12
February, 2026

A News 365Times Venture

12
Thursday
February, 2026

A News 365Times Venture

Seetha Payanam: బ్రహ్మానందం చేతుల మీదుగా ‘సీతా పయనం’ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైలైట్స్ ఇవే!

Date:

Seetha Payanam: యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో నిరంజన్, ఐశ్వర్య అర్జున్ జంటగా తెరకెక్కించిన చిత్రం ‘సీతా పయనం’. శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ మీద అర్జున్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీతో ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా ప్రధాన పాత్రను పోషించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌కు హాస్య బ్రహ్మ, పద్మశ్రీ డా. బ్రహ్మానందం ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో రియల్ హీరోలైన పర్యావరణ వేత్త, సామాజిక వేత్త డా.ప్రకాష్ ఆమ్టే, డా.మందాకిని ఆమ్టే, ట్యాంక్ బండ్ శివ, పర్యావరణ వేత్త దుశ్చర్ల సత్యనారాయణ తదితరులని ‘సీతా పయనం’ టీం సత్కరించి ఆర్థిక సాయాన్ని అందించారు.

READ ALSO: Cambodia Cyber Scam: కేజీఎఫ్‌ను తలపించిన సైబర్‌ సామ్రాజ్యం.. వందల సంఖ్యలో ఉద్యోగులు!

ఈ సందర్భంగా పద్మశ్రీ డా.బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘మంచి మనిషి, రియల్ జెంటిల్మెన్ అర్జున్ గురించి ఈ ఈవెంట్‌కు వచ్చాను. రియల్ హీరోల్ని సత్కరిస్తున్నాను అని అర్జున్ చెప్పినప్పుడు ఎంతో సంతోషించాను. ఇలాంటి గొప్ప వారిని సత్కరించే అవకాశం అందరికీ లభించదు. ఈ చిత్రంతో ఐశ్వర్యకు మంచి పేరు రావాలి, అర్జున్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. దర్శక, నిర్మాత అర్జున్ సర్జా మాట్లాడుతూ .. ‘‘సీతా పయనం’ అనేది ఒక్కరి ప్రయాణం కాదు. నా కూతురిని ఓ మంచి కథతో, పాజిటివిటీ ఉన్న సినిమాతో పరిచయం చేయాలని అనుకున్నాను. ఇదొక డిఫరెంట్ జానర్ కథ. నా కూతురికి ఓ బహుమతిలా ఈ సినిమాని ఇవ్వాలని అనుకున్నాను. జనాలకు ఓ మంచి చిత్రాన్ని ఇవ్వాలనే బాధ్యతతో ఈ చిత్రాన్ని తీశాను. నిరంజన్ చాలా టాలెంటెడ్ పర్సన్. అభి పాత్రలో అద్బుతంగా నటించాడు. ఈ చిత్రంలో ఐశ్వర్యను చూసి అందరూ మెచ్చుకుంటారని భావిస్తున్నాను. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా మా సినిమా ఉంటుంది. ఫిబ్రవరి 14న మా మూవీని చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. కార్యక్రమంలో హీరోహీరోయిన్లు నిరంజన్, ఐశ్వర్యా అర్జున్, మూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్, సత్య రాజ్ తదితరులు పాల్గొన్నారు.

READ ALSO: Ustaad Bhagat Singh Update: నల్ల నాగప్పగా పార్తిబన్.. ఉస్తాద్ భగత్ సింగ్ విలన్‌ను చూశారా!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಲೈಂಗಿಕ ದೌರ್ಜನ್ಯ ಕೇಸ್: ಸಾಧುಕೋಕಿಲ, ಮಂಡ್ಯ ರಮೇಶ್ ವಿರುದ್ದದ ಪ್ರಕರಣ ರದ್ದು

ಬೆಂಗಳೂರು,ಫೆಬ್ರವರಿ,11,2026 (www.justkannada.in):  ಹಾಸ್ಯನಟರಾದ ಸಾಧುಕೋಕಿಲ ಮತ್ತು ಮಂಡ್ಯ ರಮೇಶ್ ವಿರುದ್ದ...

യു.എസിന്റെ അമിത ആവശ്യങ്ങള്‍ക്ക് ഇറാന്‍ വഴങ്ങില്ല: പെസസ്‌കിയാന്‍

ടെഹ്‌റാന്‍: സമാധാന ചര്‍ച്ചകള്‍ പുനരാരംഭിച്ചെങ്കിലും യു.എസിന്റെ അമിത ആവശ്യങ്ങള്‍ക്ക് കീഴടങ്ങില്ലെന്ന് ഇറാന്‍....

`ராஜா என்னுடைய பிள்ளை; யாரோ ஒரு தாய், தவறான கணிப்பிலே.!' – சர்ச்சை சம்பவம் குறித்து சாலமன் பாப்பையா

அமெரிக்காவில் நடைபெற்ற தமிழ்ச் சங்கம் நிகழ்ச்சியில், பிரபல பட்டிமன்றப் பேச்சாளர் ராஜா...

Off The Record: ఎస్.కోట టీడీపీలో మూడు గ్రూపుల మంట..

Off The Record: విజయనగరం జిల్లా శృంగవరపుకోట టీడీపీలో ప్రస్తుతం మూడు...