6
April, 2026

A News 365Times Venture

6
Monday
April, 2026

A News 365Times Venture

Hyderabad: హైదరాబాద్ లో MIM కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్

Date:

పాతబస్తీలో చార్మినార్ సమీపంలో ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కుమారుడు మహమ్మద్ సాహిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్రమ ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ (GHMC) అధికారులు పోలీసుల బందోబస్తుతో అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో అధికారుల పనిని అడ్డుకున్న సాహిల్, వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అక్కడితో ఆగకుండా విధుల్లో ఉన్న పోలీస్ అధికారులను , జీహెచ్‌ఎంసీ సిబ్బందిని తోసేస్తూ అత్యుత్సాహం ప్రదర్శించారు.

 SRH Vs LSG: సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్.. జట్టులోకి మరో విధ్వంసకర బ్యాటర్..

శాంతిభద్రతలను కాపాడాల్సిన చోట, ఒక ప్రజాప్రతినిధి కుమారుడై ఉండి అధికారులపైనే సాహిల్ చేయి చేసుకోవడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, పోలీసులను తోసేస్తూ అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ అధికారుల పట్ల సాహిల్ ప్రవర్తించిన తీరుపై పోలీసులు తక్షణమే స్పందించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం , అధికారులపై దాడికి ప్రయత్నించినందుకు గాను సాహిల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

 Donald Trump: ‘‘దయచేసి ఆ పిచ్చివాడిని ఆపండి’’.. రష్యా, చైనాలను కోరిన IAEA మాజీ చీఫ్..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇല്ല, ആക്രമിക്കാന്‍ ഇസ്രഈലിന് ആയുധങ്ങള്‍ നല്‍കുന്നില്ല; നിലപാട് വ്യക്തമാക്കി ഫ്രാന്‍സ്

  പാരീസ്: ഇറാനെതിരെ അമേരിക്കയും ഇസ്രഈലും ആക്രമണങ്ങള്‍ തുടരുന്ന സാഹചര്യത്തില്‍ ഇസ്രഈലിന്...

Baramati By-Election: బారామతి బై-ఎలక్షన్.. సునేత్ర పవార్‌పై పోటీకి కాంగ్రెస్ సిద్ధం..

Baramati By-Election: మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న అజిత్ పవార్ విమాన...

ಗ್ಯಾಸ್ ಸಿಗದೆ ಆಟೋ ಚಾಲಕರ ಪರದಾಟ: ಕೇಂದ್ರದ ವಿರುದ್ದ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,4,2026 (www.justkannada.in):  ಗ್ಯಾಸ್ ಸಿಗದೆ ಆಟೋ ಚಾಲಕರು ಪರದಾಡುತ್ತಿರುವ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ...