Epstein Files: ఎప్‌స్టీన్ ఫైల్స్ అమెరికాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క అమెరికానే కాకుండా యావత్ ప్రపంచంలో ఈ ఫైల్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. తాజాగా విడుదలైన ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రఖ్యాత నోబెల్ బహుమతి అందుకున్న శాస్త్రవేత్త ఉండటం సంచలనంగా మారింది. ఎప్‌స్టీన్ భవనంలో అమెరికా సైంటిస్ట్ జేమ్స్ వాట్సన్ ముగ్గురు అమ్మాయిలతో కలిసి ఉన్న ఫోటోను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. లైంగిక నేరస్తుడిగా ఆరోపణలు ఎదుర్కొని, జైలులోనే ఆత్మహత్యకు పాల్పడిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఉదంతంలో అనేక మంది రాజకీయ నాయకులు, అమెరికా ఎలైట్ వర్గానికి చెందిన ప్రముఖులు ఉన్నారు. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ వంటి వారి పేర్లు ఉన్నాయి.
Read Also: Mohsin Naqvi: “మేము భారత్‌తో ఆడటానికి కారణం ఆయనే”.. పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు..
తాజాగా విడుదలైన ఫైల్స్‌లో జేమ్స్ వాట్సన్ ఉండటం మరో సంచలనం. ఆయన సాధారణ శాస్త్రవేత్త కాదు, వైద్యశాస్త్రంలోనే అద్భుతమైన పరిశోధన చేశారు. 1953లో ఫ్రాన్సిస్ క్రిక్‌తో కలిసి DNA డబుల్ హెలిక్స్ నిర్మాణంను కనుగొన్నారు.ఈ ఆవిష్కరణ జన్యుశాస్త్రంలోనే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ఈ ఆవిష్కరణకు గానూ 1962లో ఆయనకు నోబెల్ మెడిసిన్ పురస్కారం లభించింది. జేమ్స్ వాట్సన్ 2025లో 97 ఏళ్ల వయసులో మరణించారు.
తాజాగా అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఫోటోల్లో వాట్సన్ ఎప్‌స్ట్రీన్ భవనంలో ఉన్నారు. ఆయనతో పాటు ముగ్గురు యువతులు ఉన్నారు. వీరి ముఖాలను బ్లర్ చేశారు. అయితే, ఈ ఫోటో ఎప్పుడు తీశారనే దానిపై స్పష్టత లేదు. దీనిని 2010లలో తీయవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో ఎప్‌స్టీన్ మైనర్ బాలికపై వేధింపుల కేసులో జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. ఎప్‌స్టీన్‌కు జన్యుశాస్త్రంలో మంచి ఆసక్తి ఉండేదని, ఇదే వాట్సన్‌ను కలిసేలా చేసిందనే వార్తలు ఉన్నాయి.





