5
May, 2026

A News 365Times Venture

5
Tuesday
May, 2026

A News 365Times Venture

Netflix: ఓటీటీ చరిత్రలో సరికొత్త రికార్డ్.. నెట్‌ఫ్లిక్స్ సొంతమైన ‘హైకూ’

Date:

Netflix: ప్రపంచ స్థాయి ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్.. డిఫరెంట్ కంటెంట్ సినిమాలు, సిరీస్‌లు రూపొందిస్తూ, మరోవైపు భారీ క‌థ‌లు, బడ్జెట్ ఉన్న స్టార్ హీరోల సినిమాల హక్కులను కూడా సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ లిస్టులో ఏగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘హైకూ’ సినిమా కూడా చేరినట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తికాక ముందే డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోవడం విశేషం. సాధారణంగా థియేట్రికల్ రన్ చూసిన తర్వాతే ఓటీటీ సంస్థలు డిజిటల్ హక్కుల కోసం ప్రయత్నిస్తాయి. కానీ ‘హైకూ’ సినిమా విడుదలకు ముందే డిజిటల్ డీల్ క్లియర్ కావడం పెద్ద విషయం. ఈ సినిమా షూటింగ్‌ను ఈరోజు ఉదయమే లాంఛనంగా ప్రారంభించారు మేకర్స్.

READ ALSO: Constable Sowmya : సౌమ్య కుటుంబానికి కోటి రూపాయల సాయం.! సోదరుడికి సర్కార్ ఉద్యోగం.!

త‌మిళ చిత్రం ‘హైకూ’ షూటింగ్ కేరళలోని ఇడుక్కి ప్రాంతంలో పూజా కార్యక్రమాలతో ఈరోజు ఉదయం ప్రారంభమైంది. దర్శకుడు రామ్ ముహూర్తపు సన్నివేశంపై క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ సినిమాకు యువ‌రాజ్ చిన్నసామి దర్శకత్వం వహిస్తున్నారు. విజ‌న్ సినిమా హౌస్ బ్యాన‌ర్‌పై డా.డి.అరుళ‌నందు, మాథ్యూ అరుళ‌నందు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘జో’ వంటి సూప‌ర్ హిట్ సినిమాతో గుర్తింపు పొందిన హ‌రిహ‌రన్ రామ్ ఈ చిత్రానికి అడిషనల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సినిమాలో న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే.. ‘జో’, ‘కోళి ప‌న్నై చెల్లదురై’ చిత్రాల ఫేమ్ ఏగన్ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. ఆయ‌న స‌ర‌స‌న ‘మిన్నల్ మురళి’, ‘శేషం మైకిల్ ఫాతిమా’ వంటి చిత్రాల్లో మెప్పించిన ఫెమినా జార్జ్, అలాగే ‘కోర్ట్’ ఫేమ్ శ్రీదేవి అప్పళ్ల కథానాయికలుగా నటిస్తున్నారు. షూటింగ్ స్టార్ట్ అయిన రోజే నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ హక్కులు సొంతం చేసుకోవడం చూస్తుంటే.. ఈ కంటెంట్‌పై వాళ్ల నమ్మకం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

READ ALSO: Stock Market Crash: బడ్జెట్ షాక్ కుప్పకూలిన స్టాక్ట్ మార్కెట్.. ఒక్క రోజులో రూ.8 లక్షల కోట్లు ఆవిరి!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എന്നെ ജയിപ്പിച്ചത് ഹിന്ദുക്കള്‍, അവര്‍ക്ക് വേണ്ടി പ്രവര്‍ത്തിക്കും; മുസ്‌ലിം വോട്ടുകള്‍ പൂര്‍ണമായും തൃണമൂലിന് പോയി: സുവേന്ദു അധികാരി

ഹാല്‍ദിയ: പശ്ചിമ ബംഗാള്‍ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ തൃണമൂല്‍ കോണ്‍ഗ്രസിനെ പരാജയപ്പെടുത്തി ബി.ജെ.പി...

TVK: 'சென்னைவாசி, சிபி சத்யராஜின் ஆதரவு' – சிங்காநல்லூரை வென்ற ஸ்ரீ கிரி பிரசாத்தின் பின்னணி என்ன?

சிங்காநல்லூர் தொகுதியில் மொத்தம் உள்ள 2 லட்சத்து 69 ஆயிரத்து 941...

Gold and Silver Prices: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు..

Gold and Silver Prices: బంగారం, వెండి ధరలు ఇటీవల వరుసగా...

ಶೃಂಗೇರಿಯಲ್ಲಿ ವೋಟ್ ಟ್ಯಾಂಪರಿಂಗ್: ಅಂಚೆ ಮತಗಳನ್ನ ತಿದ್ದಲಾಗಿದೆ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ಮೇ,5,2026 (www.justkannada.in):  ಶೃಂಗೇರಿಯಲ್ಲಿ ವೋಟ್ ಟ್ಯಾಂಪರಿಂಗ್ ಆಗಿದೆ. ಮರು ಮತ...