20
February, 2026

A News 365Times Venture

20
Friday
February, 2026

A News 365Times Venture

Imran Khan: “రెండు ఛాన్స్‌లు ఇచ్చాం.. కానీ”.. పాక్ మాజీ ప్రధాని విడుదలపై బాంబు పేల్చిన ప్రభుత్వం..

Date:

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని జైలు జీవితం గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన ఆరోగ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్ సన్నిహితుడైన రాణా కొత్త విషయాన్ని వెల్లడించారు. ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం రెండు సార్లు “సీరియస్ డీల్” ప్రయత్నాలు జరిగాయని రాణా సనౌల్లా వెల్లడించడంతో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. రాణా సనౌల్లా వివరాల ప్రకారం.. 2024 నవంబర్ 26కు ముందు జైల్లో ఉన్న మాజీ ప్రధానితో చర్చలు జరిపారు. అప్పటి ఇంటీరియర్ మంత్రి మొహ్సిన్ నఖ్వీ, ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ముఖ్యమంత్రి అలి అమిన్ గండాపూర్ ఇమ్రాన్‌ను కలిసి ఈ చర్చలు జరిపారని తెలిపారు. తరువాత విదేశాల్లో ఉన్న కొంత మంది వ్యక్తులు మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ డీల్‌కు మొదట ఇమ్రాన్ ఖాన్ అంగీకరించినా.. చివరికి వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను ఎలాగైనా పరిష్కరించాలనే దృక్పతంతో ప్రభుత్వం ఉందని.. కానీ ఇమ్రాన్ ఖాన్ మాత్రం ప్రస్తుత ప్రభుత్వాన్ని దింపేసి తానే అధికారంలోకి రావాలనే సంకల్పంతో ఉన్నారని సనౌల్లా వెల్లడించారు.

READ MORE: AI Summit: కాంగ్రెస్ కార్యకర్తలను చితక్కొట్టిన ప్రజలు.. వీడియో వైరల్..

అయితే ఈ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి అత్తౌల్లా తరార్ తీవ్రంగా ఖండించారు. ఇమ్రాన్ ఖాన్‌కు ఎలాంటి సడలింపులు ఇవ్వడం లేదని.. ఏ డీల్ జరగలేదని స్పష్టం చేశారు. ఆయన ఇప్పటికే శిక్ష పడిన నేరస్థుడని పేర్కొన్నారు. ఇక మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయారని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దీంతో ఇస్లామాబాద్‌లోని షిఫా ఆస్పత్రిలో కంటి చికిత్సకు అవకాశం కల్పించినట్టు సమాచారం. మరోవైపు.. ఇమ్రాన్ సోదరి నూరీన్ ఖాన్ మాత్రం జైలులో తన భయ్యాను తీవ్రంగా హింసిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితికి అసీం మునీర్ నాయకత్వంలోని వ్యవస్థే కారణమని విమర్శించారు. దేశంలో న్యాయబద్ధమైన పాలన లేదని ఆమె వ్యాఖ్యానించారు.

READ MORE: Iftar Recipes: రంజాన్ స్పెషల్.. ఈసారి ఇఫ్తార్ లో ఈ వంటకాలను ట్రై చేయండి.!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಉಚಿತ ಭಾಗ್ಯಗಳ ಬಗ್ಗೆ ಸುಪ್ರೀಂ ಟೀಕೆ: ಸರ್ಕಾರಕ್ಕೆ ಕುಟುಕಿದ ಶಾಸಕ ಅಶ್ವಥ್ ನಾರಾಯಣ್

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,20,2026 (www.justkannada.in): ಇತ್ತೀಚೆಗೆ ಪ್ರಕರಣವೊಂದರ ವಿಚಾರಣೆ ವೇಳೆ ರಾಜಕೀಯ ಪಕ್ಷಗಳು...

മലപ്പുറത്തെ ലോറിയപകടം; മണിക്കൂറുകളുടെ ശ്രമം പരാജയപ്പെട്ടു, മുസ്തഫ മരിച്ചു

മലപ്പുറം: ആതവനാട്ടെ 65 അടി താഴ്ചയുള്ള ക്വാറിയിലെ വെള്ളക്കെട്ടിലേക്ക് മറിഞ്ഞ മിനിലോറിയിലെ ക്ലീനർ...

AI மாநாடு: சட்டையை கழற்றிப் போராட்டம் நடத்திய காங்கிரஸ் அணி; கண்டனம் தெரிவிக்கும் பாஜக!

இந்தியாவின் தொழில்நுட்ப வளர்ச்சியைப் பறைசாற்றும் வகையில் டெல்லியில் 'இந்திய AI உச்சிமாநாடு...

Minister Nara Lokesh: మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ

Minister Nara Lokesh: ప్రజా రాజధాని అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్...