27
March, 2026

A News 365Times Venture

27
Friday
March, 2026

A News 365Times Venture

Israel -Iran War: ఇజ్రాయిల్ “కిల్ లిస్ట్” నుంచి ఇరాన్ మంత్రి, స్పీకర్ పేర్లు తొలగింపు.. ఎందుకు.?

Date:

Israel -Iran War: పశ్చిమాసియా ఉద్రిక్తతలు, యూఎస్-ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ప్రపంచాన్ని గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇరాన్‌ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా, ఆయిల్ సంక్షోభానికి ఎప్పుడు తెరపడుతుందా.? అని ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయి. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలకు సిద్ధమవుతున్నారు.

Read Also: Shocking Crime: మిల్క్ షేక్‌‌లో విషం కలిపి తండ్రిని చంపిన కూతురు..

ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ తన కిల్ లిస్ట్ నుంచి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ, పార్లమెంటరీ స్పీకర్ మొహమ్ద్ ఘాలిబాఫ్‌లను తొలగించినట్లు సమచారం. చర్చల్లో వీరిద్దరు ప్రధానంగా పాల్గొనే అవకాశం ఉంది. దీంతోనే వీరిద్దరి పేర్లను ఇజ్రాయిల్ తొలగించింది. ఇరాన్‌లో వీరిద్దరు అగ్రశ్రేణి నెగోషియేటర్లుగా ఉన్నారు. వీరిద్దరిని హత్య చేస్తే చర్చలు, దౌత్య ప్రక్రియ ముందుకు వెళ్లదనే ఉద్దేశంతోనే ఇజ్రాయిల్ తన లిస్టు నుంచి తొలగించింది. మధ్యవర్తిత్వం కోసం పాకిస్తాన్, టర్కీ, ఈజిప్టులు పనిచేస్తున్నాయని నివేదికలు చెబుతున్నారు.

‘‘ఇజ్రాయిల్ వీరిద్దరి ఆచూకీ తెలుసుకుని అంతం చేయాలని అనుకుంటుంది. వీరిని చంపేస్తే మాట్లాడటానికి ఎవరూ ఉండరని అమెరికాకు చెప్పాం. అందుకే అమెరికా ఇజ్రాయిల్‌ను వెనక్కి తగ్గాలని చెప్పింది’’ అని చర్చల విషయం తెలిసిన పాకిస్తానీ మూలాలు చెబుతున్నట్లు రాయిటర్స్ తెలిపింది. అయితే, ఈ ఉపశమనం కేవలం తాత్కాలికమైందేనని, దీనికి ఒక గడువు ఉందని తెలుస్తోంది. ట్రంప్‌తో ఉన్నత స్థాయి చర్చల కోసం మార్గం సుగమం చేసేందుకు ఘాలిబాఫ్, అరాఘ్చీలపై నాలుగు లేదా ఐదు రోజుల వరకు ఇజ్రాయిల్ తన కిల్ లిస్ట్‌ నుంచి వీరిద్దరిని తొలగించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Allu Arjun: సరిహద్దులు దాటిన ‘రామ’ నామం.. జపాన్ దిగ్గజానికి అల్లు అర్జున్ అరుదైన కానుక!

సినిమాలతోనే కాదు, తన వ్యక్తిత్వంతోనూ దేశం గర్వించేలా చేస్తున్నారు ఐకాన్ స్టార్...

ಸಾದಿಕ್ ಪೈಲ್ವಾನ್ ಹುಟ್ಟು ಕಾಂಗ್ರೆಸ್ಸಿಗ: ಕಣದಿಂದ ಹಿಂದೆ ಸರಿದಿದ್ದಾರೆ-ಡಿಸಿಎಂ ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,27,2026 (www.justkannada.in): ದಾವಣಗೆರೆ ದಕ್ಷಿಣ ಉಪಚುನಾವಣೆ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕಾಂಗ್ರೆಸ್ ವಿರುದ್ದ...

ഹോര്‍മുസ് കടലിടുക്ക് അടച്ചു; അമേരിക്കയുടെയും സഖ്യകക്ഷികളുടെയും തുറമുഖങ്ങളിലേക്കുള്ള കപ്പല്‍ ഗതാഗതം നിരോധിച്ചു: ഐ.ആര്‍.ജി.സി

ടെഹ്‌റാന്‍: ഹോര്‍മുസ് കടലിടുക്ക് വഴിയുള്ള യു.എസിന്റെയും സഖ്യകക്ഷികളുടെയും തുറമുഖങ്ങളിലേക്കും തിരിച്ചുമുള്ള കപ്പലുകളുടെ...

பெரம்பூரில் விஜய் பிரசாரத்துக்கு அனுமதி மறுப்பு? நிர்வாகிகள் அவசர ஆலோசனை! – நிலவரம் என்ன?

தவெக தலைவர் விஜய் நாளை அவர் போட்டியிடவிருக்கும் பெரம்பூர் தொகுதியிலிருந்து பிரசாரத்தை...