్యమైంది. రాత్రి 12 గంటలకు చేరుకోవాల్సిన విమానం ఆలస్యంగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో విజయవాడకు చేరుకుంది. అనంతరం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తెల్లవారుఝామున సుమారు 4:30 గంటలకు గవర్నర్‌కు కడుపులో నొప్పి ప్రారంభమైంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో గవర్నర్ ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. అధికారులు పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నారు. అయితే, వైద్య పరీక్షల అనంతరం మాణిపాల్ ఆసుపత్రి నుంచి తన నివాసానికి చేరుకున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్.. జర్నీ ప్రభావం, అర్ధరాత్రి ఆలస్యం కావడం లాంటి చిన్న కారణాల వలన అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తోంది..

Read Also: CM Chandrababu: ఎన్టీఆర్ జిల్లా ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు ప్రత్యేక భేటీ.. సమన్వయంతో పని చేయండి.. ఆత్మ విమర్శ అవసరం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

‘അവന്റെ അസ്ഥികളെ പുഴുക്കള്‍ തിന്നുതീര്‍ത്തു’; വിശുദ്ധ ഫ്രാന്‍സിസ് സേവ്യറിനെതിരായ അധിക്ഷേപ പരാമര്‍ശത്തില്‍ വലതുപക്ഷ പ്രഭാഷകന്‍ അറസ്റ്റില്‍

പനാജി: വിശുദ്ധ ഫ്രാന്‍സിസ് സേവ്യറിനെതിരെ അധിക്ഷേപകരവും വര്‍ഗീയ വിദ്വേഷം വളര്‍ത്തുന്നതുമായ പരാമര്‍ശങ്ങള്‍...

இந்திய ரயில்வேயில் அதிரடி ஆட்குறைப்பு நடவடிக்கை; பராமரிப்புப் பணிகளில் தொய்வு ஏற்படுமா?

இந்திய ரயில்வே நிர்வாகம் தனது ஒட்டுமொத்த பணியாளர் எண்ணிக்கையில் 2 சதவீதத்தைக்...

Rajasekhar : ఠాగూర్ సినిమా చిరంజీవి కంటే ముందే నా దగ్గరకు వచ్చింది.. కానీ

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ‘ఠాగూర్’ సినిమా ఒక మైలురాయి. అవినీతిపై పోరాడే...

SSLC ಫಲಿತಾಂಶದಲ್ಲಿ ಕಲ್ಬುರ್ಗಿಗೆ ಕೊನೇ ಸ್ಥಾನ: ಪ್ರಶ್ನಿಸಿದ್ದಕ್ಕೆ ಗರಂ ಆದ ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,25,2026 (www.justkannada.in):  ಕಳೆದ ಎರಡು ದಿನಗಳ ಹಿಂದಷ್ಟೆ ಎಸ್ ಎಸ್...