23
March, 2026

A News 365Times Venture

23
Monday
March, 2026

A News 365Times Venture

Putin praises Iran: ఉద్రిక్తతల మధ్య పుతిన్ ఇరాన్‌కు సాలిడ్ సపోర్ట్.. రష్యా నమ్మకమైన స్నేహితుడు అంటూ సందేశం

Date:

రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పర్షియన్ న్యూ ఇయర్ నౌరూజ్ సందర్భంగా ఇరాన్ నాయకత్వానికి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాస్కో ఇరాన్‌కు “నమ్మకమైన స్నేహితుడు, విశ్వసనీయ భాగస్వామి”గా ఉందని పేర్కొన్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల మధ్య ఈ సందేశం ప్రాముఖ్యత సంతరించుకుంది. క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, పుతిన్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా సయ్యద్ మొజ్తబా హొస్సేనీ ఖమెనేయి, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌లకు నౌరూజ్ శుభాకాంక్షలు పంపారు.

Also Read:Pawan Kalyan : దేవకట్టా దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా

ఇరాన్ ప్రజలు ఈ “తీవ్రమైన సవాళ్లను” ధైర్యంగా అధిగమించాలని కోరారు. ఈ కష్టకాలంలో మాస్కో టెహ్రాన్‌కు నమ్మకమైన స్నేహితుడు, విశ్వసనీయ భాగస్వామిగా ఉంటుందని తెలిపారు. ఈ సందేశం ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన ఇరాన్-పశ్చిమ యుద్ధం నాలుగో వారంలోకి అడుగుపెట్టిన సమయంలో వచ్చింది. రష్యా దీర్ఘకాల ఇరాన్ మిత్రదేశంగా, ఈ దాడులను ఖండించింది. పుతిన్ సందేశం రష్యా-ఇరాన్ మధ్య రాజకీయ, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:Narendra Modi: నరేంద్ర మోదీ అరుదైన రికార్డు.. చరిత్ర సృష్టించిన పీఎం..

నౌరూజ్, ఇరాన్, ఇతర పర్షియన్ సంస్కృతి దేశాల్లో వసంత ఋతు ప్రారంభాన్ని సూచించే ప్రధాన పండుగ. ఈ సందర్భంగా పుతిన్ సందేశం ఇరాన్‌కు రాజకీయ మద్దతును సూచిస్తుంది. కొంతమంది ఇరాన్ వర్గాలు రష్యా నుంచి ఆశించిన స్థాయిలో సహాయం రాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ, ఈ శుభాకాంక్షలు రెండు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని సంకేతం ఇస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, రష్యా ఇరాన్‌కు మద్దతు తెలపడం ప్రాంతీయ రాజకీయాలపై ప్రభావం చూపవచ్చు. పుతిన్ ఈ సందేశంతో ఇరాన్‌కు నైతిక బలం ఇచ్చారని, భవిష్యత్ సహకారానికి దారి సుగమం చేశారని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

LPG crisis India: వంటగ్యాస్‌లో కొత్త మార్పు.. ఇకపై, 14.2 కేజీల సిలిండర్‌కు బదులుగా, 10 కేజీల సిలిండర్!

మధ్యప్రాచ్య సంక్షోభం, తరిగిపోయిన దేశీయ నిల్వలు, తగ్గిన దిగుమతుల కారణంగా, ప్రభుత్వ...

ശമ്പളം കുറവ്; മിടുക്കരായ അഭിഭാഷകര്‍ ജഡ്ജിയാവാന്‍ തയ്യാറാവുന്നില്ല: സുപ്രീം കോടതി ജഡ്ജി

ന്യൂദല്‍ഹി: ജഡ്ജിമാര്‍ക്കുള്ള പ്രതിമാസ ശമ്പളം വര്‍ധിപ്പിക്കണെമെന്ന് സുപ്രീം കോടതി ജഡ്ജി ദീപാങ്കര്‍...

പത്ത് വര്‍ഷമായി നരകത്തില്‍, ലീഗില്‍ അംഗത്വമെടുത്തപ്പോള്‍ സ്വര്‍ഗത്തിലേക്ക് അടുത്തു; തിരിച്ചുവരവില്‍ കാരാട്ട് റസാഖ്

കോഴിക്കോട്: ഇടതുപാളയം വിട്ട് വീണ്ട് മുസ്‌ലിം ലീഗിലേക്ക് ചേക്കേറിയതിന് പിന്നാലെ സി.പി.ഐ.എമ്മിനെതിരെ...