29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

IAS Officer Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారుల బదిలీలు!

Date:

AP IAS Officer Transfers 2026: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరోసారి ఉన్నతాధికారుల స్థాయిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ కొత్త పోస్టింగులు కేటాయించింది. పరిపాలనను మరింత సమర్థవంతంగా నడిపేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ బదిలీల్లో భాగంగా ఎస్. షాన్‌ మోహన్‌ను ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (ఏపీఈడీబీ) సీఈవోగా నియమించారు. దినేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. పరిశ్రమల అభివృద్ధికి ఈ నియామకం కీలకంగా మారనుంది.

Also Read: AP Tiger News: పెద్దపులి కథ సుఖాంతం.. ఏజెన్సీ ఇక ఊపిరి పీల్చుకో!

ఇక జిల్లాల పరిపాలనలో కూడా మార్పులు చేశారు. సాయికాంత్ వర్మను గుంటూరు జిల్లా కలెక్టర్‌గా నియమించగా.. ఎం. అభిషిక్త్ కిశోర్‌ను విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్‌ను కాకినాడ జిల్లా కలెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విద్యా రంగంలోనూ కీలక నియామకం జరిగింది. తమిమిన్ అన్సారీయాను పాఠశాల విద్యా డైరెక్టర్‌గా నియమించారు. మరోవైపు టి. నిశాంతిని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈ మార్పులతో రాష్ట్ర పరిపాలన మరింత వేగవంతం అవుతుందని, కొత్త బాధ్యతలు స్వీకరించిన అధికారులు తమ తమ విభాగాల్లో అభివృద్ధికి కృషి చేస్తారని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Rain Alert: రెయిన్ అలర్ట్.. రేపటి నుంచి ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడిపోతున్న ప్రజలకు...

ಹಿಂದಿ ಕಲಿಯಬಾರದು ಅಂತೇನಿಲ್ಲ, ಆದ್ರೆ ಪರೀಕ್ಷೆ ಕಡ್ಡಾಯವಾಗಬಾರದಷ್ಟೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿಈ ವರ್ಷದಿಂದಲೇ ದ್ವಿಭಾಷಾ ನೀತಿ ಜಾರಿ ಮಾಡಲಾಗುತ್ತದೆ. ...

ഐ.പി.എല്ലില്‍ ചരിത്രം കുറിച്ച സഞ്ജുവിന്റെ സെഞ്ച്വറി; വമ്പന്‍ ലിസ്റ്റില്‍ ഇടം നേടി ഇഷാന്‍ കിഷനും

ഐ.പി.എല്ലിലെ ഓപ്പണിങ് മത്സരത്തില്‍ തകര്‍പ്പന്‍ വിജയമാണ് റോയല്‍ ചലഞ്ചേഴ്സ് ബെംഗളൂരു സ്വന്തമാക്കിയത്....

தவெக: நீண்ட கால பணியாளரின் மகனை வேட்பாளராக்கிய விஜய்! – பின்னணி என்ன?

தவெகவின் வேட்பாளர் பட்டியலை இன்று விஜய் வெளியிட்டுள்ளார். சென்னை விருகம்பாக்கம் தொகுதியில்...