13
April, 2026

A News 365Times Venture

13
Monday
April, 2026

A News 365Times Venture

Diesel & Petrol Price: పెట్రోల్ & డీజిల్ ధరల పెరుగుదలపై.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన

Date:

ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని వచ్చిన ఆందోళనల మధ్య కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. పెట్రోలియం జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ విషయంపై ముఖ్యమైన వివరాలు అందించారు. ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి చెక్ పెడుతూ కేంద్ర పెట్రోలియం శాఖ తాజాగా కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్-డీజిల్ ధరలను పెంచడం లేదని స్పష్టం చేసింది. అంతర్జాతీయ క్రూడ్ ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ వినియోగదారులపై భారం పడకుండా చూసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

Also Read:Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..

దేశంలో ఇంధన కొరత ఏర్పడే అవకాశం లేదని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ధృవీకరించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రెండు నెలలకు సరిపడా పెట్రో నిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. దేశంలోని రిఫైనరీలు అత్యధిక స్థాయిలో పని చేస్తున్నాయి. ఎక్కడా పెట్రోల్-డీజిల్ అందకపోవడం (డ్రై అవుట్) లేదు. అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి వినియోగదారులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది.

Also Read:Prabhas: వెకేషన్‌కు వెళ్లిన డార్లింగ్.. ఎక్కడికో గెస్ చేయండి!

ఇప్పటికే పవర్ పెట్రోల్ ధరలు పెరగడంతో, సాధారణ పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయని భావించి ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఇలాంటి పుకార్లను నమ్మి ప్రజలు ‘ప్యానిక్ బుకింగ్’ చేయవద్దని సెంట్రల్ గవర్నమెంట్ విజ్ఞప్తి చేసింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా పెరుగుతాయన్న వార్తలను ప్రభుత్వం కొట్టిపారేసింది. వంటగ్యాస్ ధరలను పెంచే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ஹார்முஸை முடக்கும் அமெரிக்க முடிவு: `எதிர்க்கும் உலக நாடுகள்' – மீண்டும் பின்னடைவில் ட்ரம்ப்!

ஈரான் - இஸ்ரேலுக்கு இடையிலான போரில் இஸ்ரேலுக்கு ஆதரவாக களமிறங்கியது அமெரிக்கா....

డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!

ICC Women’s T20 World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌కు...

ಖ್ಯಾತ ಗಾಯಕಿ ಆಶಾ ಭೋಸ್ಲೆ ಪಂಚಭೂತಗಳಲ್ಲಿ ಲೀನ

ಮುಂಬೈ,ಏಪ್ರಿಲ್,13,2026 (www.justkannada.in): ನಿನ್ನೆ ಮುಂಬೈನ ಬ್ರೀಚ್ ಕ್ಯಾಂಡಿ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ ನಿಧನರಾದ...