2
March, 2026

A News 365Times Venture

2
Monday
March, 2026

A News 365Times Venture

Varanasi : అంటార్కిటికాలో ‘వారణాసి’.. ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ షాకింగ్ కామెంట్స్

Date:

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ద బ్లఫ్’  ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతోంది. ఈ సినిమా చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. “ద బ్లఫ్ ఒక అద్భుతమైన చిత్రం.. యాక్షన్ మరియు ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రియాంక చోప్రా తన నటనతో మరోసారి మెప్పించారు” అంటూ మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా కొనియాడారు.

Also Read : TVK VIJAY : విజయ్ కు మరో షాక్.. మొన్న భార్య.. నేడు కొడుకు

మహేశ్ బాబు చేసిన ఈ పోస్ట్‌కు ప్రియాంక చోప్రా స్పందిస్తూ ఇచ్చిన రిప్లై ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. “థాంక్యూ మహేశ్.. సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా!” అంటూ ఆమె బదులిచ్చారు. వీరిద్దరూ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రియాంక ఇచ్చిన హింట్‌తో, ఈ సినిమా తదుపరి భారీ షెడ్యూల్ అంటార్కిటికా ఖండంలో ఉండబోతోందని స్పష్టమవుతోంది. రాజమౌళి రూపొందిస్తున్న ఈ చిత్రం గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్‌గా ఉండబోతోంది. ఇప్పటికే ఆఫ్రికాలోని నైలు నది పరిసరాల్లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఇప్పుడు కథ డిమాండ్ మేరకు టీమ్ అంటార్కిటికా మంచు ఖండానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మహేష్ బాబు రుద్ర పాత్రలో కనిపిస్తుండగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే పాత్రలో నటిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించబోతున్న ఈ సినిమా, ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Manjummel Boys : సూపర్ హిట్ డైరెక్టర్’పై లైంగిక వేధింపుల కేసు

సూపర్ హిట్ మంజుమ్మల్ బాయ్స్ దర్శకుడు చిదంబరంపై లైంగిక వేధింపుల కేసు...

പശ്ചിമേഷ്യയിലെ യുദ്ധഭീതി; ഇറാനെതിരായ പ്രകോപനങ്ങള്‍ ഉണ്ടാവരുത്: ഗള്‍ഫ് സഖ്യകക്ഷികളോട് സൗദി

റിയാദ്: ഇറാനെതിരായ ഇസ്രഈല്‍-അമേരിക്ക വ്യോമാക്രമണത്തില്‍ പ്രതികരണവുമായി സൗദി അറേബ്യ. മേഖലയിലെ യുദ്ധഭീതി...

Iran: "இன்னும் உயிரிழப்புகள் இருக்கும்" – ஈரான் மீதான போர் குறித்த கேள்விக்கு ட்ரம்ப் பதில்

கடந்த சனிக்கிழமை (பிப்ரவரி 28) முதல் ஈரான் மீதான அமெரிக்கா, இஸ்ரேல்...

യുദ്ധത്തില്‍ രണ്ടുകൂട്ടരും തോല്‍ക്കാം; മനുഷ്യര്‍ ജയിക്കണമെന്നാണ് എന്റെ ആഗ്രഹം: മമ്മൂട്ടി

കൊച്ചി: ഇറാന്‍- ഇസ്രഈല്‍ സംഘര്‍ഷത്തില്‍ പ്രതികരിച്ച് നടന്‍ മമ്മൂട്ടി. ടി.വി ചന്ദ്രന്റെ...