1
April, 2026

A News 365Times Venture

1
Wednesday
April, 2026

A News 365Times Venture

Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

Date:

Oracle Layoffs Hit India: ప్రపంచ ప్రఖ్యాత టెక్ కంపెనీ Oracle ఇటీవల భారీగా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్ విభాగంలో పనిచేస్తున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లపై ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. భారత్‌తో పాటు మెక్సికోలోని ఉద్యోగులు కూడా ఈ లేఆఫ్స్‌కు గురైనట్టు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఈ తొలగింపుల ప్రక్రియ విధానం ఉద్యోగులను తీవ్రంగా కలవరపెడుతోంది. చాలా మంది ఉద్యోగులు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఉదయం సుమారు 6 గంటల సమయంలో టెర్మినేషన్ ఈ-మెయిల్స్ అందుకున్నారని చెబుతున్నారు. అంతేకాకుండా, ఆ సమయంలోనే వారి కంపెనీ సిస్టమ్ యాక్సెస్‌ను నిలిపివేసినట్టు సమాచారం. ఎటువంటి హెచ్‌ఆర్ కాల్ లేకుండా, మేనేజర్‌తో చర్చ లేకుండా ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోవడం ఉద్యోగుల్లో అసంతృప్తిని పెంచుతోంది.

ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కంపెనీ ఖర్చులను తగ్గించుకోవాలనే ప్రయత్నమేనని భావిస్తున్నారు. ఇటీవల భారీగా డేటా సెంటర్ విస్తరణపై పెట్టుబడులు పెట్టిన ఒరాకిల్, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఓపెన్‌ ఏఐతో కలిసి చేపట్టిన భారీ “స్టార్గేట్” ప్రాజెక్ట్ (సుమారు 500 బిలియన్ డాలర్లు) కోసం నిధుల సమీకరణలో సవాళ్లు ఎదురవుతున్నట్టు సమాచారం. అంతేకాకుండా, మౌలిక సదుపాయాల విస్తరణ కోసం కంపెనీ సుమారు 50 బిలియన్ డాలర్ల రుణాన్ని కూడ సమీకరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఖర్చులను నియంత్రించేందుకు ఉద్యోగుల కోతలకు దిగినట్టు తెలుస్తోంది. అయితే మొత్తం ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారన్న విషయంపై కంపెనీ అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, సోషల్ మీడియా పోస్టుల ఆధారంగా చూస్తే, కొన్ని విభాగాల్లో పూర్తిగా టీమ్‌లనే తొలగించినట్టు సమాచారం.

ఉద్యోగాలు కోల్పోయిన వారు సోషల్ మీడియాలో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. చాలా మంది “Open to Work” అంటూ కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నట్టు వెల్లడించారు. కొందరు తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఉద్యోగం కోల్పోయామని, ఇది షాకింగ్‌ అని పేర్కొన్నారు. మొత్తానికి, ఈ లేఆఫ్స్ టెక్ రంగంలో పెరుగుతున్న అనిశ్చితిని మరోసారి బయటపెట్టాయి. భారీ పెట్టుబడులు, ఖర్చుల ఒత్తిడి, వ్యాపార మార్పులు కలిసి కంపెనీలు కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితిని తీసుకువస్తున్నాయి. ఉద్యోగుల భద్రత, పారదర్శకత వంటి అంశాలపై కూడా ఈ పరిణామం ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಿಜೆಪಿ ಬೆಂಬಲಿಸುವವರೂ ನಮ್ಮ ಗ್ಯಾರಂಟಿಗಳ ಫಲಾನುಭವಿಗಳಾಗಿದ್ದಾರೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬಾಗಲಕೋಟೆ ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in): ನಮ್ಮ ಜನಪರವಾದ ಗ್ಯಾರಂಟಿ ಯೋಜನೆಗಳನ್ನು ಪ್ರಧಾನಿ...

`ஏன் நம்ம ஸ்கூல் மட்டும் இப்படியிருக்குன்னு' அரசு பள்ளியில் பயனில்லா கழிவறை; மனம் வெம்பும் மாணவர்கள்

மயிலாடுதுறை மாவட்டம், செம்பனார்கோயில் ஒன்றியம், கீழப்பெரும்பள்ளம் கிராமத்தில் அரசு உயர்நிலைப்பள்ளி இயங்கி...

ಸೆಸ್ಕ್ ವ್ಯವಸ್ಥಾಪಕ ನಿರ್ದೇಶಕ ಕೆ.ಎಂ. ಮುನಿಗೋಪಾಲ್ ರಾಜು ನಿವೃತ್ತಿ: ಆತ್ಮೀಯ ಬೀಳ್ಕೊಡುಗೆ

ಮೈಸೂರು, ಮಾರ್ಚ್, 31,2026 (www.justkannada.in):  ಚಾಮುಂಡೇಶ್ವರಿ ವಿದ್ಯುತ್ ಸರಬರಾಜು ನಿಗಮ...