22
February, 2026

A News 365Times Venture

22
Sunday
February, 2026

A News 365Times Venture

Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి, ఎముకల బలానికి బెస్ట్ ఛాయిస్ హెల్తీ ‘రాగి స్మూతీ’!

Date:

Ragi Smoothie Recipe: బరువు తగ్గడానికి ఏవేవో డైట్ ప్లాన్ చేస్తుంటారు చాలామంది. అలంటి వారి కోసం ‘రాగి’ పిండితో చేసే వంటకాలు ఎంతో సహకారం అందిస్తాయి. ఇందులో భాగంగా ‘రాగి జావ’ ను తాగమని చాలామంది చెబుతుంటారు. కానీ కొందరికి అది అంటే నచ్చకపోవచ్చు, కానీ అచ్చం అలాగే ఉండే స్మూతీలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రత్యామ్నాయంగా కూడా పనిచేస్తుంది. మరి దీనిని ఎలా చేసేయాలి చూసేద్దామా..

కావలసిన పదార్థాలు:
* రాగి పిండి: ఒకటిన్నర టేబుల్ స్పూన్
* నీళ్లు: ఒక కప్పు
* దాల్చిన చెక్క: చిన్న ముక్క
* బాదం పప్పులు: 10 (నానబెట్టినవి)
* అరటిపండు లేదా ఆపిల్: ఒకటి
* అవిసె గింజలు (Flax Seeds): ఒక టేబుల్ స్పూన్

Love Marriage: ఆయనకేమో 60, ఆమెకు 28.. కట్ చేస్తే?

తయారీ విధానం:
మొదట ఒకటిన్నర టేబుల్ స్పూన్ల రాగి పిండిలో కొద్దిగా నీళ్లు పోసి, ఉండలు లేకుండా పలుచగా కలిపి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కప్పు నీళ్లు పోసి మరిగించండి. ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు కలిపి పెట్టుకున్న రాగి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలపండి. ఇందులోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను వేయండి. ఇది స్మూతీకి మంచి రుచిని, వాసనను ఇస్తుంది. ఇలా వేసిన ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. ఆ తర్వాత దాల్చిన చెక్కను తీసేసి ఆ రాగి జావను పూర్తిగా చల్లారనివ్వండి.

ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో పొట్టు తీసిన 10 నానబెట్టిన బాదం పప్పులు, ముక్కలు చేసిన అరటిపండు లేదా ఆపిల్, ఒక స్పూన్ అవిసె గింజలు వేయండి. అలాగే అందులోకి చల్లారిన రాగి జావను కూడా జార్‌లో వేసి మెత్తగా స్మూతీలా మిక్సీ పట్టుకోండి. అంతే ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులోకి తీసుకుని, పైన మరికొన్ని బాదం ముక్కలతో గార్నిష్ చేసుకుంటే రుచికరమైన రాగి స్మూతీ రెడీ.

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడిగంటలు.. మీనా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

రాగి స్మూతీ ప్రయోజనాలు:
ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నిండుగా అనిపించి ఆకలిని తగ్గిస్తుంది. రాగిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. బాదం, అవిసె గింజలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ತಪ್ಪು ಮಾಡಿದವರ ವಿರುದ್ದ ಕ್ರಮ ನಿಶ್ಚಿತ- ಸಚಿವ ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,21,2026 (www.justkannada.in): ಬಾಗಲಕೋಟೆಯಲ್ಲಿ ಶಿವಾಜಿ ಮೆರವಣಿಗೆ ಮೇಲೆ ಕಲ್ಲು ತೂರಾಟ...

ആര്‍.എസ്.എസിന്റെ പണി എളുപ്പമാക്കുക എന്നതാണ് ഇപ്പോള്‍ ലീഗിന്റെ പണി; അതിക്രമങ്ങളെ പ്രതിരോധിക്കാന്‍ ലീഗ് എന്ത് ചെയ്തുവെന്ന് എസ്.എഫ്.ഐ

തിരുവനന്തപുരം: സംഘപരിവാറിന്റെ പ്രൊപ്പഗണ്ട സിനിമ കേരള സ്റ്റോറി 2വിനെ പ്രതിരോധിക്കാനായി എസ്.എഫ്.ഐ...

"குருவாயூரப்பனை சேவித்துக்கொண்டே நான் இறக்க வேண்டும்" – சுரேஷ் கோபி

கேரள மாநிலம் கொச்சியில் ஓர் ஆங்கில பத்திரிகையின் (தி நியூ இந்தியன்...

Maa Inti Bangaram: థియేటర్లలో సమంత రచ్చ అప్పుడే! ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ వచ్చేసింది..

Maa Inti Bangaram: ఒకప్పుడు వరుస సినిమాలతో దుమ్మురేపిన స్టార్ హీరోయిన్...