12
April, 2026

A News 365Times Venture

12
Sunday
April, 2026

A News 365Times Venture

Ayush Mhatre ‘రిటైర్డ్ ఔట్’.. CSK వ్యూహం వెనుక అసలు కారణం ఇదే..!

Date:

Ayush Mhatre Retired Out: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. 18 ఏళ్ల చెన్నై జట్టు బ్యాటర్ ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, సీఎస్‌కే టీమ్ మేనేజ్మెంట్ అతడిని ‘రిటైర్డ్ ఔట్’ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. మాత్రే 36 బంతుల్లో 59 పరుగులతో ఉన్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అతడు టచ్ ప్లేయర్‌గా మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ, చివరి ఓవర్లలో మరింత వేగంగా పరుగులు సాధించేందుకు సీఎస్‌కే వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుంది.

CSK vs DC: సంజు శాంసన్ షాందార్‌ సెంచరీ.. ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం!

కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడగల శివమ్ దూబేను క్రీజ్‌లోకి పంపింది. ఈ నిర్ణయం వెనుక ఉద్దేశం స్పష్టంగా కనిపించింది. డ్యూబే క్రీజ్‌లోకి వచ్చిన తర్వాత వేగంగా పరుగులు సాధించడంతో జట్టు స్కోర్ మరింత పెరిగింది. మాత్రే పావిలియన్‌కి తిరిగి వెళ్లే సమయంలో జట్టు సభ్యులు, సపోర్ట్ స్టాఫ్ అతడికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం ప్రత్యేకంగా నిలిచింది.

ఈ దెబ్బతో ఐపీఎల్ చరిత్రలో ‘రిటైర్డ్ ఔట్’ అయిన ఆటగాళ్ల జాబితాలో మాత్రే కూడా చేరాడు. ఇంతకు ముందు రవిచంద్రన్ అశ్విన్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, డెవాన్ కాన్వే వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. నిజానికి క్రికెట్‌లో ‘రిటైర్డ్ హర్ట్’, ‘రిటైర్డ్ ఔట్’ అనే రెండు పదాలు ఉంటాయి. ‘రిటైర్డ్ హర్ట్’ అంటే గాయాల కారణంగా ఆటగాడు మైదానం విడిచిపెట్టడం. కానీ ‘రిటైర్డ్ ఔట్’ అనేది జట్టు ప్రయోజనాల కోసం స్వచ్ఛందంగా మైదానం విడిచిపెట్టడం.

Sunrisers Hyderabad: మైల్‌స్టోన్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓటమి.. అదే కొంపముంచిందన్న ఇషాన్ కిషన్!

ఇక మ్యాచ్ విషయానికి వస్తే సంజు శాంసన్ అద్భుత సెంచరీతో సీఎస్‌కేకు భారీ స్కోర్ అందించాడు. 56 బంతుల్లో 115 పరుగులు (15 ఫోర్లు, 4 సిక్సర్లు) చేసి అజేయంగా నిలిచాడు. దీంతో సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 212/2 భారీ స్కోర్ నమోదు చేసింది. దుబే చివర్లో 10 బంతుల్లో 20 పరుగులు చేసి జట్టు స్కోర్ 200 దంతెనందుకు సహకరించాడు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ మాత్రమే తీశాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಜನರೊಟ್ಟಿಗೆ ಬೆರೆಯುವ ಯತೀಂದ್ರರ ಉದಾತ್ತ ಮನೋಭಾವ ನೋಡಿ ಹೆಚ್ ಡಿಕೆ ಅಸೂಯೆ ಪಡುವ ಅಗತ್ಯವಿಲ್ಲ-ಹೆಚ್.ಎ ವೆಂಕಟೇಶ್

ಮೈಸೂರು,ಏಪ್ರಿಲ್,11,2026 (www.justkannada.in): ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ಪುತ್ರ ಹಾಗೂ ಪರಿಷತ್...

ജനാധിപത്യത്തിന്റെ ഉത്സവം; കേരളത്തിലേതടക്കമുള്ള തെരഞ്ഞെടുപ്പിനെ പ്രശംസിച്ച് വിദേശ പ്രതിനിധികള്‍

ന്യൂദല്‍ഹി: കേരളം, പുതുച്ചേരി, അസം എന്നിവിടങ്ങളിലെ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പുകള്‍ ആഗോള ശ്രദ്ധായാകര്‍ഷിച്ചതായി...

`48 மணி நேரம் ஓய்வு' – வானதி சீனிவாசன் சிகிச்சை குறித்து மருத்துவமனை விளக்கம்

கோவை வடக்கு தொகுதி பா.ஜ.க. வேட்பாளர் வானதி சீனிவாசன், தொகுதிக்கு உட்பட்ட...

ఎయిర్‌పోర్ట్ లుక్ కోసం లక్షల ఖర్చు.. అప్పట్లో హీరోయిన్ల పరిస్థితిపై సమీరా రెడ్డి ఆవేదన!

టాలీవుడ్, బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన హీరోయిన్ సమీరా రెడ్డి గురించి పరిచయం...