11
March, 2026

A News 365Times Venture

11
Wednesday
March, 2026

A News 365Times Venture

Heatwave Warning: మే నెల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఎల్ నినోపై ఐఎండీ వార్నింగ్

Date:

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం నుంచే హడలెత్తిస్తున్నాడు. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మార్చి నుంచి మే నెల వరకు దేశమంతటా వేడిగాలులు ఉంటాయని.. ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు పైగా ఉంటుందని.. 2024 సంవత్సరం కంటే ఈ ఏడాది ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

ప్రస్తుతం మార్చి మొదటి వారంలోనే అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సగటు కంటే చాలా ఎక్కువగా పెరిగినట్లుగా తెలిపింది. వేసవి కాలం పెరుగుతున్న కొద్దీ అనేక రాష్ట్రాలు తీవ్రమైన వేడి ఉంటుందని వాతావరణ సంస్థ హెచ్చరించింది.

2026 వేసవి కాలం.. 2024లో కనిపించిన రికార్డు స్థాయి కంటే ఎక్కువగా వేడిగాలులు దాటే అయ్యే అవకాశం ఉందని తెలిపింది. 2024 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో భారతదేశం 2010 తర్వాత అత్యధిక వేడిగాలులను చూసింది. అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వారాల పాటు 50 డిగ్రీలు నమోదైంది. మే 29న ఢిల్లీలోని ముంగేష్‌పూర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2026 మధ్య నాటికి లా నినా నుంచి ఎల్ నినో పరిస్థితులకు మార్పు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసింది. చారిత్రాత్మకంగా భారతదేశంలో ఎల్ నినో సంఘటనలు తీవ్రమైన వేడిగాలులు, రుతుపవనాల అసమానతలతో ముడిపడి ఉంటుంది. ఈ ఏడాది వాతావరణంలో మార్పులు తప్పవని హెచ్చరించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಅವರ ನಾಳಿನ ಮೈಸೂರು ಪ್ರವಾಸ ರದ್ದು

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ನಾಳೆ ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ  ಮೈಸೂರು ಪ್ರವಾಸವನ್ನು...

എന്തുകൊണ്ട് കേരളത്തിന് എയിംസ് അനുവദിക്കുന്നില്ല? കേന്ദ്രത്തിനെതിരെ ഹൈക്കോടതിയുടെ രൂക്ഷ വിമർശനം

കൊച്ചി : കേരളത്തിന് എയിംസ് അനുവദിക്കാത്തതിൽ കേന്ദ്രത്തിനെതിരെ രൂക്ഷ വിമർശനവുമായി ഹൈക്കോടതി...

இந்தியா வந்துகொண்டிருந்த சரக்குக் கப்பல் மீது தாக்குதல்: ஹார்முஸ் ஜலசந்தியில் ஈரான் போரால் பதற்றம்!

ஈரான் மீது இஸ்ரேலும், அமெரிக்காவும் இணைந்து போர் தொடுத்த நிலையில், மத்திய...

Afghanistan: ఇవేం బుద్ది తక్కువ పనుల్రా బాబు.. ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల విద్యపై శాశ్వత నిషేధం!

ఆఫ్ఘానిస్తాన్‌లో తాలిబన్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో, దేశ విద్యాశాఖ మంత్రి ఇటీవల...