29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

Trump: బిన్ లాడెన్‌ను చంపినోళ్లను ఎవరు మరిచిపోరు.. నేవీ సీల్స్‌‌పై ట్రంప్ ప్రశంసలు

Date:

ఒసామా బిన్ లాడెన్‌ను చంపిన వారిని ఎవరూ మరిచిపోరని ట్రంప్ పేర్కొన్నారు. ఆదివారం వర్జీనియాలోని నార్ఫోక్‌లో అమెరికా నావికాదళం 250వ ఉత్సవాలు సందర్భంగా జరిగిన ప్రత్యేక వేడుకలో ట్రంప్ ప్రసంగించారు. లాడెన్‌ తలలో బుల్లెట్లు దింపిన నేవీ సీల్స్‌ను చరిత్ర ఎప్పటికీ మరిచిపోదని.. ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని ట్రంప్ ప్రశంసించారు. 9/11 దాడికి ఒక సంవత్సరం ముందే లాడెన్ అంతు చూడాలని అధికారులకు సూచించినట్లు గుర్తుచేశారు. కానీ ఎవరూ పట్టించుకోలేదని.. సంవత్సరం తర్వాత అతడు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశాడని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్

2001లో ఒసామా బిన్ లాడెన్ అమెరికా విమానాలను హైజాక్ చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్‌ను పేల్చేశాడు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనంతరం ఒబామా హయాంలో బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు వెంటాడి చంపేశాయి. 2011, మే 2న యూఎస్ నేవీ సీల్స్ బిన్ లాడెన్‌ను చంపేందుకు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్‌ను నిర్వహించాయి. పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌లోని రహస్య ఆపరేషన్ నిర్వహించాయి. నిఘా సంస్థలు కరుడు గట్టిన అల్-ఖైదా ఉగ్రవాది లాడెన్ జాడను గుర్తించి ఆపరేషన్ ప్రారంభించాయి. క్షణాల వ్యవధిలోనే లాడెన్ తలలోకి బుల్లెట్లు దూసుకుపోయాయి. అతనితో పాటు నలుగురు అక్కడికక్కడే హతమయ్యారు. అనంతరం లాడెన్ శవాన్ని సముద్రంలో పడేశారు. మొత్తానికి దశాబ్ద కాలం తర్వాత లాడెెన్‌ను అమెరికా దళాలు అంతుచూశాయి.

ఇది కూడా చదవండి: Singer Zubeen Garg: జుబీన్ గార్గ్ కేసులో మరో ట్విస్ట్! సింగపూర్‌లో మేనేజర్ ఏం చేశాడంటే..!

బిన్ లాడెన్ సౌదీలో జన్మించాడు. ఉన్నత విద్యను అభ్యసించి కరుడు గట్టిన ఉగ్రవాదిగా మారాడు. అల్ ఖైదాను స్థాపించి అనేక దేశాల్లో మారణహోమం సృష్టించాడు. 2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌ను పేల్చేశాడు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం డిసెంబర్ 2001లో పాకిస్థాన్‌కు పారిపోయాడు. ఇక అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా సూచన మేరకు 2011, మే నెలలో అమెరికా దళాలు ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ నిర్వహించి లాడెన్ హతమార్చాయి. పాకిస్థాన్ కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1 ఒంటి గంట ప్రాంతంలో హతమయ్యాడు. అనంతరం శవాన్ని ఆప్ఘనిస్థాన్‌కు తీసుకొచ్చి అరేబియా సముద్రంలో వదిలేశారు. ఈ ఆపరేషన్‌ను ఒబామా వైట్‌హౌస్ నుంచి వీక్షించారు. మే 6, 2011లో లాడెన్ మరణాన్ని అల్ ఖైదా ఉగ్రవాద సంస్థలు ధృవీకరించాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್ ಆರೋಪ: ಸ್ಪಷ್ಟನೆ  ನೀಡಿದ ಸಚಿವ ಹೆಚ್.ಸಿ ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಸಾಂಸ್ಕೃತಿಕ ನಗರಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್...

ബി.ജെ.പി സീല്‍ വിവാദം: ഡെപ്യൂട്ടി സി.ഇ.ഒ മിഷാല്‍ സാഗര്‍ ഭരതിനെ മാറ്റി

തിരുവനന്തപുരം: തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്‍ രാഷ്ട്രീയ പാര്‍ട്ടികള്‍ക്കയച്ച കത്തില്‍ ബി.ജെ.പിയുടെ സീല്‍ ഉള്‍പ്പെട്ട...

அண்ணாவுக்கு பிறகு… நெடுஞ்செழியனை முந்தி கருணாநிதி முதல்வராக, திமுக தலைவராக மாறிய கதை! ஆடுபுலி 11

திமுகவில் துரைமுருகன், கே.என்.நேரு, பொன்முடி, டி.ஆர்.பாலு, ஆ.ராசா, அதிமுகவில் திண்டுக்கல் சீனிவாசன்,...

Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు. యుద్ధం మొదలయ్యాక కూడా అవసరమైతే...