24
February, 2026

A News 365Times Venture

24
Tuesday
February, 2026

A News 365Times Venture

CM Revanth: మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే ‘రైతు భరోసా’.!

Date:

CM Revanth: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు కాంగ్రెస్‌కే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

Mohan Babu University Kidnap Case: ఆధారాలు దోరికాయి‌.. మంచు మోహన్ బాబు, విష్ణు లకు నోటీసులు ఇస్తాం!

గత ప్రభుత్వం సంక్షేమ పథకాలను మార్చి, అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని సీఎం విమర్శించారు. సన్నబియ్యం పొందుతున్న లబ్ధిదారులంతా కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. ముఖ్యముగా “మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతు భరోసా అందిస్తామని” సీఎం హామీ ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు పథకం నిజంగా వరంగా మారిందని, ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న మహిళలు కాంగ్రెస్‌కు ఓటేస్తే.. BRS అడ్రస్ గల్లంతు అవుతుంది అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఇతర నాయకులకు కూడా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుందని, సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి వివక్ష లేదని స్పష్టం చేశారు.

10 ఏళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్‌కు పేదవాళ్లకు ఇళ్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదని సీఎం విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం డిమాండ్ ఉందని, రాబోయే బడ్జెట్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడతామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతో SLBC ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. SLBC ప్రమాదంలో 8 మంది మృతి చెందితే మామ–అల్లుళ్లు సంబరాలు చేసుకున్నారని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. గంజి గతి లేని నాయకులు బెంజ్ కార్లు కొనుగోలు చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో మిగితా నేతలు డబ్బులు ఇస్తే తీసుకోండి, కానీ ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని పిలుపునిచ్చారు.

Egg Veg or Non-Veg: మిలియన్ డాలర్స్ క్వశ్చన్.. “కోడిగుడ్డు వెజ్ ఆర్ నాన్ వెజ్”?

గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందని సీఎం ఆరోపిస్తూ.. “జాతిపిత ఎవరు?” అన్న ప్రశ్నకు సమాధానంగా, తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌నే జాతిపిత అని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అని స్పష్టం చేశారు. రెండేళ్లలో జరిగిన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం పిలుపునిచ్చారు. మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తూ, “కాంగ్రెస్ గెలిస్తే పేదవారు గెలుస్తారు” అని సీఎం అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಖಾಲಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಆಗ್ರಹಿಸಿ ಬೀದಿಗಿಳಿದ ಉದ್ಯೋಗಾಕಾಂಕ್ಷಿಗಳು: ಸಚಿವರ ಭಾವಚಿತ್ರ ಸುಟ್ಟಿ ಆಕ್ರೋಶ

ಧಾರವಾಡ,ಫೆಬ್ರವರಿ,24,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದಲ್ಲಿ ಸರ್ಕಾರಿ ಹುದ್ದೆಗಳ ಭರ್ತಿಗೆ ಮುಂದಾಗದೆ ವಿಳಂಬ...

ആഭ്യന്തര നിയമം പോലും എതിര്‍ക്കുന്നു; ഏകപക്ഷീയമായ തീരുവകള്‍ യു.എസ് റദ്ദാക്കണം: ചൈന

ബീജിങ്: യു.എസ് കോടതിയുടെ നിര്‍ണായക വിധിയുടെ പശ്ചാത്തലത്തില്‍ യു.എസ് ഏര്‍പ്പെടുത്തിയിരിക്കുന്ന ഏകപക്ഷീയമായ...

`விதிமுறைகளை மீறிய தவெக-வினர்; குற்றச்சாட்டு உண்மைக்குப் புறம்பானது!’ – வேலூர் மாவட்டக் காவல்துறை

வேலூர் அகரம்சேரியில், த.வெ.க நிர்வாகிகள் சந்திப்புக் கூட்டம் நேற்று நடைபெற்றது. த.வெ.க...

Mahesh Babu : జార్జియాకు సూపర్ స్టార్.. మహేశ్ బాబుకు సెండాఫ్ ఇచ్చిన నమ్రత, సితార.. వీడియో వైరల్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు తన భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’...