10
April, 2026

A News 365Times Venture

10
Friday
April, 2026

A News 365Times Venture

Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్‌.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..

Date:

భారత మార్కెట్లో శాంసంగ్ తన పాపులర్ గెలాక్సీ A మరియు F సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధరలను పెంచుతున్నట్లు సమాచారం. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 10, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా బడ్జెట్ , మిడ్-రేంజ్ విభాగాల్లోని గెలాక్సీ A06, A07, A17, A36, A56 , F17 మోడల్స్‌పై ఈ ప్రభావం ఉండనుంది.

మోడల్ వారీగా పెరగనున్న ధరల వివరాలు..
గెలాక్సీ A06 అండ్ A07: బడ్జెట్ ఫోన్ అయిన గెలాక్సీ A06 ధర సుమారు రూ.1,000 పెరిగి రూ.13,499కి చేరుకోవచ్చు. అలాగే గెలాక్సీ A07 ధర రూ.1,250 వరకు పెరిగి రూ.10,999 అయ్యే అవకాశం ఉంది.

గెలాక్సీ A17: ఈ మిడ్-రేంజ్ ఫోన్ ధర రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరగవచ్చు. దీని టాప్ వేరియంట్ ధర గరిష్టంగా రూ.27,999 వరకు ఉండే ఛాన్స్ ఉంది.

గెలాక్సీ A36: ఈ మోడల్‌పై భారీగా రూ.1,500 నుంచి రూ.3,000 వరకు ధర పెరగవచ్చని లీక్డ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. దీనితో కాన్ఫిగరేషన్‌ను బట్టి ధర రూ.43,499 వరకు వెళ్లవచ్చు.

Also Read:Rohit Sharma 15 Years: 15 ఏళ్ల మైలురాయి, ఎన్నో రికార్డులు.. ముంబై ఇండియన్స్‌కు రోహిత్ శర్మ అమూల్య సేవలు!

గెలాక్సీ A56: శాంసంగ్ మిడ్-రేంజ్ లైనప్‌లో కీలకమైన ఈ ఫోన్ ధరపై అత్యధికంగా రూ.2,000 నుంచి రూ.3,500 వరకు పెరుగుదల ఉండవచ్చు. దీనివల్ల హై-ఎండ్ వేరియంట్ ధర రూ.52,499కి చేరుకోవచ్చు. గెలాక్సీ F17.. దీనిపై అన్ని వేరియంట్లకూ కలిపి ఫ్లాట్‌గా రూ.1,000 ధర పెరిగే అవకాశం ఉంది.

తయారీ ఖర్చులు, మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా శాంసంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కొత్త మోడల్స్ గెలాక్సీ A37 , A57 మార్కెట్లోకి వస్తున్న తరుణంలో ఈ పాత మోడల్స్ ధరల పెరుగుదల వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗ್ಯಾಸ್ ಅಭಾವ : ನಮ್ಮ ಮನವಿಗೆ ಕೇಂದ್ರ ಸ್ಪಂದಿಸಬೇಕು- ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್ ಆಗ್ರಹ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಎಲ್ ಪಿಜಿ ಗ್ಯಾಸ್ ಅಭಾವ ವಿಚಾರಕ್ಕೆ...

വനിതാ സംവരണ നിയമത്തിലെ യൂ ടേണ്‍; പ്രധാനമന്ത്രി രാജ്യത്തെ സ്ത്രീകളോട് മാപ്പ് പറയണം: കോണ്‍ഗ്രസ്

ന്യൂദല്‍ഹി: വനിതാ സംവരണ നിയമം നടപ്പിലാക്കുന്നതിലുള്ള മോദി സര്‍ക്കാരിന്റെ യൂ ടേണ്‍...

'என்னுடைய பணம் இல்லை' முதல் ராஜினாமா வரை: யஷ்வந்த் வர்மா 'கட்டுக்கட்டான' பண வழக்கு|Timeline

வீட்டில் கட்டுக்கட்டாக பணம் கண்டுபிடிக்கப்பட்ட குற்றச்சாட்டு எழுந்தும், ஓராண்டு கழித்து இன்று...

ಪ್ರವಾಸಕ್ಕೆಂದು ಬಂದು ನಾಪತ್ತೆಯಾಗಿದ್ದ 14 ವರ್ಷದ ಬಾಲಕಿ ಶವವಾಗಿ ಪತ್ತೆ

ಚಿಕ್ಕಮಗಳೂರು,ಏಪ್ರಿಲ್,10,2026 (www.justkannada.in): ಚಿಕ್ಕಮಗಳೂರು ಜಿಲ್ಲೆ ಕುಂಭದ್ರೋಣ ಪರ್ವತದ ಮಾಣಿಕ್ಯಧಾರದಲ್ಲಿ ನಾಪತ್ತೆಯಾಗಿದ್ದ...