5
April, 2026

A News 365Times Venture

5
Sunday
April, 2026

A News 365Times Venture

Relaiance Jio: జియోకు షాక్ ఇచ్చిన ట్రాయ్.. ఏప్రిల్ 14 వరకే అవకాశం..

Date:

రిలయన్స్ జియో అనుసరిస్తున్న కొన్ని టారిఫ్ పద్ధతులు పారదర్శకంగా లేవని, అవి వినియోగదారుల పట్ల వివక్ష చూపేలా ఉన్నాయని భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI)పరిగణించింది. ముఖ్యంగా రోజుకు 1GB డేటా అందించే కొన్ని ప్రారంభ స్థాయి ప్లాన్లను జియో నిలిపివేయడంపై విచారణ జరిపిన ట్రాయ్, కంపెనీకి కీలక ఆదేశాలు జారీ చేసింది.

రూ.249, రూ.199 ధర కలిగిన ప్లాన్లు కేవలం జియో రిటైల్ స్టోర్లలో మాత్రమే లభిస్తుండగా.. రూ.209 ప్లాన్ కేవలం మై-జియో యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉండటాన్ని ట్రాయ్ తప్పుబట్టింది. ఒకే రకమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వేర్వేరు చోట్లకు వెళ్లాల్సి రావడం టెలికమ్యూనికేషన్ టారిఫ్ ఆర్డర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది.

అంతేకాకుండా.. జియో ఫోన్, జియో భారత్ వంటి నిర్దిష్ట పరికరాలను వాడే వారికి మాత్రమే కొన్ని ప్రత్యేక ఆఫర్లను పరిమితం చేయడం వివక్షా పూరితమని ట్రాయ్ పేర్కొంది. ఇలా ఒక నిర్దిష్టమైన ఫోన్ లేదా సాంకేతికతను కొనుగోలు చేస్తేనే తక్కువ ధర ప్లాన్లు లభిస్తాయనే నిబంధన వినియోగదారుల స్వేచ్ఛను హరిస్తుందని.. దీనివల్ల మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) సదుపాయం కూడా దెబ్బతింటుందని హెచ్చరించింది.

Also Read:Petrol, Diesel, LPG: పెట్రోల్‌, డీజిల్‌, ఎల్పీజీపై కేంద్రం కీలక ప్రకటన..

ఈ పద్ధతులను సరిదిద్దుకోవడానికి జియోకు ఏప్రిల్ 14 వరకు గడువు ఇచ్చింది. ఈ గడువులోగా రూ.249, రూ.199, రూ.209 వంటి అన్ని ప్లాన్లను వెబ్‌సైట్, మొబైల్ యాప్ మరియు రిటైల్ స్టోర్లలో అందరికీ సమానంగా అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. అలాగే.. జియో భారత్ మరియు జియో ఫోన్ల కోసం అందిస్తున్న ప్రత్యేక ప్లాన్లను ఇతర మొబైల్ ఫోన్లు వాడే వినియోగదారులందరికీ కూడా వర్తింపజేయాలని ట్రాయ్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మొదటి సారి రీఛార్జ్ చేసే వారికి మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయన్న జియో వాదనను కూడా నియంత్రణ సంస్థ తోసిపుచ్చింది. వినియోగదారులకు ప్లాన్ల ఎంపికలో పూర్తి పారదర్శకత , సమానత్వం ఉండాలని ట్రాయ్ ఈ సందర్భంగా చెప్పింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಗ್ಯಾಸ್ ಅಭಾವ: ಕೇಂದ್ರ ಸರ್ಕಾರವೇ ಸರಿಪಡಿಸಬೇಕು- ಮಲ್ಲಿಕಾರ್ಜುನ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,4,2026 (www.justkannada.in):  ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ ಪಿಜಿ...

വിദേശനയം തിരുത്തണം, മറ്റുരാജ്യങ്ങളിൽ നിന്നും എൽ.പി.ജി ഇറക്കുമതി ചെയ്യണം: ഖാർഗെ

ന്യൂദൽഹി: പാചകവാതക പ്രതിസന്ധി അടിയന്തരമായി പരിഹരിക്കണമെന്ന് എ.ഐ.സി.സി അധ്യക്ഷനും രാജ്യസഭയിലെ പ്രതിപക്ഷ...

"அன்புமணியும், எடப்பாடியும் இதோட இரண்டு பேரும் நிறுத்திகோங்க.!"- பிரேமலதா விஜயகாந்த் எச்சரிகை

அதிமுக பொதுச் செயலாளர் எடப்பாடி பழனிசாமியும், பாமக தலைவர் அன்புமணியும் அநாகரிக...

RC17 : దేవిశ్రీ లేకుండా సుకుమార్ సినిమా.. రేసులో ఇద్దరు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు లెక్కల మాస్టర్ సుకుమార్...