5
December, 2025

A News 365Times Venture

5
Friday
December, 2025

A News 365Times Venture

Mouth Breathing Risks: నోటితో శ్వాస తీసుకుంటే ప్రాణానికి ప్రమాదమా?

Date:

Mouth Breathing Risks: మనం రోజూ ఎన్ని లీటర్ల గాలిని శ్వాస ద్వారా పీలుస్తున్నామో ఎప్పుడైనా ఆలోచించారా?, వాస్తవానికి పుట్టినప్పటి నుంచి మనకు శ్వాస తీసుకోవడం అనేది ఎవరూ నేర్పించరు. అది సహజంగా మనకు వస్తుంది. కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే ఆ శ్వాసను మనం సరిగ్గా తీసుకుంటున్నామా లేదా అనేది!.. ఒక సాధారణ వ్యక్తి రోజుకు సుమారు 10 వేల నుంచి 12 వేల లీటర్ల గాలిను శ్వాస ద్వారా పీలుస్తారని నిపుణులు చెబుతున్నారు.

READ ALSO: Samantha : డైరెక్టర్లు బోల్డ్ పాత్రలు ఇవ్వలేదు.. సమంత షాకింగ్ కామెంట్స్

ప్రమాదం ఏమిటి?..
మనం పీల్చుకునే గాలిలో దుమ్ము, బాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మకణాలు కూడా ఉంటాయి. కానీ మన శ్వాస వ్యవస్థలోని ప్రత్యేక రక్షణ వ్యవస్థ వల్ల, వీటిలో అత్యంత సూక్ష్మమైన కణాలే ఊపిరితిత్తుల లోపలికి చేరగలవు. మన శ్వాస నాళాలలో సిలియా అనే సూపర్‌హీరోలు ఉంటాయి. ఇవి సన్నని వెంట్రుకలలా, శ్లేష్మం మీద విస్తరించి ఉంటాయి. వీటి విధి ఏమిటంటే.. చిన్న కణాలను వడపోత చేయడం. ఇవి 0.5 మిల్లీమీటర్ల కంటే తక్కువ ఉన్న సూక్ష్మజీవులను శ్వాసనాళంలోకి చేరకుండా బయటకు తీసివేస్తాయాయి.

ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటే ఈ సిలియాలు మనకు రక్షణ ఇస్తాయి. కానీ నోటు ద్వారా గాలి పీల్చినప్పుడు, ఈ రక్షణలు ఉండవు. నోరు ప్రధానంగా ఆహారంలోని సూక్ష్మజీవులను నిరోధిస్తుంది, కానీ నోటిలో గాలి శుద్ధికి ప్రత్యేక వ్యవస్థ లేదు. ఎక్కువగా నోటితో శ్వాస తీసుకునే పిల్లల్లో ముఖ ఎముకల, దంతాల అభివృద్ధి సమస్యలు మొదలైన సమస్యలు రావచ్చని పలు అధ్యయనాలు సూచిస్తున్నాయి. వయసులో ఉన్న వాళ్లు నోటి ద్వారా ఎక్కువగా శ్వాస తీసుకుంటే వారిలో ముఖ కండరాలు, మెడ నొప్పి, తలనొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోటితో శ్వాస తీసుకోవడం అనేది నిద్రపోవడానికి, లేదా నిద్రభంగం సమస్యలకు కారణం అవుతుందని వెల్లడిస్తున్నారు.

నోటితో శ్వాస కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణ సందర్భాల్లో ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం అత్యంత ఆరోగ్యకరంగా ఉంటుందని సూచిస్తున్నారు. ముక్కు అనేది శ్వాసను శుద్ధి చేస్తుందని, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని, ఆక్సిజన్ శోషణను మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు.

READ ALSO: Blood Group Mismatch: వేరే గ్రూప్ రక్తం ఎక్కిస్తే ప్రాణాలకు ప్రమాదమా?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರೌಡಿ sahacharaninda ಜೀವ ಬೆದರಿಕೆ: cm ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು,ನವೆಂಬರ್,11,2025 (www.justkannada.in): ಕುರುಬರ ಸಂಘದ ವಿಚಾರದಲ್ಲಿ ಭಾಗಿ ಆಗದಂತೆ ನನಗೆ...

‘MAHAN’ ವತಿಯಿಂದ ನ.14 ರಂದು ಮೈಸೂರಿನಾದ್ಯಂತ ಸರಣಿ ಉಚಿತ ಆರೋಗ್ಯ ಶಿಬಿರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ವಿಶ್ವ ಮಧುಮೇಹ ದಿನಾಚರಣೆ ಅಂಗವಾಗಿ ನವೆಂಬರ್ 14...

ಇನ್ನರ್ ವೀಲ್ ನ ಧ್ಯೇಯವಾಕ್ಯವೇ ಸ್ನೇಹ ಮತ್ತು ಸೇವೆ- ಶಬರೀಕಡಿದಾಳು

ಹುಣಸೂರು, ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಇನ್ನರ್ ವೀಲ್ ವಿಶ್ವದ ಅತಿದೊಡ್ಡ ಮಹಿಳಾ...

ಪೊಲೀಸರು ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ -ಬಿ.ಚೈತ್ರ

ಮೈಸೂರು,ನವೆಂಬರ್,12,2025 (www.justkannada.in): ಪೊಲೀಸ್ ಎಂದರೆ ಶಿಸ್ತು ಹಾಗೂ ರಕ್ಷಣೆಯ ಪ್ರತೀಕ....