30
March, 2026

A News 365Times Venture

30
Monday
March, 2026

A News 365Times Venture

Weight Loss Drugs: రూ.450తోనే బరువు తగ్గొచ్చు..! వైద్యుల వార్నింగ్..

Date:

Weight Loss Drugs: భారతదేశంలో బరువు తగ్గించే సెమాగ్లుటైడ్ మందు ఇప్పుడు అత్యంత తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చింది. జెనరిక్ వెర్షన్ల విడుదలతో, దీని ధర గతం కంటే ఏకంగా 90 శాతం తగ్గిపోయింది. అయితే, వైద్యుల హెచ్చరిక ప్రకారం, డాక్టర్ సలహా లేకుండా దీన్ని తీసుకోవడం ప్రమాదకరం. మార్చి 20న సెమాగ్లుటైడ్ యొక్క పేటెంట్ గడువు ముగిసిన తర్వాత, నాట్కో ఫార్మా, ఆల్కెమ్ లాబొరేటరీస్ వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు జెనరిక్ వెర్షన్‌లను విడుదల చేసింది.. నాట్కో ఫార్మా సెమానాట్, సెమాఫుల్ బ్రాండ్లతో నెలకు రూ.1,290 నుండి ధర ప్రారంభించింది అల్కెమ్ లాబొరేటరీస్ ‘సెమాసైజ్’ మరియు ‘ఒబేసెమా’ పేర్లతో ముందుగా నింపిన పెన్నులు విడుదల చేసింది. వారానికి సుమారు రూ.450 మాత్రమే ఖర్చు అవుతుంది. ఇది భారతదేశంలో ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడే లక్షలాది ప్రజలకు గణనీయమైన ఉపశమనం అని వైద్యులు చెబుతున్నారు.

వైద్యుల హెచ్చరిక
అయితే, వైద్యులు చెబుతున్నది ఏంటంటే..? ఈ మందు అందుబాటులో ఉందని ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకోవడం సురక్షితం కాదు. తీవ్రమైన ఊబకాయంతో బాధపడేవారికి మాత్రమే, లేదా మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే ఇది సరైనదని సూచిస్తున్నారు.. సెమాగ్లుటైడ్ మెదడు, జీర్ణాశయంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఇవి, వైద్యుల సలహా లేకుండా వాడడం.. దుర్వినియోగం చేయడం వల్ల ప్యాంక్రియాటైటిస్, మూత్రపిండ సమస్యలు, చివరికి థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించింది..

నకిలీ మందులపై హెచ్చరిక
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా సెమాగ్లుటైడ్ నకిలీ బ్యాచ్‌లపై హెచ్చరిక జారీ చేసింది. తప్పుడు మోతాదులు, కల్తీ పదార్థాలతో తయారైన నకిలీ మందులు ప్రాణాంతకమయ్యే ప్రమాదం ఉంది.. భారతదేశంలో, ఈ మందులను ఎండోక్రినాలజిస్ట్ లేదా రిజిస్టర్డ్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌తో మాత్రమే విక్రయించాలి అని CDSCO (డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా) సపష్టంగా సూచించింది.

జాగ్రత్తే ఒక్కటే మార్గం..
సెమాగ్లుటైడ్ తీసుకునే ముందు వైద్య సలహా తప్పనిసరి. సాధారణ దుష్ప్రభావాలలో వికారం, వాంతులు, విరేచనాలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో, ఇది దృష్టి లోపానికి (NAION) కూడా కారణం కావచ్చు. సోషల్ మీడియా సూచనలు, జిమ్ ఇన్‌స్ట్రక్టర్ల సలహా మీద ఆధారపడడం ప్రమాదకరమని హెచ్చరిస్తు్న్నారు.. వైద్యులు స్పష్టం చేస్తున్న సందేశం ఏమిటంటే, సెమాగ్లుటైడ్ ప్రాణాలను కాపాడే మందు కానీ, దీన్ని ఎవరూ ఎప్పుడైనా, ఏ కారణంతోనైనా తీసుకోవాల్సిన జీవనశైలి ఉత్పత్తి కాదు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹോര്‍മുസ് തുറന്നില്ലെങ്കില്‍ ഇറാന്റെ എണ്ണക്കിണറുകളും പവര്‍ പ്ലാന്റും ബോബിട്ട് നശിപ്പിക്കും; അന്ത്യശാസനവുമായി ട്രംപ്

വാഷിങ്ടണ്‍: ഹോര്‍മുസ് കടലിടുക്ക് ഉടനടി തുറന്നുകൊടുത്തില്ലെങ്കില്‍ ഇറാന്റെ എണ്ണക്കിണറുകളും പവര്‍ പ്ലാന്റുകളും...

ಯತ್ನಾಳ್ ಮರಳಿ ಬಿಜೆಪಿ ಸೇರಲು ಉಪಚುನಾವಣೆ ಒಳ್ಳೆಯ ಅವಕಾಶ- ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ವಿಜಯಪುರ,ಮಾರ್ಚ್,30,2026 (www.justkannada.in):  ಬಿಜೆಪಿ ಪಕ್ಷದಿಂದ ಉಚ್ಛಾಟಿತರಾಗಿರುವ ಶಾಸಕ ಬಸನಗೌಡ ಪಾಟೀಲ್...