5
April, 2026

A News 365Times Venture

5
Sunday
April, 2026

A News 365Times Venture

SSC Exam: ‘పది’ విద్యార్థులకు శుభవార్త.. ప్రతి ఒక్కరికీ 7 మార్కులు కలిపేందుకు బోర్డు నిర్ణయం..

Date:

ఏపీ పదో తరగతి విద్యార్థులకు రాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (SSC) బోర్డు ఊరటనిచ్చే వార్త చెప్పింది. ఇటీవల జరిగిన వార్షిక పరీక్షల్లో కొన్ని ప్రశ్నల విషయంలో తలెత్తిన అస్పష్టతను పరిగణనలోకి తీసుకున్న బోర్డు, విద్యార్థులకు మొత్తం 7 మార్కులను గ్రేస్ మార్కులుగా కలపాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లీష్, హిందీ సబ్జెక్టుల ప్రశ్నపత్రాల్లోని పొరపాట్ల వల్ల విద్యార్థులు నష్టపోకూడదనే ఉద్దేశంతో ఈ అదనపు మార్కులను కేటాయిస్తున్నారు.

నిపుణుల కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా.. ఇంగ్లీష్ పేపర్‌లో 5 మార్కులు, హిందీ పేపర్‌లో 2 మార్కులు కలపనున్నారు. ఈ సందిగ్ధ ప్రశ్నలకు సమాధానాలు రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులందరికీ ఈ ప్రయోజనం చేకూరుతుంది. ఈ మేరకు ఇప్పటికే అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులకు (DEOs) , స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాలకు బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన సుమారు 6.40 లక్షల మంది విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెరగడమే కాకుండా, వారికి మెరుగైన గ్రేడింగ్ వచ్చే అవకాశం ఉంది.

Also Read:Hydra: ‘ఆ ఇళ్ల జోలికి వెళ్లం’.. గుడ్ న్యూస్ చెప్పిన హైడ్రా..

అయితే.. మరికొన్ని ప్రశ్నల్లో కూడా తప్పులు దొర్లాయని తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తిని బోర్డు సున్నితంగా తిరస్కరించింది. ఆ ప్రశ్నలు విద్యార్థుల మేధస్సును పరీక్షించే కోణంలోనే ఇచ్చామని, వాటిలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని అధికారులు వివరణ ఇచ్చారు. కాగా, ఏప్రిల్ 6 నుంచి సమాధాన పత్రాల మూల్యాంకనం (Spot Valuation) ప్రారంభమై 15వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి, ఏప్రిల్ చివరి నాటికి తుది ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ సమాయత్తమవుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗ್ಯಾಸ್ ಅಭಾವ: ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವೇ ಸರಿಪಡಿಸಬೇಕು- ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,4,2026 (www.justkannada.in):  ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ ಪಿಜಿ...

വിദേശനയം തിരുത്തണം, മറ്റുരാജ്യങ്ങളിൽ നിന്നും എൽ.പി.ജി ഇറക്കുമതി ചെയ്യണം: ഖാർഗെ

ന്യൂദൽഹി: പാചകവാതക പ്രതിസന്ധി അടിയന്തരമായി പരിഹരിക്കണമെന്ന് എ.ഐ.സി.സി അധ്യക്ഷനും രാജ്യസഭയിലെ പ്രതിപക്ഷ...

"அன்புமணியும், எடப்பாடியும் இதோட இரண்டு பேரும் நிறுத்திகோங்க.!"- பிரேமலதா விஜயகாந்த் எச்சரிகை

அதிமுக பொதுச் செயலாளர் எடப்பாடி பழனிசாமியும், பாமக தலைவர் அன்புமணியும் அநாகரிக...

RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెక్కల మాస్టర్ సుకుమార్...