నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మారియా కొరినా మచాడోకు అమెరికా అధ్యక్షుడు ఫోన్ చేసి అభినందించినట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా మచాడోతో మాట్లాడినట్లు నివేదికలు అందుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: US: అమెరికాలోని ఓ ప్లాంట్‌లో పేలుడు.. 19 మంది మృతి!
ఇక నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోగానే మనాడో కీలక పోస్ట్ చేసింది. ‘‘నేను ఈ బహుమతిని వెనిజులాలోని బాధపడుతున్న ప్రజలకు, మా లక్ష్యానికి నిర్ణయాత్మక మద్దతు ఇచ్చినందుకు అధ్యక్షుడు ట్రంప్‌కు అంకితం చేస్తున్నాను!’’ అని మచాడో రాసుకొచ్చింది. అదే పోస్టును ట్రంప్ షేర్ చేశారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో మచాడో పోస్ట్‌ను తిరిగి షేర్ చేశారు. ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ప్రత్యుత్తరం ఇవ్వలేదు. దీంతో నోబెల్ కమిటీ నిర్ణయానికి ‘మౌన’ ప్రతిస్పందనగా ఇలా కనిపించింది.
ఇది కూడా చదవండి: France: 4 రోజుల క్రితం రాజీనామా.. మళ్లీ ప్రధానిగా లెకోర్ను నియామకం
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2025 నోబెల్ శాంతి బహుమతిపై చాలా ఆశలు పెట్టుకున్నారు. అనేక దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిర్చినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ అనూహ్యంగా ఈ ఏడాది వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు తన్నుకుపోయింది. మచాడో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకున్నట్లు నోబెల్ కమిటి తెలిపింది.
వెనిజులాలో ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో… నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి శాంతియుత పరివర్తన కోసం మచాడో చేసిన పోరాటాన్ని నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తించింది. దీంతో ఆమెను నోబెల్ శాంతి బహుమతి విజేతగా ప్రకటించింది. నోబెల్ శాంతి బహుమతిని మచాడోకు ప్రదానం చేయాలనే నిర్ణయం.. ట్రంప్ నెలల తరబడి చేసిన బహిరంగ ప్రచారానికి చేదు అనుభవం ఎదురైంది.





