28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

Jubilee Hills by-poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే?

Date:

Jubilee Hills by-poll: రాష్ట్రంలోని హైదరాబాద్ జిల్లా పరిధిలో గల జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 13 (సోమవారం)న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో మొదలైంది. నామినేషన్లను స్వీకరించడానికి చివరి తేదీ అక్టోబర్ 21 (మంగళవారం)గా నిర్ణయించింది ఈసీ. అలాగే నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22 (బుధవారం)న జరుగుతుంది. అభ్యర్థిత్వం ఉపసంహరణకు చివరి తేదీగా అక్టోబర్ 24 (శుక్రవారం)గా నిర్ణయించారు. ఇక పోలింగ్ నవంబర్ 11న నిర్వహిస్తారు. అలాగే ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరిగి, ఎన్నికల ప్రక్రియను నవంబర్ 16 నాటికి పూర్తి చేయాల్సి ఉంటుంది.

Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై కీలక పరిణామం.. సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు

అభ్యర్థులు తమ నామినేషన్లను షేక్‌పేట్ తాసీల్ధార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. నామినేషన్లను ఫారం-2బిలో దాఖలు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి తప్పనిసరిగా ఫారం-26లో అఫిడవిట్‌ను సమర్పించాలి. అన్ని పత్రాలపై అభ్యర్థి సంతకం, నోటరీ సంతకం, నోటరీ సీల్‌తో నోటరైజ్ చేయాలి. అక్టోబర్ 19 (ఆదివారం), అక్టోబర్ 20 (దీపావళి) తేదీల్లో పబ్లిక్ సెలవులు కారణంగా నామినేషన్లను స్వీకరించబడవు. ఇక ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థికి కనీసం 25 సంవత్సరాలు నిండి ఉండాలి. గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులకు నియోజకవర్గానికి చెందిన ఒక్క ఓటరు ప్రపోజర్‌గా ఉండాలి. ఇతర అభ్యర్థులకు మాత్రం నియోజకవర్గానికి చెందిన పది మంది ఓటర్లు ప్రపోజర్లుగా ఉండాలి. అలాగే సెక్యూరిటీ డిపాజిట్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీకి రూ.10,000, ఎస్సీ/ఎస్టీ కేటగిరీకి కుల ధృవీకరణ పత్రంతో పాటు రూ.5,000 నగదు చెల్లించాలి.

Gold Price Today: బంగారంపై ఈరోజు కూడా భారీగా బాదుడే.. వెండిపై ఏకంగా 5 వేలు!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೌಢ್ಯ ವಿರೋಧಿ ಕಾಯ್ದೆ ಜಾರಿಗೆ ಪಟ್ಟಭದ್ರ ಹಿತಾಸಕ್ತಿಗಳಿಂದ ಅಡ್ಡಿ: ಸಿದ್ದರಾಮಯ್ಯ

  ಮೈಸೂರು, ಸೆ.27, 2026: ಸಮಾಜದಲ್ಲಿ ಮೌಢ್ಯ, ಕಂದಾಚಾರ ಹಾಗೂ ಅವೈಜ್ಞಾನಿಕ...

ചോദ്യത്തിന് മറുപടിയില്ല; പകരം കഴുത്തറുക്കല്‍ ആംഗ്യം: അഫ്ഗാന്‍ വനിതാ മാധ്യമപ്രവര്‍ത്തകയോട് പാക് പ്രതിരോധമന്ത്രി

ന്യൂയോര്‍ക്ക്: അഫ്ഗാന്‍ വനിതകളോടുള്ള താലിബാന്‍ നയത്തെക്കുറിച്ച് ചോദിച്ച മാധ്യമ പ്രവര്‍ത്തകയോട് കഴുത്തറുക്കുന്നതിന്...

RTI-ல் சட்டம் – ஒழுங்கு நீக்கம் குறித்த அறிவிப்பு – திரும்பப் பெற்றது தமிழ்நாடு அரசு!

தமிழ்நாட்டில் தகவல் அறியும் உரிமைச் சட்டத்தின் கீழ் சட்டம் ஒழுங்கு குறித்து...

IND Vs WI: భారీ స్కోర్ సాధించిన వెస్టిండీస్.. ఇండియా టార్గెట్ ఎంతంటే..

భారత్, వెస్టిండీస్ మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి...