24
March, 2026

A News 365Times Venture

24
Tuesday
March, 2026

A News 365Times Venture

Double Bedroom House Scam: డబుల్ బెడ్‌రూమ్ ‘కిలాడీ లేడీ’.. 300 మందికి కుచ్చుటోపీ!

Date:

Double Bedroom House Scam: సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కానీ ఇల్లు కట్టాలంటే మాటలు కాదు.. లక్షల రూపాయలు వెచ్చించాలి. ఈ క్రమంలో పేదలకు సొంతింటి కల.. అందని ద్రాక్షగానే మిగులుతోంది. దీంతో అర్హులైన వారికి ప్రభుత్వమే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేస్తోంది. కానీ దీనిలోనూ ప్రవేశించిన కేటుగాళ్లు.. మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కావాలా? జస్ట్ మాకు డబ్బులు ఇస్తే చాలు.. అన్ని పనులు మేమే పూర్తి చేస్తాం. మీకు డబుల్ బెడ్‌రూమ్ ఇప్పిస్తాం. ఇదిగో చూడండి.. గతంలో చాలా మందికి ఇప్పించాం. అని పత్రాలు చూపిస్తూ ఓ ముఠా పేదలను లక్ష్యంగా చేసుకుని దందా చేస్తోంది. అలాంటి ముఠా ఆట కట్టించారు హైదరాబాద్ పోలీసులు. అందులో ఉన్న ఓ మహిళ ఈ దందాను నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఏకంగా కలెక్టర్‌తోపాటు ఎమ్మార్వో సంతకాలనే ఫోర్జరీ చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. ఇంతకీ ఆ కిలాడీ లేడీ ఎవరు? పోలీసుల విచారణలో బయటపడిన సంచలన విషయాలు ఏంటి అనేది చదవేయండి.

READ ALSO: Ganja Murders: మత్తులో మృగాళ్లు.. భాగ్యనగరంలో గంజాయి బ్యాచ్‌ల వీరంగం.. రెండు రోజుల్లో ఇద్దరి బలి!

ఓ మహిళ నేతృత్వంలో మొత్తం నలుగురు ముఠాగా ఏర్పడ్డారు. వారు కల్లు దుకాణాల వద్ద మకాం వేస్తారు. కొంత మందిని గుర్తించి ..వారికి మద్యం తాగిస్తారు. వారు మత్తులోకి జారుకున్న తర్వాత వాళ్లతో సంతకాలు పెట్టిస్తారు. ఆ సంతకాలే తీసుకువెళ్లి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయించామని చూపెట్టి డబ్బులు వసూలు చేస్తారు. ఏకంగా కలెక్టర్, ఎమ్మార్వో, ఆర్డీఓల సంతకాలని కూడా కల్లు దుకాణాల వద్ద పెట్టించి నిరుపేదలకు చూపెట్టి డబ్బులు వసూలు చేస్తోంది ఈ ముఠా. గత కొన్నాళ్ల నుంచి ఈ ముటా ఇలాగే డబుల్ బెడ్‌రూమ్ పేరుతో మోసాలు చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇందులో ఒక మహిళ కీలకంగా వ్యవహరిస్తోందని చెబుతున్నారు. ఈ మహిళనే నకిలీ సంతకాలు.. నకిలీ పత్రాలు తయారు చేయించి ఇల్లులేని వారికి చూపెట్టి డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడుతుంది. నగరానికి చెందిన ఓ మహిళ ముగ్గురితో కలసి ముఠా ఏర్పాటు చేసింది. ఆటోలో చక్కర్లు కొడుతూ… పేదలు నివసించే కాలనీలే లక్ష్యంగా చేసుకుంటుంది. తన పలుకుబడితో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇప్పిస్తానంటూ మాయమాటలు చెబుతుంది. ఒక్కొక్కరి నుంచి 15 వేల రూపాయలు వసూలు చేస్తుంది. సచివాలయం వద్ద పాగా వేసి అక్కడకు వచ్చే వారిలో అమాయకులను ఎంచుకొని ఉద్యోగాలిప్పిస్తానంటూ బురిడీ కొట్టిస్తుంది. గతంలో పోలీసు కేసు నమోదైన అరెస్ట్ చేయకపోవటంతో దర్జాగా దందా చేసింది. సుమారు 300 మందిని మోసగించింది.

