31
March, 2026

A News 365Times Venture

31
Tuesday
March, 2026

A News 365Times Venture

CSK Vs RR: చెన్నై పరువు కాపాడిన స్టార్ బౌలర్ ఓవర్టన్.. స్వల్ప స్కోర్ కే కుప్పకూలి గైక్వాడ్ సేన..

Date:

 

ఐపీఎల్ 2026 సీజన్ లో భాగంగా నేడు గుహవటిలో చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ (RR) తో తలపడింది. ముందుగా టాస్ గెలిచిన రాజస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాంటింగ్ కు దిగిన చెన్నై ఆరగాళ్లు రాజస్థాన్ బౌలర్ల ధాటికి పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు ఏ ఒక్కరూ క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.

టాప్, మిడిల్ ఆర్డర్ విఫలం..
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పవర్‌ప్లే ముగిసేసరికే ముగ్గురు కీలక బ్యాటర్లు పెవిలియన్‌కు చేరారు. రాజస్థాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తన వేగంతో చెన్నై ఓపెనర్లను బెంబేలెత్తించాడు. ఆ తర్వాత వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకున్నారు. ముఖ్యంగా రాజస్థాన్ తరపున ఆడుతున్న మాజీ సీఎస్‌కే ఆటగాడు రవీంద్ర జడేజా, తన పాత జట్టుపై కనికరం లేకుండా బౌలింగ్ చేసి కీలక వికెట్లు పడగొట్టాడు. ఒకానొక దశలో చెన్నై స్కోరు 80 పరుగుల వద్దే 7 వికెట్లు కోల్పోయి అత్యల్ప స్కోరుకే పరిమితమవుతుందని అభిమానులు ఆందోళన చెందారు.

ఆదుకున్న జేమీ ఓవర్టన్..
జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో జేమీ ఓవర్టన్ (43 పరుగులు) ఆపద్బాంధవుడిలా ఆదుకున్నాడు. టెయిలెండర్లతో కలిసి విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పిన ఓవర్టన్, రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కొన్ని భారీ సిక్సర్లు, ఫోర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతని పోరాట పటిమ వల్లే చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకు చేరుకుని ఆలౌట్ అయ్యింది. గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో ఓవర్టన్ ఇన్నింగ్స్ కీలకంగా మారింది.

రాజస్థాన్ బౌలర్ల ఆధిపత్యం…
రాజస్థాన్ బౌలింగ్ విభాగం అత్యంత క్రమశిక్షణతో బౌలింగ్ చేసింది. నాండ్రే బర్గర్, జోఫ్రా ఆర్చర్ తలా 2 వికెట్లు తీసి పేస్ అటాక్‌ను ముందుండి నడిపించారు. రవీంద్ర జడేజా తన స్పిన్ మ్యాజిక్‌తో మధ్య ఓవర్లలో చెన్నైని కోలుకోకుండా చేశాడు. రాజస్థాన్ రాయల్స్ ముందు ఇప్పుడు 128 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది. పిచ్ బౌలింగ్‌కు సహకరిస్తుండటంతో, చెన్నై బౌలర్లు కూడా గట్టిగా పోరాడితే మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

RR vs CSK : రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. వైభవ్ సూర్యవంశీ ‘సిక్సర్ల’ సునామీ.!

రాజస్థాన్ రాయల్స్ తన ఐపీఎల్ 2026 ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. చెన్నై...

ಶಾಸಕರಿಗೆ 3 IPL ಟಿಕೆಟ್ ಕೊಡಲು ಕೆಎಸ್ ಸಿಎ ಒಪ್ಪಿಗೆ- ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು ,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಭಾರೀ ಚರ್ಚೆಗೆ ಗ್ರಾಸವಾಗಿರುವ  ಜನರಿಂದ...

ഹോര്‍മുസ് തുറന്നില്ലെങ്കില്‍ ഇറാന്റെ എണ്ണക്കിണറുകളും പവര്‍ പ്ലാന്റും ബോബിട്ട് നശിപ്പിക്കും; അന്ത്യശാസനവുമായി ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ഹോര്‍മുസ് കടലിടുക്ക് ഉടനടി തുറന്നുകൊടുത്തില്ലെങ്കില്‍ ഇറാന്റെ എണ്ണക്കിണറുകളും പവര്‍ പ്ലാന്റുകളും...