14
March, 2026

A News 365Times Venture

14
Saturday
March, 2026

A News 365Times Venture

Mahmudullah: భారత్ చేతిలో ఆ ఓటమి ఇప్పటికీ మర్చిపోలేము.. ఆటగాళ్లందరం బోరున ఏడ్చేశాం.!

Date:

Mahmudullah: 2016 టీ20 వరల్డ్‌కప్‌ లో భారత్‌ తో జరిగిన మ్యాచ్‌ ను గుర్తు చేసుకుంటూ బంగ్లాదేశ్ మాజీ క్రికెటర్ మహ్మదుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ మ్యాచ్‌ లో ఓటమి తర్వాత తమ జట్టు ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్ లో కన్నీళ్లు పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. 2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 2016లో భారత్–బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది.

AP Liquor Scam Case: ఎంపీ మిథున్‌రెడ్డి వ్యవహారంలో కీలక మలుపు..

చివర్లో బంగ్లాదేశ్ విజయం సాధించేందుకు 6 బంతుల్లో 11 పరుగులు అవసరమయ్యాయి. ఆ ఓవర్‌ ను భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వేయగా.. రెండు, మూడో బంతులను ముష్ఫికూర్ రహీమ్ వరుస బౌండరీలకు తరలించాడు. అయితే ఆ తర్వాత పాండ్యా అద్భుతంగా తిరిగి మ్యాచ్‌ లోకి వచ్చాడు. వరుస బంతుల్లో రహీమ్, మహ్మదుల్లా వికెట్లు తీసి మ్యాచ్‌ ను మళ్లీ భారత్ వైపు తిప్పాడు. చివరి బంతికి బంగ్లాదేశ్‌కు కేవలం రెండు పరుగులు అవసరం కాగా.. శువగత బంతిని సరిగా కనెక్ట్ చేయలేకపోయాడు.

అప్పుడు భారత కెప్టెన్ ధోనీ వేగంగా పరుగెత్తి వచ్చి వికెట్లను పడగొట్టాడు. రీప్లేలో నాన్‌ స్ట్రైకర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ సమయానికి క్రీజ్‌ లోకి చేరలేదని తేలడంతో అవుట్‌ గా ప్రకటించారు. దీంతో భారత్ ఒక్క పరుగుతో విజయం సాధించింది. దశాబ్దం తర్వాత ఆ మ్యాచ్‌ ను గుర్తు చేసుకున్న మహ్మదుల్లా.. అది చాలా బాధాకరమైన ఓటమి అని వర్ణించాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలోనే కాకుండా హోటల్‌కు వెళ్లిన తర్వాత కూడా ఆటగాళ్లు ఏడ్చారని తెలిపారు.

Harshit Rana: టోర్నీ ప్రారంభం కాకముందే KKRకి భారీ షాక్.. హర్షిత్ రాణా టోర్నీ నుండి అవుట్..!

“ఆ మ్యాచ్‌లో ఏమైందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. అది చాలా విషాదకరమైన ఘటన. మేము మైదానంలోనే ఏడ్చాం. హోటల్‌ కు వెళ్లిన తర్వాత కూడా ఏడ్చాం. నేను, ముష్ఫికూర్ రహీమ్ మాత్రమే కాదు.. చాలా మంది ఆటగాళ్లు ఏడ్చారు. భారత్‌ను ఓడించే అవకాశం చాలా దగ్గరగా వచ్చి పోయింది” అని మహ్మదుల్లా ఒక పాడ్‌ కాస్ట్‌ లో చెప్పుకొచ్చాడు. ఇంకా వ్యక్తిగతంగా కూడా ఆ మ్యాచ్ పెద్ద గుణపాఠం నేర్పిందని మహ్మదుల్లా తెలిపారు. చివరి సమయంలో బౌండరీ కొట్టే ప్రయత్నం చేయడం తాను చేసిన తప్పు అని, స్ట్రైక్ మార్చి ఆడితే ఫలితం వేరుగా ఉండేదని ఆయన తన భావాన్ని వ్యక్త పరిచాడు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Sabarimala Entry: శబరిమల ఆలయ ప్రవేశంపై కేరళం ప్రభుత్వ ‘యూటర్న్’.. 50 ఏళ్లలోపు మహిళలు ప్రవేశించకూడదంటూ.!

Sabarimala Entry: శబరిమల ఆలయ ప్రవేశంపై మరోమారు దుమారం రేగుతుంది. కేరళంలో...

ಮಾ.28ಕ್ಕೆ ಒಳಮೀಸಲಾತಿ ಬಗ್ಗೆ ಸಭೆ: ಅಂದು ಸಮಸ್ಯೆ ಬಗೆಹರಿಯುತ್ತೆ- ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,14,2026 (www.justkannada.in): ಮಾರ್ಚ್ 28ಕ್ಕೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಒಳಮೀಸಲಾತಿ ಬಗ್ಗೆ...

ഹോട്ടലുകള്‍ കല്‍ക്കരിയിലേക്കും വീടുകള്‍ക്ക് പി.എന്‍ജിയിലേക്കും മാറണം; എല്‍.പി.ജി ക്ഷാമം പരിഹരിക്കാന്‍ സര്‍ക്കാരിന്റെ പുതിയ നിര്‍ദേശം

ന്യൂദല്‍ഹി: ഇറാനെതിരായ ഇസ്രഈല്‍-അമേരിക്ക യുദ്ധത്തിന്റെ അനന്തരഫലമായി ഇന്ധന ക്ഷാമം രൂക്ഷമാവുന്ന സാഹചര്യത്തില്‍...