17
March, 2026

A News 365Times Venture

17
Tuesday
March, 2026

A News 365Times Venture

Nepali Gang : అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశారు..

Date:

హైదరాబాద్‌లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. జస్ట్ ఇంట్లో పని మనుషులుగా చేరడం.. కరెక్ట్‌గా రెక్కీ చేయడం.. ఆ తర్వాత ప్లాన్ పక్కాగా అమలు చేసి ఉన్నదంతా ఊడ్చుకెళ్లడం నేపాలీ గ్యాంగ్ స్టైల్. తాజాగా మరోసారి జూబ్లీహిల్స్‌లో పని చేసిన ఇంటికే కన్నం వేసింది నేపాలీ గ్యాంగ్. ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. పొట్ట చేత పట్టుకుని నేపాల్ నుంచి వచ్చాం.. పని ఇవ్వమని అడిగితే పని మనుషులుగా చేర్చుకున్నందుకు ఆ ఇంటికే ఎసరు పెట్టారు ఇద్దరు నేపాలీ దంపతులు.. ఇంటిలో 2 కోట్ల రూపాయల ఆభరణాలను భారీ చోరికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్‌-25లోని ప్లాట్‌ నెం.305లో పింగళి అనిరుద్ధ్ రెడ్డి అనే వ్యాపారి, భార్య దీపికారెడ్డితో కలిసి ఉంటున్నాడు. నగరంలోని ప్రసిద్ధ హోటల్‌ యజమాని కుమార్తె అయిన దీపికారెడ్డి దంపతులు ఇంటికి తాళాలు వేసి ఊటీకి వెళ్లారు. 45 రోజుల క్రితమే ఈ ఇంట్లో నేపాల్‌కు చెందిన మహేష్‌ షాయి, అప్సర దంపతులు పనిమనుషులుగా చేరారు…

Fastag Secrets : ఫాస్టాగ్ గురించి మీరు తెలుసుకోవలసిన కీలక అంశాలు

యజమాని వద్ద నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటించారు. పక్కా పథకంతో ఇంట్లో చేరిన నేపాలీ దంపతులు అవకాశం కోసం ఎదురు చూశారు. నాలుగైదు రోజుల నుంచి ఇంట్లోకి ఎలా వెళ్లాలి? నగలు, నగదు ఎక్కడ భద్రపరిచారు? వంటి వాటిపై క్షుణ్నంగా రెక్కీ నిర్వహించారు.. యజమానులు అనిరుధ్‌రెడ్డి, దీపికారెడ్డి ఊటికి వెళ్లడంతో రాత్రి 12.30 గంటల సమయంలో కత్తులు, రాడ్ల సహాయంతో నేపాలీ దంపతులు తమ ప్లాన్ అమలు చేశారు. ముందుగా ప్రధాన ద్వారం తాళం పగులగొట్టారు. బెడ్‌రూమ్‌లోకి వెళ్లి అల్మారాను, లాకర్లను తెల్లవారుజామున 4.30 గంటల వరకు పగులగొట్టారు. 8 డైమండ్‌ నెక్లెస్‌లు, 10 రోలెక్స్‌ వాచీలు, బంగారు నగలను బ్యాగ్‌లో సర్దుకుని ఉడాయించారు…

Sonia Gandhi vs Deve Gowda: సోనియాగాంధీకి మాజీ ప్రధాని లేఖ.. హాట్ టాపిక్‌గా అంశాలు

ఉదయం ఇంటికి వచ్చిన డ్రైవర్‌ గమనించి యజమానికి సమాచారం ఇచ్చాడు. అనంతరం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ దంపతులను పనిలో కుదిర్చిన పాత పనిమనుషులు హరత్‌ సింగ్, రీమాసింగ్‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు… నేపాల్‌ సరిహద్దులతోపాటు ముంబై, బీహార్‌లకు పోలీసు బృందాలు చేరుకుని నిఘా పెట్టాయి. 8 డైమండ్‌ నెక్లెస్‌లు, బంగారు ఆభరణాలు, 10 రోలెక్స్‌ వాచీలు విలువ దాదాపు 2 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు…

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chairmans Desk: ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కు కలిగిన నష్టమేంటి..? అమెరికా స్నేహం ఎలా కొంప ముంచింది.?

Chairmans Desk : ఇరాన్‌-అమెరికా యుద్ధాన్ని…ప్రపంచంలో యుద్ధ రంగ నిపుణులు, అంతర్జాతీయ...

ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ವಿತರಣೆಯಲ್ಲಿ ಸಮಸ್ಯೆಯಾದ್ರೆ ಆಹಾರ ನಿರೀಕ್ಷಕರನ್ನು ಸಂಪರ್ಕಿಸಿ: ಜಿಲ್ಲಾಧಿಕಾರಿ

ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ, ಮಾರ್ಚ್,16,2026 (www.justkannada.in): ಜಿಲ್ಲೆಯಾದ್ಯಂತ ಎಲ್ ಪಿಜಿ ಸಿಲಿಂಡರ್...

Bihar Rajya Sabha Election; എ.ഐ.എം.ഐ.എമ്മും ബി.എസ്.പിയും വോട്ട് ചെയ്തു; കോണ്‍ഗ്രസ്-ആര്‍.ജെ.ഡി എം.എല്‍.എമാര്‍ വിട്ടുനിന്നു, എന്‍.ഡി.എയ്ക്ക് വിജയം

പാട്‌ന: ബീഹാറിലെ രാജ്യസഭാ സീറ്റുകളിലേക്കുള്ള തെരഞ്ഞെടുപ്പില്‍ എന്‍.ഡി.എ സഖ്യത്തിന് വിജയം. സംസ്ഥാനത്തെ...

பேராவூரணி தொகுதியை கூட்டணிக்கு தரமாட்டார் எடப்பாடி! – அதிமுக வேட்பாளர் ரேஸில் முந்துவது யார்?

தஞ்சாவூர் மாவட்டத்தில் உள்ள எட்டு சட்டமன்றத் தொகுதிகளில் ஒன்று பேராவூரணி. கடமைடை...