22
February, 2026

A News 365Times Venture

22
Sunday
February, 2026

A News 365Times Venture

Maa Inti Bangaram: థియేటర్లలో సమంత రచ్చ అప్పుడే! ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Date:

Maa Inti Bangaram: ఒకప్పుడు వరుస సినిమాలతో దుమ్మురేపిన స్టార్ హీరోయిన్ సమంత వెండి తెరపై కనిపించి చాలా కాలమే అయ్యింది. లాస్ట్‌గా ఆమె విజయ్ దేవరకొండ హీరోగా, శివనిర్వాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఖుషి సినిమాలో హీరోయిన్‌గా కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆమె నుంచి చాలా కాలానికి వస్తున్న లేటేస్ట్ మూవీ “మా ఇంటి బంగారం”. ఈ సినిమా అనౌన్సమెంట్ నుంచే ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను క్రియేట్ చేయగలిగింది. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు అఫీషియల్‌గా వచ్చేసింది. ఈ సినిమాకు సమంత భర్త రాజ్ నిడుమోరు కథ అందించగా, మహిళా దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. త్రలాల మూవింగ్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

READ ALSO: TVK Chief Vijay: “టీవీకే మాస్టర్ ప్లాన్”.. విజయ్ పోటీ చేసేది అక్కడే.. క్లారిటీ ఇచ్చిన పార్టీ

తాజాగా ఈచిత్రం రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్‌ చేశారు. సమంత ఉన్న ఒక పోస్టర్‌పై ఈ ఏడాది మే 15న గ్రాండ్ గా రిలీజ్ మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. గతంలో రిలీజ్ అయిన ఈ చిత్ర టీజర్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్ ట్రైలర్‌‌ను గమనిస్తే కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదాన్ని మేళవించిన కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాగా అర్థం అవుతుంది. అలాగే ఇందులో మాస్ యాక్షన్ అంశాలు కూడా గట్టిగానే దట్టించినట్లు కనిపిస్తుంది. గతంలో రిలీజ్ అయిన ఈ టీజర్‌లో సమంత చేసిన ఫైట్స్ ప్రేక్షకులను ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయే తెలిసిందే. ఇందులో యాంకర్ శ్రీముఖి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. టీజర్‌తోనే దుమ్ములేపిన సామ్.. ఫుల్ ఫ్లెడ్జ్ సినిమాతో ఏ రేంజ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుందో వెండి తెరపై చూడాల్సిందే.

READ ALSO: Tamil Nadu: తమిళనాడులో ఉగ్ర కలకలం.. పాక్‌ కోసం బంగ్లాదేశీయుల గూఢచర్యం..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಚಂದ್ರ ಲೋಕಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟರೂ, ಕಾಲ ಬುಡದಲ್ಲೇ ಮರ್ಯಾದಾ ಹತ್ಯೆ ಬೇಸರದ ಸಂಗತಿ- ಕೆ.ವಿ.ಪ್ರಭಾಕರ್

ಕೋಲಾರ ಫೆಬ್ರವರಿ, 21,2026 (www.justkannada.in):  ಚಂದ್ರ ಲೋಕಕ್ಕೆ ಕಾಲಿಟ್ಟರೂ, ಕಾಲ...

സനാതന ധര്‍മത്തെ വ്രണപ്പെടുത്തിയാല്‍ വീട്ടില്‍ കയറി ആക്രമിക്കും; സിനിമാപ്രവര്‍ത്തകരെ ഭീഷണിപ്പെടുത്തി കര്‍ണിസേന

മുംബൈ: സനാതന ധര്‍മത്തെയും ഹിന്ദുമതത്തിലെ ജാതികളെയും വ്രണപ്പെടുത്തിയാല്‍ ഒരു പാഠം പഠിപ്പിക്കുമെന്ന്...

மதுரை: `நாம தான் ஜெயிக்கிறோம், எப்பவுமே நாம மட்டும்தான் ஜெயிக்கிறோம்'- மு.க.ஸ்டாலின் பேச்சு

fமதுரை உத்தங்குடியில் தென் மண்டல வாக்குச்சாவடி பயிற்சி கூட்டம் நேற்று நடைபெற்றது....

Breaking News: ట్రంప్ ఇంట్లోకి అగంతకుడి ఎంట్రీ.. కాల్చి చంపిన సెక్యూరిటీ..

Breaking News: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో...