28
March, 2026

A News 365Times Venture

28
Saturday
March, 2026

A News 365Times Venture

Jayam Ravi: పెళ్లి కాలేదని చెప్పి ప్రియురాలితో గోవాలో ల్యాండ్ కొన్న స్టార్ హీరో?

Date:

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది, నిన్నటి వరకు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న ఈ మాజీ జంట వ్యవహారంలోకి ఇప్పుడు గోవా ల్యాండ్ ఇష్యూతో పాటుగా దళపతి విజయ్ పేరు కూడా చేరడంతో సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. జయం రవి తన సన్నిహితురాలు, సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి గోవాలో సుమారు రూ. 42 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాల్లో జయం రవి తన వైవాహిక స్థితి దగ్గర ‘అన్-మ్యారీడ్’ అని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్తీతో ఇంకా చట్టబద్ధంగా విడాకులు రాకముందే, కోర్టులో కేసు నడుస్తుండగానే రవి ఇలా ఎలా పేర్కొంటారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

Also Read :Akhil Raj: “రాజు వెడ్స్ రాంబాయి” హీరో ఇల్లు ఎలా ఉందో చూశారా?

ఇటీవల ఒక రిసెప్షన్ వేడుకలో దళపతి విజయ్, త్రిష ఒకే రంగు దుస్తుల్లో మెరవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది, సరిగ్గా ఇదే తరహాలో గతంలో జయం రవి, కెనిషా కూడా ఒకే కలర్ డ్రెస్సుల్లో కనిపించిన వీడియోలను నెటిజన్లు ఇప్పుడు బయటకు తీస్తున్నారు. విజయ్-త్రిషల గురించి ఇంతగా మాట్లాడుతున్న జనం, గత ఏడాది జయం రవి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆర్తీ పరోక్షంగా ప్రశ్నించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్తీ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. “ఒక స్త్రీ గౌరవం అనేది ఆమె భర్త ఇచ్చే విలువపై ఆధారపడి ఉండకూడదు. పోయిన ఏడాది ఇలాంటిదే జరిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు, ఇప్పుడెందుకు ఇంతలా చర్చిస్తున్నారు?” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు కెనిషాను తన ‘కంపానియన్’ అని చెప్పుకుంటూ పార్టీలు, ఫంక్షన్లకు తీసుకెళ్తున్న జయం రవి, మరోవైపు భూమి పత్రాల్లో ‘అన్-మ్యారీడ్’ అని పేర్కొనడంపై ఆయన నుండి ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూడాలి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പശ്ചിമേഷ്യന്‍ സംഘര്‍ഷം: മോദിയും ട്രംപും നടത്തിയ ടെലിഫോണ്‍ സംഭാഷണത്തില്‍ മസ്‌കും പങ്കുചേര്‍ന്നെന്ന് റിപ്പോര്‍ട്ട്; തള്ളി ഇന്ത്യ

ന്യൂദല്‍ഹി: ഇറാനില്‍ യു.എസും ഇസ്രഈലും നടത്തുന്ന ആക്രമണത്തെ സംബന്ധിച്ച് യു.എസ് പ്രസിഡന്റ്...

வேடசந்தூர்; செ., பாலாஜி ஆதரவாளருக்கு டிக் அடித்த திமுக; சிட்டிங் எம்எல்ஏ ஓரங்கட்டப்பட்ட பின்னணி!

திமுக சார்பில் போட்டியிடும் வேட்பாளர்களின் பட்டியலை முதலமைச்சர் மு.க.ஸ்டாலின் அறிவித்துள்ளார். இதில்...

Lenin: పెద్ది కోసం వెనక్కి తగ్గిన అయ్యగారు!

అక్కినేని అఖిల్ హీరోగా, మురళీకృష్ణ అబ్బూరు దర్శకత్వంలో ‘లెనిన్’ అనే సినిమా...

ಮೈಸೂರು ಹೊಸ ಬಸ್ ನಿಲ್ದಾಣದ ಕಾಮಗಾರಿ ಪರಿಶೀಲಿಸಿದ ಸಚಿವ ಹೆಚ್.ಸಿ ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು, ಮಾರ್ಚ್, 28,2026 (www.justkannada.in): ಸಮಾಜ ಕಲ್ಯಾಣ ಹಾಗೂ ಜಿಲ್ಲಾ...