13
April, 2026

A News 365Times Venture

13
Monday
April, 2026

A News 365Times Venture

Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది

Date:

ఇటీవల ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. దీంతో.. నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో రాబోతున్న మెగా 158 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్నారు మెగాభిమానులకు. అయితే, మరోసారి ఫ్యాన్స్‌కు నిరాశ తప్పలేదనే చెప్పాలి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ఏప్రిల్ 11వ తేదీన ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే, నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న కొన్ని ఊహించని సమస్యల వల్ల ఈ ఈవెంట్ తాత్కాలికంగా వాయిదా పడింది. ప్రస్తుతం KVN ప్రొడక్షన్స్ సంస్థ విజయ్ ‘జననాయగన్’ విడుదల, లీక్ వివాదంతో సతమతమవుతోంది.

Also Read : Lucky Heroine : ఫ్లాప్ హీరోలు ఆమెతో సినిమా చేసేందుకు ఎదురుచూస్తున్నారు

ఈ వివాదం నిర్మాణ సంస్థపై ప్రభావం చూపడంతో, అదే బ్యానర్ నిర్మిస్తున్న మెగా 158 లాంచ్ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాల్సి వచ్చింది. పరిస్థితులు చక్కబడే వరకు చిన్న విరామం ప్రకటించినట్లు తెలుస్తోంది. దర్శకుడు బాబీ ఇప్పటికే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడంతో, ఈ రెండో ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, KVN ప్రొడక్షన్స్ వివాదాల కారణంగా.. మెగా 158 లేట్ అవుతోంది. ఈ లెక్కన చూస్తే.. 2027 సంక్రాంతికి ఈ సినిమా విడుదల అసాధ్యంగా కనిపిస్తోంది. నిజానికి, వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కానీ జననాయగన్ కారణంగా డిలే అవుతూ వస్తోంది. మరి చిరు-బాబీ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ബംഗാളിനെ മൂന്നായി വിഭജിക്കാനാണ് ബി.ജെ.പി പദ്ധതിയിടുന്നത്, അതിനാണ് ആ ബില്‍; വിമര്‍ശിച്ച് മമത

  കൊല്‍ക്കത്ത: മണ്ഡല പുനര്‍നിര്‍ണയം വഴി പശ്ചിമ ബംഗാളിനെ മൂന്നായി ഭാഗങ്ങളായി...

சேலம்: பிரசாரத்தின்போது மேடையிலேயே மயங்கிய ராமதாஸ்; என்ன நடந்தது?

பாமக நிறுவனர் ராமதாஸ் சேலம் பள்ளப்பட்டியில் பரப்புரையில் ஈடுபட்டிருந்தபோது திடீரென மயங்கி...

ಸಂಪುಟ ಪುನರ್ರಚನೆ ಹೈಕಮಾಂಡ್ ಗೆ ಬಿಟ್ಟಿದ್ದು ; ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿದ್ದರಾಮಯ್ಯ

  ಚಿಕ್ಕಮಗಳೂರು, ಏಪ್ರಿಲ್ 12: ಸಚಿವ ಸ್ಥಾನದ ಆಕಾಂಕ್ಷಿ ಶಾಸಕರು ನವದೆಹಲಿಗೆ...