వెస్టిండీస్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో సంజు సామ్సన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో, అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 50 బంతుల్లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వరుస వైఫల్యాలకు, విమర్శలకు బ్యాట్ తో చెక్ పెట్టి మరోసారి అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఈ బ్లాస్టింగ్ బ్యాటింగ్‌కు ICC శాంమ్సన్ కు బహుమతిని ఇచ్చింది. తాజా బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో శాంమ్సన్ 25 స్థానాలు ఎగబాకాడు.
Also Read:Annaram Barrage : అన్నారం బ్యారేజీకి ముప్పు పొంచి ఉందా..?
ICC T20 ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు, సంజు శాంమ్సన్ టీం ఇండియా తరపున ఇన్నింగ్స్ ఓపెనర్‌గా ఎంపిక చేయలేదు. ఇప్పటివరకు టోర్నమెంట్లో మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడాడు. మూడవ మ్యాచ్‌లోనే సంజూ అద్భుతంగా రాణించాడు. ఇది ICC ర్యాంకింగ్స్‌లో ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూర్చింది. ఇప్పుడు 25 స్థానాలు ఎగబాకి 40వ స్థానానికి చేరుకున్నాడు. అతనితో పాటు, ఇషాన్ కిషన్ కూడా ఒక స్థానం మెరుగుపడి ఇప్పుడు 4వ స్థానంలో ఉన్నాడు. అభిషేక్ శర్మ నంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read:Telangana Govt Key Decision: మార్చి 8న అసెంబ్లీలో భారీ మార్పులు..!
ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయిస్తున్నారు. టాప్ 10 జాబితాలో నలుగురు భారత బ్యాట్స్మెన్లు ఉన్నారు. అభిషేక్ శర్మ 874 రేటింగ్‌తో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఇషాన్ కిషన్ 783 రేటింగ్‌తో నాలుగో స్థానంలో ఉండగా, తిలక్ వర్మ 749 రేటింగ్‌తో ఆరో స్థానానికి చేరుకున్నాడు. టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 739 రేటింగ్‌తో ఏడో స్థానంలో ఉన్నాడు.





