20
March, 2026

A News 365Times Venture

20
Friday
March, 2026

A News 365Times Venture

Samsung భారీ ఆఫర్.. సగం ధరకే Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్.. !

Date:

శాంసంగ్ తన వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వాడాలనే కల ఉన్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ‘గెలాక్సీ ఫరెవర్’ (Galaxy Forever) అనే ఈ కొత్త ప్రోగ్రామ్ ద్వారా, మీరు రూ.1.5 లక్షల విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్26 అల్ట్రా (Samsung Galaxy S26 Ultra) ఫోన్‌ను కేవలం సగం ధరకే పొందే వీలు కల్పించింది..

ఏమిటీ గెలాక్సీ ఫరెవర్ ప్లాన్?
సాధారణంగా మనం ఫోన్ కొనేటప్పుడు పూర్తి నగదు చెల్లిస్తాం లేదా పూర్తి ధరపై EMI కడతాం. కానీ ఈ ప్లాన్ ప్రకారం, మీరు ఫోన్ మొత్తం ధర చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం 50 శాతం ధరను మాత్రమే 12 నెలల వాయిదాలలో (No-cost EMI) చెల్లించి ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు ఈ ఫోన్‌ను ఉపయోగించిన తర్వాత, మీకు మూడు రకాల ఎంపికలు ఉంటాయి..

– వాపసు ఇవ్వడం (Return): మీకు ఫోన్ వద్దు అనుకుంటే, ఏడాది తర్వాత ఫోన్‌ను కంపెనీకి తిరిగి ఇచ్చేయవచ్చు. అప్పుడు మీరు మిగిలిన 50 శాతం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు.
– అప్‌గ్రేడ్ అవ్వడం (Upgrade): పాత ఫోన్ ఇచ్చేసి, అప్పుడు మార్కెట్లోకి వచ్చే కొత్త మోడల్‌కు అప్‌గ్రేడ్ అవ్వచ్చు.
– సొంతం చేసుకోవడం (Keep): ఒకవేళ ఆ ఫోన్ మీకు బాగా నచ్చి మీ దగ్గరే ఉంచుకోవాలనుకుంటే, మిగిలిన 50 శాతం బ్యాలెన్స్ మొత్తాన్ని కట్టేసి పూర్తి యజమాని అవ్వచ్చు.

ఎవరికి ఇది ప్రయోజనకరం?
ప్రతి ఏటా కొత్త మోడల్ ఫోన్ మార్చాలనుకునే వారికి ఇది వరం లాంటిది. పాత ఫోన్ ఎక్కడ అమ్మాలి? ఎంత ధర వస్తుంది? అనే తలనొప్పి ఉండదు. అంతేకాకుండా ఒకేసారి లక్షన్నర రూపాయలు పెట్టలేని వారు, నెలకు తక్కువ EMIతో లగ్జరీ ఫోన్ అనుభూతిని పొందవచ్చు. అదే విధంగా ఆఫీస్ పనుల కోసం హై-ఎండ్ ఫోన్ వాడే వారికి ఇది చాలా పొదుపుగా ఉంటుంది.

ముఖ్య గమనిక:
ఈ ప్లాన్ కింద శాంసంగ్ Care+ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. దీనివల్ల ఫోన్ పొరపాటున కింద పడినా లేదా నీటిలో పాడైనా ఇన్సూరెన్స్ రక్షణ ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 1,500 కంటే ఎక్కువ శాంసంగ్ స్టోర్లలో ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കോണ്‍ഗ്രസിന്റെ രണ്ടാംഘട്ട സ്ഥാനാര്‍ത്ഥി പട്ടിക പ്രഖ്യാപിച്ചു; കണ്ണൂരില്‍ ടി.ഒ മോഹനന്‍, അബിന്‍ വര്‍ക്കിയും സന്ദീപ് വാര്യരും പട്ടികയില്‍

തിരുവനന്തപുരം: ഏറെ അനിശ്ചിതത്വത്തിനും ചര്‍ച്ചകള്‍ക്കുമൊടുവില്‍ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പിനുള്ള കോണ്‍ഗ്രസിന്റെ രണ്ടാം ഘട്ട...

'சட்டமன்ற தேர்தலில் போட்டியிடச் சொன்னால் என்ன செய்வேன் தெரியுமா?'- சுரேஷ் கோபி சொல்வது என்ன?

கேரள மாநிலத்தில் சட்டசபை தேர்தல் ஏப்ரல் 9-ம் தேதி நடக்கிறது. அதற்கான...

Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

Gaddar Film Awards 2026: హైదరాబాద్‌లో ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్...

ಕಮರ್ಷಿಯಲ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವ: ಒಂದು ವಾರ ಸಹಿಸಿಕೊಳ್ಳಿ – ಸಚಿವ ಕೆ.ಎಚ್ ಮುನಿಯಪ್ಪ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ  ಕಮರ್ಷಿಯಲ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವವಿದೆ. ಹೋಟೆಲ್ ನವರು...