ఇటీవల ఖైరతాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితురాలితో సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నకిలీ పత్రాలపై ఆర్డీవో, కలెక్టర్ సంతకాలను పోర్జరీ చేసినందుకు ఓ వ్యక్తికి రోజూ రూ.100 ఇచ్చినట్టు దర్యాప్తులో గుర్తించారు. మద్యం మత్తులో ఉన్న అతడు ఉన్నతాధికారుల సంతకాలు చేయటం పోలీసులను విస్మయానికి గురిచేసింది. సంక్షేమపథకాలను ఇప్పిస్తామంటూ నగరంలో పలువురు దళారులు లబ్దిదారుల నుంచి పెద్దఎత్తున సొమ్ములు వసూలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

ఈ అక్రమాల వ్యవహారంలో కొందరు చోటానేతలు, గల్లీ లీడర్ల ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలున్నాయి. సొంతింటి కలను నిజం చేస్తామని నమ్మించి దరఖాస్తు చేసేందుకు ఖర్చులంటూ మొదట 5 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అధికారుల ఆమోదం వచ్చిందని నకిలీపత్రాలను చూపుతున్నారు. నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ గృహ సముదాయం వద్దకు లబ్దిదారులను తీసుకెళ్తున్నారు. ఇల్లు మంజూరు చేశామంటూ నకిలీ తాళం చెవి, పట్టా చేతికిచ్చి రూ. 25వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయి లబ్దిదారులు మోసపోయామని గ్రహించేలోపు మరో ప్రాంతంలో మకాం వేస్తున్నారని పోలీసు అధికారి తెలిపారు. అంబర్‌పేట్, మలక్‌పేట్, ముషీరాబాద్, బోరబండ, ఎస్సార్‌నగర్, కూకట్‌పల్లి ప్రాంతాల్లో కొందరు మహిళలు ముఠాగా ఏర్పడి ఈ దందా చేస్తున్నారని అన్నారు.

READ ALSO: Bengal Election: బెంగాల్ రాజకీయ కురుక్షేత్రంలో కొత్త పొత్తు.. దీదీ తృణమూల్ కోటలకు బీటలు వారుతాయా?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬೆಲೆ ಏರಿಕೆಯೇ ಸರ್ಕಾರದ ಸಾಧನೆ: ಎರಡು ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬಿಜೆಪಿ ಗೆಲುವು ನಿಶ್ಚಿತ-ಶ್ರೀರಾಮುಲು

ರಾಯಚೂರು,ಮಾರ್ಚ್,23,2026 (www.justkannada.in):   ಎರಡು ವರ್ಷಗಳಲ್ಲಿ ಹಲವು ವಸ್ತುಗಳ ಬೆಲೆ ಏರಿಕೆ...

സൗദിയില്‍ നിന്നുള്ള എണ്ണ കപ്പലും ഇന്ത്യയിലേക്ക്; ഹോര്‍മുസ് കടക്കാന്‍ നഷ്ടപരിഹാരം വാങ്ങുന്നെന്ന വാദം തള്ളി ഇറാന്‍

ന്യൂദല്‍ഹി: ഇന്ത്യയുടെ ഇന്ധനക്ഷാമത്തിന് ആശ്വാസമായി മൂന്ന് കപ്പലുകള്‍ ഹോര്‍മുസ് കടലിടുക്ക് കടന്ന്...

Petrol, Diesel Prices: ఒక్కసారిగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. మూడు రెట్లు పెంచుతూ సంచలన నిర్ణయం!

Petrol, Diesel Prices: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి చుట్టూ నెలకొన్న...