13
March, 2026

A News 365Times Venture

13
Friday
March, 2026

A News 365Times Venture

Heroes Body Transformation: సినిమాల కోసం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్.. యంగ్ హీరోల సరికొత్త లుక్స్ వైరల్..!

Date:

Heroes Body Transformation: ప్రస్తుతం టాలీవుడ్‌లో మేకోవర్ సీజన్ నడుస్తోంది. కొత్త సినిమాల కోసం హీరోలు తమ లుక్స్‌ను పూర్తిగా మార్చుకుంటూ ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేస్తున్నారు. ఇంతకుముందు పాన్ ఇండియా స్టార్స్ మాత్రమే భారీ మేకోవర్‌ లు చేసేవారు. కానీ ఇప్పుడు అదే ట్రెండ్‌ను యంగ్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు బాడీ ట్రాన్సఫామేషన్స్ తో మెప్పించారు. ప్రస్తుతం కొందరు కుర్ర హీరోల కొత్త లుక్స్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Sara Tendulkar: అరుదైన ఫొటోలు షేర్ చేసిన సారా టెండూల్కర్

ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది “ది విజయ్ దేవరకొండ” గురించి. ఈ మేకోవర్ ట్రెండ్‌లో ఈయన కాస్త ముందునట్లు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆయన రౌడీ జనార్ధన్, రణబాలి సినిమాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ ఆయన కండలు తిరిగిన ఫిజిక్‌ తో కనిపిస్తున్నారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు, అప్డేట్స్‌ లో కూడా విజయ్ లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇక లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న అక్కినేని హీరో నాగ చైతన్య కూడా కొత్త లుక్‌ తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు. అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘వృషకర్మ’ సినిమా కోసం ఆయన కంప్లీట్ మేకోవర్ అయ్యారు. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య థ్రిల్లింగ్ యాక్షన్ సీన్స్‌లో కనిపించనున్నారు. సిక్స్ ప్యాక్ తో ఆయన లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

ఇన్నాళ్లూ యావేరేజ్ బాడీతో కనిపించిన శర్వానంద్ ఇప్పుడు పూర్తిగా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ తో న్యూ లుక్‌లో దర్శనమిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. అడ్వెంచరస్ థ్రిల్లర్‌ గా తెరకెక్కుతున్న ‘బైకర్’ బ్యాక్‌డ్రాప్ సినిమాలో నటిస్తున్న ఆయన, ఆ పాత్ర కోసం కాస్త కఠినంగానే వర్కౌట్లు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఆయన వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.

మెగా హీరోలలో ఒకరైన సాయి దుర్గ తేజ్ కూడా పూర్తిగా మారిపోయారు. ఆయన నటిస్తున్న “సంబరాల ఏటిగట్టు” సినిమా కోసం మంచి ఫిజిక్ బాడీతో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, అప్డేట్స్‌ లో ఆయన కొత్త లుక్ ఆకట్టుకుంటోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ನನ್ನನ್ನು ಬೆಳೆಸಿದಂತೆ ಯತೀಂದ್ರರನ್ನು ರಾಜಕೀಯವಾಗಿ ಬೆಳೆಸಿ-ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್13,2026 (www.justkannada.in):  ರಾಜಕೀಯವಾಗಿ ನನ್ನನ್ನು ಬೆಳೆಸಿದಂತೆ ಪುತ್ರ ಯತೀಂದ್ರರನ್ನು ಬೆಳೆಸುವಂತೆ...

കടന്നുവന്ന കനല്‍വഴികള്‍ മറ്റുള്ളവര്‍ മറന്നാലും ഞാന്‍ മറക്കില്ല; എന്റെ ചോരവീണ മണ്ണില്‍ തലയുയര്‍ത്തിത്തന്നെ നില്‍ക്കും: കെ. സുധാകരന്‍

കണ്ണൂര്‍: നിയമസഭാ സ്ഥാനാര്‍ത്ഥി നിര്‍ണയത്തിലെ അതൃപ്തി പരസ്യമാക്കി കോണ്‍ഗ്രസ് നേതാവ് കെ.സുധാകരന്‍....

பண்ணையாளர்கள் அறிமுகப்படுத்திய பரிசுகள்… வளைக்கப்பட்ட வாக்காளர்கள்! | நினைவுச் சுவடுகள் 09

பரிசுகளால் வளைக்கப்பட்ட வாக்காளர்கள்நினைவுச் சுவடுகள்தமிழ்நாட்டு அரசியலில் தேர்தல்கள் என்றால் பொதுக்கூட்டம், மாநாடு,...

ಇಂದು ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕೋರ್ ಕಮಿಟಿ ಸಭೆ: ಸಂಭಾವ್ಯ ಅಭ್ಯರ್ಥಿಗಳ ಕುರಿತು ಚರ್ಚೆ

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,13,2026 (www.justkannada.in): ಇಂದು ರಾಜ್ಯ ಬಿಜೆಪಿ ಕೋರ್ ಕಮಿಟಿ ಸಭೆ...