MLA Arava Sridhar Controversy: జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన కేసులో బాధితురాలిగా పేర్కొనబడిన హర్ష వీణకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆమెకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రైల్వే కోడూరు పోలీసులు హర్ష వీణపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్ట్ అయ్యే అవకాశముందని భావించిన హర్ష వీణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఇక, హర్ష వీణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. వాదనలు విన్న తర్వాత ఆమెకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ కేసులో దర్యాప్తుకు సహకరించాలి, అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలి వంటి షరతులను కోర్టు విధించినట్లు సమాచారం. మొత్తంగా ఈ కేసులో హైకోర్టు ఆదేశాలతో హర్ష వీణకు తాత్కాలికంగా ఊరట లభించినట్లు న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. బాధితురాలు హర్ష వీణకు సంబంధించిన పలు వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం విదితమే.. శ్రీధర్ తనతో చనువుగా మాట్లాడిన వీడియోలు.. అసెంబ్లీలో ఉండి చేసిన వీడియో కాల్స్.. కారులో కలిసి ప్రయాణం.. ఇలా పలు రకాల వీడియోలు వదిలి బాధితురాలు హల్ చల్ చేసిన విషయం విదితమే..
MLA Arava Sridhar Controversy: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలికి హైకోర్టులో ఊరట
Date:





