18
March, 2026

A News 365Times Venture

18
Wednesday
March, 2026

A News 365Times Venture

జస్ట్ రూ.15 వేలకే.. 6.75 ఇంచుల HD+ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీతో ఫిబ్రవరి 10న OPPO K14x 5G లాంచ్

Date:

OPPO K14x 5G: OPPO K-సిరీస్‌కు సంబంధించిన ఒక టీజర్‌ను కంపెనీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా OPPO తన కొత్త K-సిరీస్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ OPPO K14x 5Gను భారత్‌లో అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 10వ తేదీన ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Read Also: Free Fire MAX ప్లేయర్లకు గుడ్ న్యూస్.. కొత్త రిడీమ్ కోడ్స్ యాక్టివ్, ఫ్రీగా గన్ స్కిన్స్, కాస్ట్యూమ్స్

పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్:
OPPO K14x 5Gలో 6500mAh భారీ బ్యాటరీ అందించనున్నట్లు తెలిపింది. ఇది గత మోడల్ OPPO K13xలో ఉన్న 6000mAh బ్యాటరీతో పోలిస్తే మరింత మెరుగుదలగా చెప్పుకోవచ్చు.. అలాగే, ఫోన్‌లో 45W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో కొనసాగుతుందని OPPO ధృవీకరించింది.

కెమెరా:
ఈ ఫోన్‌లో 50MP మెయిన్ కెమెరాను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలాగే, OPPO ఈ డివైస్‌కు 48 నెలల ఫ్లూయెన్సీ ప్రొటెక్షన్ ఉంటుందని హామీ ఇచ్చింది. అంటే దీర్ఘకాలం పాటు స్మూత్ పెర్ఫార్మెన్స్ అందించేలా ఆప్టిమైజ్ చేశామని ఒప్పో చెబుతోంది. దీంతో పాటు MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ను ఉపయోగించనున్నట్లు సమాచారం. ఇదే చిప్‌సెట్ గతంలో OPPO K3xలో కూడా ఉపయోగించారు.

Read Also: Tejashwi Yadav: వీల్‌చైర్‌లో అసెంబ్లీకి వచ్చిన తేజస్వి యాదవ్.. ఏమైందంటే..!

డిస్‌ప్లే:
OPPO K14x 5Gలో 6.75 ఇంచుల HD+ డిస్‌ప్లే ఉండే అవకాశం ఉంది. ఈ స్క్రీన్ 1125 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్ అందించగలదని ఒప్పో కంపెనీ అంచనా వేస్తుంది. ఇక, గత మోడల్ K13xలో ఉన్న IP రేటింగ్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ వంటి ఫీచర్ల గురించి ఈసారి OPPO ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఇవే K13x హైలైట్స్ కావడంతో, ఈ ఫీచర్లు K14xలో ఉంటాయా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ధర:
OPPO K14x 5Gను బ్లూ, వైలెట్ రంగుల్లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇక, ధర విషయానికి వస్తే, ఈ ఫోన్ రూ.15,000 పరిధిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ తర్వాత Flipkart, OPPO India అధికారిక ఆన్‌లైన్ స్టోర్ తో పాటు ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్లలో కూడా కొనుగోలు చేయవచ్చు అని తెలిపింది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Off The Record: కూటమిలో ఉన్న నమ్మకం లేదా..? రాజమండ్రిలో బీజేపీ మాస్టర్ ప్లాన్..!

Off The Record: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఓవైపు ఏపీ...

ಕೈಗಾರಿಕೆಗಳು ಹೊರ ಹೋಗುತ್ತಿರುವುದು ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳ ಕೊರತೆಯಿಂದಲ್ಲ-ಸಚಿವ ಭೈರತಿ ಸುರೇಶ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,17,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದ ಕೈಗಾರಿಕೆಗಳು ಮೂಲಭೂತ ಸೌರ್ಕಯಗಳ ಕೊರತೆಯಿಂದ ಹೊರಹೋಗುತ್ತಿಲ್ಲ....

‘ഇറാന്‍ ഒരു ആസന്ന ഭീഷണിയല്ല, ഈ യുദ്ധം ഇസ്രായേലിന് വേണ്ടി’; രാജിവച്ച് അമേരിക്കന്‍ ഭീകരവിരുദ്ധ സമിതി മേധാവി

വാഷിങ്ടണ്‍: ഇറാനെതിരായ യു.എസ്- ഇസ്രഈല്‍ ആക്രമണത്തെ എതിര്‍ത്ത് യു.എസ് ഭീകരവിരുദ്ധ സമിതിയിലെ...

'ரஜினியை பற்றி பேசினால்…' – ஆதவ் இருந்த மேடையிலேயே கொந்தளித்த ரஜினி ரசிகர்

சென்னை கொளத்தூரில் தவெகவின் கொள்கை விளக்கப் பொதுக்கூட்டம் நடந்திருந்தது. இந்தக் கூட்டத்தில்...