19
March, 2026

A News 365Times Venture

19
Thursday
March, 2026

A News 365Times Venture

iPhone 17e.. చౌకగా అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్.. పనితీరు ఎలా ఉందంటే..?

Date:

iPhone 17e: యాపిల్‌ సంస్థ తయరు చేసే ఐఫోన్‌ కోసం ఎదురుచూసేవాళ్లు ఎంతో మంది ఉంటారు.. ఐఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చిందంటే చాలు.. రోజులు, గంటల తరబడి.. క్యూలైన్‌లో నిలబడి ఫోన్‌ అందుకున్న తర్వాత ఆనందంతో ఉప్పొంగి పోతారు.. అయితే, ఐఫోన్‌ అంటేనే.. ఖరీదైనది.. మిడిల్‌ క్లాస్‌, లోయర్‌ క్లాస్‌ కొనలేదని వెనక్కి తగ్గేవారు కొందరైతే.. ఏదేమైనా ఐఫోన్‌ కొనాల్సిందే అని పట్టుబట్టి కొనుగోలు చేసేవారే చాలా మంది అని చెప్పాలి.. ఇప్పుడు యాపిల్‌ కూడా తన పంతా మార్చింది.. iPhone 17e అనేది యాపిల్‌ ఇటీవల విడుదల చేసిన అత్యంత చౌకైన ఐఫోన్ మోడల్. ఐఫోన్ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఇది మంచి ఎంపికగా నిలుస్తోంది. దీని పనితీరును ఓసారి పరిశీలిస్తే..

భారతదేశంలో ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.64,900 కాగా, బేస్ వేరియంట్ 256GB స్టోరేజ్‌తో అందుబాటులో ఉంది. ఇది గత ఏడాది వచ్చిన iPhone 16e కి అప్‌గ్రేడ్ వెర్షన్.

డిజైన్ అండ్‌ డిస్‌ప్లే
ఈ ఫోన్ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ నాణ్యత చాలా బాగుంది.. రంగులు ప్రకాశవంతంగా, టెక్స్ట్ క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే, 60Hz రిఫ్రెష్ రేట్ మాత్రమే ఉండటం కొంచెం నిరాశ కలిగిస్తుంది, ఎందుకంటే ఈ ధరలో అనేక ఆండ్రాయిడ్ ఫోన్‌లు 120Hz అందిస్తున్నాయి. డైనమిక్ ఐలాండ్ లేకపోవడం, పాత నాచ్ డిజైన్ కొనసాగడం వల్ల డిజైన్ కొంచెం పాతదిగా అనిపిస్తుంది.

నిర్మాణ నాణ్యత
అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బ్యాక్‌తో ఈ ఫోన్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. సెరామిక్ షీల్డ్ రక్షణతో స్క్రీన్ మరింత బలంగా ఉంటుంది. సుమారు 169 గ్రాముల బరువుతో ఇది తేలికగా, హ్యాండీగా ఉంటుంది. మ్యాగ్‌సేఫ్ సపోర్ట్ తిరిగి రావడం ఒక మంచి ప్లస్ పాయింట్‌గా చెబుతున్నారు..

పనితీరు
ఈ ఫోన్‌లో కొత్త A19 చిప్ ఉంది, ఇది వేగవంతమైన పనితీరును అందిస్తుంది. యాప్‌లు త్వరగా ఓపెన్ అవుతాయి, మల్టీటాస్కింగ్ స్మూత్‌గా ఉంటుంది. iOS 26 తో రావడం వల్ల దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ కూడా లభించే అవకాశం ఉంది.

కెమెరా
48MP ప్రధాన కెమెరా మంచి ఫోటోలను అందిస్తుంది. డే లైట్‌లో క్లియర్, నేచురల్ కలర్స్ కనిపిస్తాయి.. 2x జూమ్ సపోర్ట్.. 4K డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ ఉంది.. అయితే, అల్ట్రా-వైడ్ కెమెరా లేకపోవడం ఒక లోపం. రాత్రి ఫోటోలు సరే అనిపిస్తాయి.. కానీ డ్యూయల్ కెమెరా ఫోన్‌లతో పోలిస్తే కొంచెం తక్కువగానే చెప్పాలి..

బ్యాటరీ
రోజువారీ వాడకంలో ఒక పూర్తి రోజు సులభంగా పనిచేస్తుంది. తక్కువ వినియోగంలో 2–3 రోజులు కూడా నిలుస్తుంది. USB Type-C ఛార్జింగ్, మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. మొత్తంగా iPhone 17e ఒక మంచి ఎంట్రీ-లెవల్ ఐఫోన్… పనితీరు బలంగా ఉంది.. కెమెరా సరిపడా విధంగానే ఉంది.. ఇక, సాఫ్ట్‌వేర్ అనుభవం అద్భుతంగా చెప్పుకోవాలి.. కానీ, 60Hz స్క్రీన్, ఒకే కెమెరా, పాత డిజైన్.. ఇవీ కొంతమంది వినియోగదారులకు మైనస్ పాయింట్లు కావచ్చు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಕಮರ್ಷಿಯಲ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವ: ಒಂದು ವಾರ ಸಹಿಸಿಕೊಳ್ಳಿ – ಸಚಿವ ಕೆ.ಎಚ್ ಮುನಿಯಪ್ಪ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,18,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ  ಕಮರ್ಷಿಯಲ್ ಸಿಲಿಂಡರ್ ಅಭಾವವಿದೆ. ಹೋಟೆಲ್ ನವರು...

യു.എസ് ഉപരോധത്തിന് മറുപടി;എണ്ണയും വാതകവുമായി രണ്ട് റഷ്യന്‍ കപ്പലുകള്‍ ക്യൂബയിലേക്ക്; റിപ്പോര്‍ട്ട്

ഹവാന: യു.എസ് ഉപരോധത്തിന് പിന്നാലെ ഇരുട്ടിലായ ക്യൂബയ്ക്ക് ആശ്വാസവുമായി റഷ്യയുടെ എണ്ണയും...

கத்தார் எரிவாயு முனையம் மீது தாக்குதல்: உலகளவில் எகிறும் எரிசக்தி விலை – இந்தியாவிற்கு நெருக்கடி!

அமெரிக்க - இஸ்ரேல் படைகள் ஈரான் மீது நடத்திய தாக்குதலுக்குப் பதிலடியாக,...

Samsung భారీ ఆఫర్.. సగం ధరకే Galaxy S26 Ultra స్మార్ట్‌ఫోన్.. !

శాంసంగ్ తన వినియోగదారుల కోసం ఒక విప్లవాత్మకమైన ఆఫర్‌ను ప్రకటించింది. ప్రీమియం...