29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Shocking Video: మరీ ఇలా తయారయ్యారేంటమ్మా.. అత్తపై కోడలు దాడి

Date:

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తపై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తన కొడుకు దారుణంగా అత్తను హింసించింది కోడలు. అత్తగారు తన కొడుకును జోక్యం చేసుకోవాలని పదే పదే వేడుకుంటుండగా, కోడలు ఆమెను చెంపదెబ్బ కొట్టడం, గాజుతో కొట్టడం దుర్భాషలాడడం చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే… గురుదాస్‌పూర్ జిల్లాలో ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తను… కొడుకు ముందు దారుణంగా కొట్టింది. తన కొడుకును జోక్యం చేసుకోవాలని పదే పదే వేడుకుంటుండగా.. కోడలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా… కోడలు ఆమెను చెంపదెబ్బ కొట్టడం, గాజుతో కొట్టడం, తిట్టడం చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఇందులో కోడలు బాధితురాలి జుట్టును లాగడం, పదే పదే చెంపదెబ్బలు కొట్టింది. అంతే కాకుండా స్టీల్ గ్లాసులతో కూడా ఆమెను బాదింది. బాధితుడి మనవడు సమక్షంలోనే ఈ దాడి జరిగిందని.. ఆ వ్యక్తి ఈ మొత్తం సంఘటనను తన ఫోన్‌లో రికార్డ్ చేశాడని తెలుస్తోంది. అతను తన తల్లిని ఆపమని చెప్తున్నప్పటికి.. అవేమీ పట్టించుకోకుండా అత్తను కోడలు కొడుతూనే ఉంది.

వీడియో వైరల్ కావడంతో.. పంజాబ్ మహిళా కమిషన్ ఈ సంఘటనను సీరియస్ గా తీసుకుని.. గురుదాస్‌పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కి లేఖ రాసింది. అనంతరం బాధితురాలిని మహిళా కమిషన్ సభ్యులు పరామర్శించారు. తన కోడలు హర్జీత్ కౌర్ కొంతకాలంగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తుందని.. బాధితురాలు గుర్బచన్ కౌర్ తెలిపింది. నాలుగు నెలల క్రితం తన భర్త, రిటైర్డ్ బ్లాక్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మరణించిన తర్వాత వేధింపులు ఎక్కువయ్యాయని ఆమె తెలిపారు. మాట్లాడుతూ, తన తల్లి తాగుబోతు అని.. తన నానమ్మ, తండ్రి ఇద్దరిపై తరచుగా దాడి చేస్తుందని బాధితుడి మనవడు, వీడియో చిత్రీకరించిన చరత్వీర్ సింగ్ చెప్పాడు.

పోలీసులకు సమాచారం ఇచ్చినప్పటికీ, హెచ్చరిక జారీ చేయడం తప్ప మరే చర్య తీసుకోలేదని చరత్వీర్ అన్నారు. తన తల్లిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್ ಆರೋಪ: ಸ್ಪಷ್ಟನೆ  ನೀಡಿದ ಸಚಿವ ಹೆಚ್.ಸಿ ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಸಾಂಸ್ಕೃತಿಕ ನಗರಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್...

ബി.ജെ.പി സീല്‍ വിവാദം: ഡെപ്യൂട്ടി സി.ഇ.ഒ മിഷാല്‍ സാഗര്‍ ഭരതിനെ മാറ്റി

തിരുവനന്തപുരം: തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്‍ രാഷ്ട്രീയ പാര്‍ട്ടികള്‍ക്കയച്ച കത്തില്‍ ബി.ജെ.പിയുടെ സീല്‍ ഉള്‍പ്പെട്ട...

அண்ணாவுக்கு பிறகு… நெடுஞ்செழியனை முந்தி கருணாநிதி முதல்வராக, திமுக தலைவராக மாறிய கதை! ஆடுபுலி 11

திமுகவில் துரைமுருகன், கே.என்.நேரு, பொன்முடி, டி.ஆர்.பாலு, ஆ.ராசா, அதிமுகவில் திண்டுக்கல் சீனிவாசன்,...

Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు. యుద్ధం మొదలయ్యాక కూడా అవసరమైతే...