2
March, 2026

A News 365Times Venture

2
Monday
March, 2026

A News 365Times Venture

India vs West Indies: బుమ్రా దెబ్బకు హెట్‌మైర్ అబ్బా.. బ్యాట్స్‌మెన్‌కు తెలియకుండానే ఔట్!(వీడియో)

Date:

India vs West Indies: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. 196 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించారు. మొదటి ఐదు ఓవర్లలో భారత్ రెండు అవకాశాలు వదులుకోవడంతో కరీబియన్ బ్యాటర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుంది. 11.3 ఓవర్ల వద్ద వెస్టిండీస్ స్కోరు 102కి 2 వికెట్లు కోల్పోయింది. జస్ప్రీత్ బుమ్రా వేసిన బాల్‌ను హెట్‌మైర్ తన స్టైల్‌లో బలంగా స్వింగ్ చేశాడు. ఆ బంతి టైమింగ్ కాకపోవడంతో కీపర్ సంజూ చేతికి చిక్కింది. వెంటనే అంపైర్ క్రిస్ గాఫనీ వికెట్ కీపర్‌కు క్యాచ్‌గా ఔట్ ఇచ్చాడు. హెట్‌మైర్ క్షణికావేశంలో థర్డ్ ఎంపైర్‌కు వెళ్లాడు. నమ్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. చెక్ చేయగా.. అది ఔట్‌గా తేలింది. దీంతో వెస్టిండీస్ ఒక థర్డ్ ఎంపైర్ రివ్వ్యూ కోల్పోయింది. హెట్‌మైర్ 12 బంతుల్లో 27 పరుగులు చేసి పెవిలియన్‌కు చేశాడు. వాస్తవానికి.. ఈ ఔట్ బ్యాట్స్‌మెన్‌కు సైతం గందరగోళాన్ని తెచ్చిపెట్టింది. బంతి బ్యాట్‌కు తాకిన భావన నిజంగానే బ్యాటర్‌కు లేకపోవచ్చట. కానీ.. సాంకేతికత మాత్రం దాన్ని బయటపెట్టింది. షిమ్రాన్ హెట్మెయర్ అసంతృప్తితో బయటకు వెళ్లాడు. వెస్టిండీస్ కోచ్ డారెన్ సామీ సైతం అసంతృప్తిగా కనిపించాడు. ఈ ఇద్దరూ ఎంత అసంతృప్తి చెందినా.. థర్డ్ ఎంపైర్ నుంచి మాత్రం తప్పుడు ఫలితం రాదు.. కాబట్టి ఇది పక్కా ఔట్. ఈ ఔట్‌లో ఎలాంటి గందరగోళం అవసరం లేదు. ఈ ఔట్‌తో బ్యాటర్ హెట్మెయర్‌కు తెలియకుండానే అతడిని బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. ఇక్కడ బుమ్రా బ్యూటీ బయటపడింది.

READ MORE: India Oil Reserves: గల్ఫ్ నుంచి చమురు రాకుంటే, భారత్ వద్ద ఎన్ని రోజులకు సరిపడే నిల్వలు ఉన్నాయి.?


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പശ്ചിമേഷ്യയിലെ യുദ്ധഭീതി; ഇറാനെതിരായ പ്രകോപനങ്ങള്‍ ഉണ്ടാവരുത്: ഗള്‍ഫ് സഖ്യകക്ഷികളോട് സൗദി

റിയാദ്: ഇറാനെതിരായ ഇസ്രഈല്‍-അമേരിക്ക വ്യോമാക്രമണത്തില്‍ പ്രതികരണവുമായി സൗദി അറേബ്യ. മേഖലയിലെ യുദ്ധഭീതി...

Iran: "இன்னும் உயிரிழப்புகள் இருக்கும்" – ஈரான் மீதான போர் குறித்த கேள்விக்கு ட்ரம்ப் பதில்

கடந்த சனிக்கிழமை (பிப்ரவரி 28) முதல் ஈரான் மீதான அமெரிக்கா, இஸ்ரேல்...

Varanasi : అంటార్కిటికాలో ‘వారణాసి’.. ప్రియాంక చోప్రా నటనపై మహేశ్ షాకింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటించిన తాజా హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్...

യുദ്ധത്തില്‍ രണ്ടുകൂട്ടരും തോല്‍ക്കാം; മനുഷ്യര്‍ ജയിക്കണമെന്നാണ് എന്റെ ആഗ്രഹം: മമ്മൂട്ടി

കൊച്ചി: ഇറാന്‍- ഇസ്രഈല്‍ സംഘര്‍ഷത്തില്‍ പ്രതികരിച്ച് നടന്‍ മമ്മൂട്ടി. ടി.വി ചന്ദ്രന്റെ...