20
February, 2026

A News 365Times Venture

20
Friday
February, 2026

A News 365Times Venture

Oil Imports: భారత్-అమెరికా ఆయిల్ ఘర్షణలో గెలిచిన సౌదీ అరేబియా..

Date:

Oil Imports: భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుందనే కోపంతో గతంలో అమెరికా భారత్‌పై 25 శాతం అదనపు సుంకంతో పాటు మొత్తం 50 శాతం టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం తర్వాత పరస్పర సుంకాలను 18 శాతానికి తగ్గించింది. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేస్తానని హామీ ఇచ్చిందని అమెరికా చెబుతోంది. మరోవైపు, భారత్ తమ నుంచి చమురు కొనుగోలును ఎక్కడా ఆపేస్తామని చెప్పలేదని రష్యా చెబుతోంది.

ఇదిలా ఉంటే, భారత్ చెప్పకున్నా గతంలో పోలిస్తే రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు గణనీయంగా తగ్గిపోయాయి. 2022 తర్వాత భారత్ రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ముడి చమురు దిగుమతులు అత్యల్ప స్థాయికి పడిపోయినట్లు రాయిటర్స్ నివేదించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. దీని తర్వాత భారత్, చైనాతో సహా మిత్రదేశాలకు డిస్కౌంట్లపై రష్యా చమురును ఎగుమతి చేసింది. భారత రిఫైనరీలు పెద్ద ఎత్తున రష్యన్ చమురును కొనుగోలు చేశాయి.

Read Also: Naa Anveshana Shock: యూట్యూబర్ అన్వేష్ ఇన్‌స్టా అకౌంట్ బ్యాన్.. 1.3 మిలియన్ ఫాలోవర్స్ పోయారు..

2022 తర్వాత ఒక్కసారిగా భారత చమురు దిగుమతులు రష్యా నుంచి భారీగా పెరిగాయి. అయితే, ఇది ఇప్పుడు 21 శాతానికి పడిపోయింది. ఈ ఏడాది జనవరి నెలలో రష్యా నుంచి చమురు కొనుగోలు రోజుకు 11 లక్షల బ్యారెళ్లు మాత్రమే. గతేడాదితో పోలిస్తే ఇది మూడో వంతు తగ్గుదల. ఫిబ్రవరి మార్చి నెలల్లో 10-12 లక్షల బ్యారెళ్ల నుంచి 8 లక్షల బ్యారెళ్లకు పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి భారత్ చమురు కొనుగోళ్లను పెంచింది. ఇప్పుడు, సౌదీ అరేబియా భారతదేశానికి అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా మారింది. మిడిల్ ఈస్ట్ నుంచి 2022 జనవరి తర్వాత అత్యధిక చమురును భారత్ కొనుగోలు చేసింది. ఫిబ్రవరి నెలలో సౌదీ ననుంచి రికార్డ్ స్థాయిలో చమురు వచ్చినట్లు అంచనా. ఇప్పుడు భారత్ తన చమురు దిగుమతుల్లో 55 శాతం మిడిల్ ఈస్ట్ నుంచి, 10 శాతం లాటిన్ అమెరికా దేశాల నుంచి వస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಸಾರಿಗೆ ನೌಕರರ ಮುಷ್ಕರ ತಾತ್ಕಾಲಿಕ ವಾಪಸ್, ಮಾ.2ಕ್ಕೆ ಡೆಡ್ ಲೈನ್: ಮುಖಂಡರ ನಡೆಗೆ ಆಕ್ರೋಶ

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,19,2026 (www.justkannada.in): ವೇತನ ಹಿಂಬಾಕಿ ಮತ್ತು ವೇತನ ಪರಿಷ್ಕರಣೆಗೆ ಆಗ್ರಹಿಸಿ...

ആലപ്പുഴയില്‍ വീട്ടമ്മയുടെ വയറ്റില്‍ കത്രിക കുടുങ്ങിയതായി പരാതി; ആരോപണം വണ്ടാനം മെഡിക്കല്‍ കോളേജിനെതിരെ

ആലപ്പുഴ: പുന്നപ്രയില്‍ വീട്ടമ്മയുടെ വയറ്റില്‍ ശസ്ത്രക്രിയക്കിടെ കത്രിക കുടുങ്ങിയതായി പരാതി. 2021ല്‍...

Jowar Idli Recipe: వెయిట్ లాస్ కోసం హెల్తీ, టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్ జొన్న ఇడ్లీలు..

Jowar Idli Recipe: ప్రస్తుతం వయసుకు సంబంధం లేకుండా బరువు పెరుగుతున్నారు....